అధికధరలను నియంత్రించలేని మోడీ ప్రభుత్వం గద్దెదిగాలి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

అధిక ధరలను నియంత్రించలేని మోడీ ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఈసంపెల్లి బాబు, మండల కార్యదర్శి బోళ్ళ సాంబయ్య డిమాండ్ చేశారు.అధిక ధరలకు వ్యతిరేకంగా సిపియం మండల కమిటీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రజలను కులమతాల పేరుతో రెచ్చకొడుతూ ఆదానీ సేవలో తరించుతుండని విమర్శించారు. ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యప్రజలు చితికిపోతున్నారని అన్నారు.ధరలను నియంత్రించడంతో పాటు రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరిండం కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండు చేశారు. తదనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం స్థానిక తహషీల్దార్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి ఓదెలు,పుచ్చకాయల నర్సింహా రెడ్డి, అక్కపెల్లి సుధాకర్, బోళ్ళకొంరయ్య, పొన్నం రాజు, తాళ్ళపెల్లి రవి, కొంగరనర్సింస్వామి, కోడెం రమేష్,గిన్నెసాంబయ్య,లాసాని రాజేశ్వర్ రావు, ఇంగిలికం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version