నారాయణ పురం కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం
కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు నారాయణ పురంలో నిర్వహించిన
రోడ్డు షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మండల కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు షోలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్
నాయకత్వాన మున్నూరుకాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.రోడ్డు షో ప్రారంభానికి ముందు నారాయణ పురం శివార్లలో గులాబీ శ్రేణులు,యువత బాణాసంచా పేల్చుతూ,పూలు చల్లుతూ కేటీఆర్ కు దారి పొడవునా అపూర్వ
స్వాగతం పలికారు.ఆ తర్వాత చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.ఫ్లోరోసిస్ రక్కసిని పాతరబెట్టి పరిశుద్ధమైన తాగునీళ్లను అందిస్తున్న, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని ఓటేసి గెలిపించాల్సిందిగా కోరారు.కేటీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.”జై తెలంగాణ జై జై తెలంగాణ”, “జై కేసీఆర్ జై జై కేసీఆర్”, “జిందాబాద్ జిందాబాద్ టీఆర్ఎస్ జిందాబాద్”,”కారు గుర్తుకే మన ఓటు”అనే నినాదాలు హోరెత్తాయి.కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే కిశోర్,మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, మున్నూరు కాపు ప్రముఖులు చల్లా హరిశంకర్,వాసుదేవుల వెంకటనర్సయ్య,ఆర్వీ మహేందర్,వాసాల వెంకటేష్,గుండ్లపల్లి శేషగిరిరావు,విజయ్ భాస్కర్, సీపీఐ,సీపీఎం నాయకులు పాల్గొన్నారు.