మాతాశిశు సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

తెలంగాణ ప్రభుత్వం మహిళలుాపిల్లల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి వుంది. ము ఖ్యంగా పౌరుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే కృషిలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇవి కూడా భాగం. దేశంలో కేవలం మహిళలుాపిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ స్వతంత్రంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. పౌషకాహారం, టీకాలద్వారా ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు, ఆరోగ్యం, తదితర అంశాలపై కౌన్సెలింగ్‌ వంటి కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు సంస్థాపరమైన భద్రత కల్పించడం, గృహహింసకు వ్యతిరేక చట్టాలను కఠినంగా అమలు చేయడం, చిన్నపిల్లల వేధిం పులు మరియు బాల్య వివాహాల నిరోధక చర్యలను కచ్చితంగా అమలుచేస్తోంది. ప్రస్తుతం రా ష్ట్రంలో పనిచేస్తున్న 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు, 35,700 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 4లక్షల మంది గర్భిణి మరియు పాలిచ్చే తల్లులు, 14లక్షల మంది ఆరేళ్లలోపు పిల్లలకు రక్షణ కల్పిస్తోంది. చిన్నపిల్లల రక్షణ యూనిట్లు, మహిళలకు సహాయక కేంద్రాలు, సఖి పేరుతో వన్‌ స్టాప్‌ కేం ద్రాలు, వివిధ షెల్టర్ల నిర్వహణ వంటి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మహిళల సంరక్ష ణ, సాధికారత మరియు చిన్నపిల్లల భద్రతకు ఎంతగానో దోహదపడుతున్నాయి.

సమీకృత శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్‌)

సమీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్‌)ను ప్రస్తుతం అంగన్‌వాడీ సర్వీస్‌ ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్నారు. వీటిద్వారా పిల్లలకు, మహిళలకు విద్య, పోషకాహారం, ఆరోగ్యం వంటి సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 149 అంగన్‌వాడీ సర్వీస్‌ ప్రాజెక్టులు పనిచేస్తుండగా, వీటిల్లో 99 గ్రామీణ ప్రాంతాల్లో, 44 పట్టణ ప్రాంతాల్లో మరో 25 గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. మొత్తం 33 జిల్లాల్లో ప్రస్తుతం 37,700 అంగన్‌వాడి కేంద్రాలు తమ సేవలు కొనసాగిస్తు న్నాయి. మహిళాభివృద్ధి`శిశ సంక్షేమశాఖ తాజాగా అంగన్‌వాడి హెల్ప్‌లైన్‌`155209ని ఏర్పా టు చేసింది. ఆరేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు మరియు పాలిచ్చే తల్లులకు సమయానికి తగిన సేవలందించేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఇంటింటికి వెళ్లి కౌన్సెలింగ్‌ సేవలను మరింత బలోపేతం చేయడం మరియు అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు నెలసరి గా చెల్లించే గౌరవవేతనం పెంపుదల వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది.

ఏడబ్ల్యుసీసీ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఎడబ్ల్యుసిల ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం 33 అంగన్‌వాడి కమ్‌ క్రెచ్‌ సెంటర్ల ఏర్పాటుకు అనుమతి మంజూరుచేసింది. పీఏఎల్‌ఏఎన్‌ఏ పథకం కింద చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం అమలు జరుగుతోంది. దీని ద్వారా పిల్లలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 35700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 15,640 కేంద్రాలు ప్రస్తుతం పాఠశాలల ఆవరణల్లోనే పనిచేస్తున్నాయి. వ్యూహాత్మకంగా అంగన్‌వాడీ కేంద్రాలు పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేయడం వల్ల పూర్వ పాఠశాల దశలో పిల్లలకు స్కూల్‌ వాతావరణం అలవాటు కావడమే కాకుండా, చక్కటిపర్యవేక్షణ వల్ల, ప్రాథమిక దశలో పాఠశాలకు వెళ్లడానికి పిల్లలు ఏవిధమైన అనాసక్తిని ప్రదర్శించరు. అంతేకాదు గ్రేడ్‌`1స్థాయిలో చిన్నపిల్లల ప్రవేశాలు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి.

