రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.
– లక్షా 20 వేల ఫీజు చెల్లింపు
నిరుపేద విద్యార్థి చదువులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో మల్కాజిగిరి ఎమ్మేల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంజనీరింగ్ కళాశాల ఫీజు చెల్లించి చేయూతను అందించారు. మండల పరిధిలోని ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకుగారి శ్రీనివాస్ రెడ్డి గత నెలలో అనారోగ్యంతో మృతిచెందగా, మైనంపల్లి హనుమంతరావు నేరుగా ఆయన ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుమారుడి చదువులకు పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. గత నెలలో ఆయన ఇచ్చిన హామీ మేరకు బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ రెడ్డి కుమారుడి ఫీజు మొత్తం రూ.లక్ష 20వేలు బుధవారం హైదరాబాద్ లోని మైనంపల్లి స్వగృహంలో అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు మైనం పల్లి హన్మంతరావు కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎంఎస్ఎస్ఓ బాధ్యుడు వెంకుగారి శ్రీధర్ రెడ్డి, మేడి గణేష్, తాళ్ల కృష్ణా గౌడ్, సందిరి హరికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.