ఎస్టియు మండల ప్రధాన కార్యదర్శిగా గుంటుక శ్రీనివాస్ నియామకం

తొర్రూరు ( డివిజన్) నేటి ధాత్రి:

ఎస్టీయూ తొర్రూరు మండల ప్రధాన కార్యదర్శిగా గుంటుక శ్రీనివాస్ ను నియమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరా చారి తెలిపారు, మంగళవారం హరిపిరాల హైస్కూల్లో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఖాళీ అయిన మండల ప్రధాన కార్యదర్శి పదవి స్థానంలో తొర్రూరు మండలంలోని హరిపిరాల ఎంపీపీ ఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గుంటక శ్రీనివాస్ ను నియమించినట్లు తెలిపారు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఎస్టియు అలుపెరుగని పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు, ఈ సందర్భంగా నూతన మండల ప్రధాన కార్యదర్శి గుంటుక శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఎన్నికలకు సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version