పూర్వ బాల్యదశ సంరక్షణ మరియు విద్య

పూర్వ ప్రాథమిక విద్య ప్రధానంగా 3`6ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లల్లో అన్ని రకాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. అభ్యసన వాతావరణంతో పాటు సామాజిక, భావోద్వేగ, మేధస్సు మరియుకళాత్మక అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. అంగన్‌వాడి కేంద్రాల్లో ప్రభుత్వం పూర్వ పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా పాఠశాలల ఆవరణల్లో వున్న అంగన్‌వాడీ కేం ద్రాలపై ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా జాతీయ విద్యావిధానం`2020కి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం నిర్దేశించిన విధంగా ప్రాథమిక స్థాయిలో సరికొత్త పాఠ్య ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచడం, అంగన్‌వాడీ కార్యకర్తలకు తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ పాఠ్యప్రణాళిక అమలులో భాగంగా తొలిదశలో స్కూళ్ల ఆవరణ ల్లో పనిచేస్తున్న 15640 అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన యూనిఫామ్‌లు, బుక్‌ రాక్‌లు, చౌకీలు, గ్రీన్‌ చాక్‌బోర్డులు, మంచి ఇతివృత్తంతో కూడిన రంగురంగుల పెయింటింగ్‌ల ఏర్పాటుద్వారా 3`6 సంవత్సరాల మధ్యవయస్కులైన పిల్లలకు అభ్యసన వాతావరణాన్ని కల్పిస్తారు.

ఆరోగ్యలక్ష్మిాఅనుబంధ ఆహారం

ఐసీడీఎస్‌ కింద చేపట్టే కార్యక్రమాల్లో అనుబంధ పోషకాహార కల్పన అతిముఖ్యమైంది. మొత్తం 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో దీన్ని అమలుచేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. భారత ప్రభుత్వ నిర్దేశం మేరకు 7నెలలనుంచి 6ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు, గర్భిణులు మరియు పాలిచ్చే తల్లులకు దీన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద గర్భిణులు మరియు పాలిచ్చే తల్లులకు అన్నంతోపాటు, పప్పు, కూర, నూనె, కూరగాయ లు, 200మి.లీ. పాలు మరియు ఒక ఉడకపెట్టిన గుడ్డును అందిస్తారు. ఇక బాలామృతం కింద2.5 కిలోల మిక్స్‌డ్‌ ప్యాక్‌ను పిల్లలకు అందజేస్తారు. ఇందులో వేయించిన గోధుమ, సెనగపప్పు, పాలపొడి, పంచదార, నూనె మరియు 16 గుడ్లును 7 నెలలనుంచి 6ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు అందిస్తారు. అంటే పైన పేర్కొన్న మిశ్రమంలో ప్రతి రోజు వంద గ్రాముల చొప్పున 25 రోజుల పాటు అందజేస్తారు. వయసుకు తగ్గ బరువు లేకపోవడం, పోషకాహారలోపం, శిశువు ల్లో మరణాల రేటును ఇది తగ్గిస్తుంది. ఇక మధ్యాహ్న భోజన పథకం కింద 3`6 మధ్య వయ స్కులైన పిల్లలకు ప్రతిరోజు ఉదయం వేడి అన్నంతో పాటు ఉడకపెట్టిన గుడ్డు, సాయంత్రం స్నా క్స్‌ అందజేస్తారు. ఈ కార్యక్రమం కింద 332678 మంది గర్భిణులు మరియు పాలిచ్చే తల్లు లు, ఏడు నెలల నుంచి 3ఏళ్ల మధ్య వయస్కులైన 10,04,408మంది పిల్లలు, 469654 మంది 3`6 మధ్యవయస్కులైన బాలలు, మరో 8947 మంది పోషకాహార లోపం ఎదుర్కొంటున్న పిల్లలు ఈ కార్యక్రమం కింద ప్రయోజనం పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు కాని ప్రాంతాల్లో మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరలు, అంగన్‌వాడి కేంద్రాల్లో రద్దీ మరియు తగినన్ని అంగన్‌వాడి కేంద్రాలు లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంది. ఈ పథకం అమ లులో మరింత పారదర్శకత కోసం ఈ ప్రభుత్వ శాఖ, మొత్తం సరఫరా శృంఖల నిర్వహణను డిజిటైజ్‌ చేయడమే కాకుండా పోషణ మరియు హెల్త్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలతో అనుసంధానం చేసింది. దీనివల్ల సరఫరా, పంపిణీ పారదర్శక పద్ధతిలో జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలు ఈ పథకం అమలుకు సవాలుగా పరిణమించాయి.

