mamidi pandlatho jagratha, మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి సీజన్‌ వచ్చింది. దోరగా కంటికి ఇంపుగా ఉన్నాయని మామిడి పండ్లను కొని తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. మామిడి పండ్లను అమ్మే వ్యాపారులు మార్కెట్‌లో వ్యాపారాన్ని దష్టిలో ఉంచుకుని పచ్చి మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని వివిధ రకాలుగా మాగబెట్టి ఉంచుతున్నారు. ఇలా ఒక్కరోజు పచ్చి మామిడికాయలను ఉంచితే చాలు రెండురోజుల్లో దోరగా పండిన మామిడి పండ్లు రెడీ. వాటినే వ్యాపారులు మార్కెట్లకు తరలిస్తున్నారు. కంటికి దోరగా పండినట్లు కనబడే మామిడి పండ్లను చూసి వినియోగదారులు మోసపోతున్నారు. రసాయనాల ద్వారా మగ్గపెట్టిన మామిడి పండ్లను తీసుకున్న వారికి తొలుత కడుపునొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్‌ సమస్య, విరేచనాలు, వాంతులు మొదలవుతాయి. చివరకు మనిషి పూర్తిగా నీరసించిపోతాడు. తిరిగి కోలుకోవడానికి సెలైన్‌ పెట్టాల్సి రావచ్చు. అంతేకాదు ఈ సీజన్‌ మొత్తం ఇటువంటి కాయలను తీసుకున్న వారిలో పెప్టిక్‌ అల్సర్‌ తలెత్తే తీవ్రమైన ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు అమ్ముతున్న మామిడి పండ్లు సరైనవో…కాదో తనిఖీ చేయాల్సిన అధికారులు జాడ లేకుండా పోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాగా నల్లటి మచ్చలతో పండిన మామిడికాయ దర్శనమిస్తే అది రసాయనాల ద్వారా మగ్గబెట్టిందని తెలుసుకోవాలి. అయితే అన్ని సందర్భాల్లో ఇది నిజమని చెప్పలేమంటున్నారు నిపుణులు.

రసాయనాల పండును ఎలా గుర్తించాలి

రసాయనాలతో పండించిన మామిడి పండు తొక్క, మామిడికాయను తినేటపుడు తేలికగా ఊడిపోతుంటుంది. అదే చెట్టుకే పండిన మామిడికాయ అయితే మంచి సువాసనను కలిగి తినేటపుడు తొక్క కూడా చాలా దఢంగా ఉంటుంది. అదే మధురఫలం. అయితే ఇందులోనూ కల్తీ రాయుళ్లు ఎందరి ఆరోగ్యంతోనో చెలగాటమాడుతున్నారన్నమాట.

మామిడిపండు తింటే ఆరు ఉపయోగాలు

వేసవికాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం…

1. మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్‌ సి ఇంకా ఫైబర్‌ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

2. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్‌ కూడా ధడంగా ఉంటుంది.

3. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం ఇంకా అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.

4. దోరగా పండిన మామిడిలో ఐరన్‌ సమద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్‌ ఎర్ర రక్తకణాల వద్దికి దోహదపడుతుంది.

5. ఈ పండులో వుండే విటమిన్లు, ఇంకా ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. శంగారంలో ఆసక్తి లేనివారికి శంగార వాంఛను కలిగిస్తుంది.

6. మామిడిపండులో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్‌ అనే పదార్దం సమద్దిగా ఉంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

అతిగా తిన్నా ఇబ్బందే

ప్రస్తుతం చాలామంది వ్యాపారులు మామిడి పండ్లను సహజసిద్ధంగా మాగబెట్టడం లేదు. కాల్షియం కార్బైడ్‌ అనే కెమికల్‌ను వాడి ఆర్టిఫిషియల్‌గా మగాబెడుతున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులు లాగడం, తిమ్మెర్లు వంటి రుగ్మతల బారిన పడతారు.

అజీర్తి సమస్య

సరిగా మాగని మామిడి పండ్లను తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో మంట, సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు. పచ్చి మామిడిని ఎంత తక్కువ తింటే అంత మంచిది.

చర్మ సంబంధిత వ్యాధులు..

మామిడి పండ్లను విపరీతంగా తినేవాళ్లలో గమనించిన మరో సమస్య అలర్జీ. చర్మంపై బొబ్బలు, సెగగడ్డలు, ఎర్రటి కాయలు వస్తాయి. మామిడి పండ్లు శరీరానికి వేడి చేస్తాయని పెద్దలు అంటుంటారు. అందువల్లే సెగగడ్డలు వస్తాయి.