పోషణ్‌ అభియాన్‌

ఇది ప్రధానంగా జీవితచక్రం ఆధారంగా రూపొందించబడిరది. ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదల , వయసుకు తగిన బరువు లేకపోవడం వంటి సమస్యల పరిష్కారంకోసం పోషణ్‌ అభియాన్‌ రూపొందించబడిరది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, కౌమరప్రాయ బాలికలు, గర్భిణీ స్త్రీలు, పిల్ల ల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి పోషణ్‌ అభియాన్‌ ఉద్దేశించబడిరది. మొత్తం 2580 పీఆర్‌ఐలు మరియు డబ్ల్యుటీసీ కార్యకర్తలు (714 సర్పంచ్‌లు, 714 గ్రామ కార్యదర్శులు, 82 ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు మరియు 174 ఏడబ్ల్యుటీలు) పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల్లో పోష కాహార ప్రాధాన్యతపై శిక్షణ పొందారు. ఆవిధంగా పోషకాహార లోప నివారణంలో వీరు పోషణ్‌పంచాయత్‌లుగా వ్యవహరిస్తారు.

ప్రతి నెల పిల్లల బరువు, ఎత్తును లెక్కించి వారిలో పెరుగుదల సక్రమంగా ఉన్నదీ లేనిదీ తెలు సుకునేందుకు వీలగా అంగన్‌వాడీ కేంద్రాలకు ఆయా కొలతల పరికరాలను ప్రభుత్వం అందజే సింది. ఇదే సమయంలో ఎదుగుదల పర్యవేక్షణ నైపుణ్యంపై 1101ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు తగిన శిక్షణ పొందారు. ఈ ఏడాది మార్చి నెలలో ‘పోషణ్‌ పక్వాడా కాంపెయిన్‌’ పేరుతో 15రోజుల కార్యక్రమం నిర్వహించి, స్థానిక ఆహారపు అలవాట్లు, పోషణకు సంబంధించి 20లక్షలమంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. వీరు రాష్ట్రంలో పోషకాహారంపై అవగాహనా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపడతారు.

సమీకృత శిశు రక్షణ పథకం (ఐసీపీఎస్‌)

‘మిషన్‌ వాత్సల్య’ కార్యక్రమాన్ని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానం చేశారు. దీనికింద పిల్లల హక్కులు, అడ్వకెసీ, బాల నేరన్యాయ చట్టం`2015 కింద బాల నేరన్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం, పిల్లలపై లైంగిక నేరాల రక్షణ చట్టం`2012 కింద లైంగిక వేధింపులనుంచి రక్షణ కల్పన వంటి కార్యక్రమాలను కూడా ఈ పథకం కింద చేపడతారు. భారత్‌లోని ప్రతి పిల్ల, పిల్లవాడు తమ బాల్యాన్ని సురక్షితమైన, స్వేచ్ఛాయుత, ఆరోగ్యకరమైన వాతావరణంలో గడపాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. సంక్లిష్ట పరిస్థితుల్లో పిల్లలకు సంస్థాగతేతర సంరక్షణకు కూడా ఈ పథకం ప్రాధాన్యతనిస్తుంది. కుటుంబం, సామాజిక పరంగా పిల్లలకు పూర్తి భద్రత కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35 చిల్డ్రన్స్‌ హోమ్‌లు పనిచేస్తున్నాయి. 2023`24 ఆర్థిక సంవత్సరంలో 8282 పిల్లలకు అవసరమైన రక్షణ కల్పించగా, 1022 బాల్య వివాహాలను అరికట్టారు. ముస్కాన్‌ అండ్‌ స్మైల్‌ పథకం కింద 4851 మంది పిల్లలను రక్షించగా, మరో 5933 మంది పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఇదే సమ యంలో దేశీయ మరియు అంతర్జాతీయంగా 166 దత్తత స్వీకారాలు జరిగాయి.

బాల నేరస్తుల సంక్షేమం

బాలనేరన్యాయ చట్టరా2000ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. నిర్లక్ష్యానికి గురైన పిల్లల సంరక్షణ, చికిత్స, పునరావాసం వంటి సేవలను అందిస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలనేరస్తుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఏడు హోమ్‌లు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్ర భుత్వం 33 బాలనేరస్తుల న్యాయ బోర్డులను నెలకొల్పింది.

దివ్యాంగులు, ట్రాన్స్‌జండర్లు, వృద్ధుల సంక్షేమం

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోంది. వీరికి భౌతిక, మానసిక,సామాజిక, విద్యాపరమైన మరియు ఆర్థిక పునరావాస కల్పనకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా 496825మంది దివ్యాంగులకు, 1542877 మంది వృద్ధులకు పింఛన్లు అందజే స్తోంది. దివ్యాంగులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా సొంతంగా యూనిట్లు పెట్టుకోవాల నుకుంటున్న ఔత్సాహికులకు స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీలు అందజేస్తోంది. ఇందులో భాగంగా 2023`24 ఆర్థిక సంవత్సరంలో రూ.5.51కోట్లు మంజూరు చేయగా 841 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందారు. అదేవిధంగా దివ్యాంగులను మామూలు వ్యక్తులు వివాహంచేసుకున్నట్లయితే ప్రోత్సాహకం కింద రూ.లక్ష ప్రభుత్వం అందజేస్తోంది. 2023 డిసెంబర్‌నుంచి 2024 జూన్‌వరకు దీనికింద రూ.2.6కోట్లు మంజూరు చేయగా 226మంది లబ్దిదారులు ప్రయోజనం పొందారు. ప్రభుత్వం ట్రాన్స్‌`ఉమెన్‌ షెల్టర్‌ హోమ్‌లను ఏర్పాటు చేయాలని సంక ల్పించింది. ఇందులో అనాధలైన మహిళలకు ఆశ్రమయం కల్పించి, భోజన, వైద్య సదుపాయా లు కల్పిస్తారు. వీటితో పాటు వారికి వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ కూడా అందిస్తారు. అంతేకాకుండా లింగ నిర్ధారణకు అవసరమైన హార్మోనల్‌ చికిత్సలు, సర్జరీల సదుపాయం గాంధీ మరియు ఉస్మానియా ఆసుపత్రుల్లో కల్పించారు. తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీతో సహకారంతో జిల్లా ఆసుపత్రుల్లో ట్రాన్స్‌జండర్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లను కూడా ఏర్పాటుచేశారు. ట్రాన్స్‌జెండర్‌లకు అమలు జరిపే పథకాలకోసం హెల్ప్‌లైన్స్‌కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పి.డబ్ల్యుడి. లోల్‌ ఫ్రీ నెంబరు: 155326.

మిషన్‌ శక్తి

మహిళల భద్రత, సాధికారతకోసం కేంద్ర ప్రభుత్వం మిషన్‌ శక్తిని అమలుచేస్తోంది. దీనికింద రెండు ఉప పథకాలున్నాయి. మొదటిది ‘సంబల్‌’ కాగా రెండవది ‘సామర్థ్య’ సంబల్‌ ఉప`పథ కం కింద శక్తి/వన్‌ స్టాప్‌ సెంటర్స్‌ (ఒఎస్‌సీలు) మరియు మహిళల హెల్ప్‌లైన్‌`181 పనిచేస్తు న్నాయి. ఏర్పాటైన తర్వాత తెలంగాణలోని 36 ఒ.ఎస్‌.సిలు 62,448 కేసులను పరిష్కరించారు.ఇవన్నీ మహిళలపై హింసకు సంబంధించివే! మహిళల హెల్ప్‌లైన్‌కు రెండు మిలియన్ల కాల్స్‌ వచ్చాయి. వీటిల్లో గృహహింస, లైంగిక నేరాలు, సైబర్‌ క్రైమ్‌ తదితర సమస్యలకు సంబంధించినవి వున్నాయి. సంబల్‌ కింద చేపట్టిన బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమం తెలంగాణలోని 33 జిల్లాల్లో అమలవుతోంది.

సామర్థ్య పథకం కింద 20 శక్తి సాధనలు మహిళల్లో సాధికారతను ప్రోత్సహిస్తున్నాయి. వీటిల్లో 18 స్వాధార్‌ గృప్‌ా, 2 ఉజ్వల హోమ్స్‌ వున్నాయి. వీటిల్లో వివిధ పరిస్థితుల్లో అక్రమ రవాణా కు గురైన మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఒక స్టేట్‌ హోమ్‌ను కూడా వీరికోసం ఏర్పాటుచేశారు. ఇవి 33 జిల్లాల్లో పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా శక్తి నివాస్‌ పేరుతో ఏర్పాటు చేసిన హోమ్‌లను వర్కింగ్‌ వుమెన్‌ కోసం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో 14 వర్కింగ్‌ వుమెన్‌ హాస్టళ్లు పనిచేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!