మధుమేహం పెరుగుతుంది

మామిడి పండ్లలో ఫ్రక్టోజ్‌ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్‌ లెవెల్స్‌ అమాంతం పెరిగిపోతాయి. డయాబిటిస్‌తో బాధపడుతున్నవారు. మామిడి పండ్లకు దూరంగా ఉండటమే ఉత్తమం అని నిపుణులు తెలుపుతున్నారు.

చోద్యం చూస్తున్న మార్కెట్‌ అధికారులు :

వరంగల్‌ పండ్ల మార్కెట్‌లో మామిడి అమ్మకాలు జోరందుకున్నాయి. మార్కెట్‌ ఆదాయాన్ని పెంచడంలో దష్టి పెట్టిన అధికారులు మామిడి పండ్లు రసాయనాలతో మాగబెట్టి తీసుకువస్తున్న దళారులపై చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు రసాయన ద్రవ్యాల నియంత్రణపై దష్టి సారించాలని మామిడి ప్రియులు కోరుతున్నారు. దళారులకు అడ్డాగా పండ్ల మార్కెట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డాలు వేసి మారుబేరం చేసి మార్కెట్‌ ఆదాయానికి గండి కోడుతున్నారని చెప్పొచ్చు. దళారితనాన్ని నిర్మూలించి మార్కెట్‌ ఆదాయానికి గండి పడకుండా చూడాలని మార్కెట్‌ లైసెన్స్‌ దారులు కోరుతున్నారు.

prakruthi prakash endariko adarsham: yasmin basha, ప్రకతి ప్రకాష్‌ ఎందరికో ఆదర్శం : యాస్మిన్‌ బాషా

ప్రకతి ప్రకాష్‌ ఎందరికో ఆదర్శం : యాస్మిన్‌ బాషా

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న కార్యక్రమానికి సామాజిక సేవకుడు ప్రకతి ప్రకాష్‌ శ్రీకారం చుట్టడం ఎంతో గొప్ప విషయమని సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రకతి ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులలో ఉచితంగా చల్లని నీరు పంపిణీ కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్న తరుణంలో ఎదుటి వారికి కూడా సాయం చేయాలనే భావనను ప్రకాష్‌ అందరికీ కల్పిస్తున్నారని అన్నారు. వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడని తెలిపారు. వనజీవి రామయ్యని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో వేలసంఖ్యలో మొక్కలు నాటడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టడం సంతోషకరమన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో బస్సులో ప్రయాణించడం ఎంతో ఇబ్బందిగా ఉంటుందని చాలా సందర్భాల్లో గుక్కేడు నీటికోసం తరువాత స్టాప్‌ వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఎదురవుతుందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన ప్రకాష్‌ ఆర్టీసీ బస్సులలో చల్లని నీటిని ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమన్నారు. ప్రకాష్‌ ఆలోచనకు సహకరించిన ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్‌, సిబ్బందిని సైతం ఆమె అభినందించారు. ప్రకతి ప్రకాష్‌ మాట్లాడుతూ చల్లని నీరు పంపిణీలో బాగంగా సిరిసిల్ల నుండి హైదరాబాద్‌, కరీంనగర్‌ వెళ్లే నాన్‌స్టాప్‌ బస్సులలో చల్లని నీటి బబుల్స్‌ని ఏర్పాటు చేయడం చేశామన్నారు. ప్రతి రోజు 32 చల్లని నీటి బబుల్స్‌ని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగిస్తున్నామని, అందుకోసం ప్రతి రోజూ రూ.640 వెచ్చిస్తున్నట్లు వేసవికాలం ముగిసే వరకు బస్సులో ప్రయాణించే ప్రయాణికుల దాహాన్ని తీరుస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి చక్కని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన జెసి యాస్మిన్‌ బాషాకి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

vidyarthini atmahatyayatnam, విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం

విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన జామాండ్ల అంజలీ పరీక్ష ఫెయిల్‌ కావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటర్‌లో ఫిజిక్స్‌ పరీక్ష ఫెయిల్‌ అయిన నేపథ్యంలో మనస్థాపానికి గురై కిరోసిన్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబసభ్యులు, బంధువులు అంజలిని హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజలి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అంజలి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అంజలి నెక్కొండ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివింది.

rajinama yochanalo mantri jagadesh reddy…?, రాజీనామా యోచనలో మంత్రి జగదీష్‌రెడ్డి…?

రాజీనామా యోచనలో మంత్రి జగదీష్‌రెడ్డి…?

ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలు, నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాల మూలంగా విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఆయన తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది. వీటన్నింటికి తాను నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని జగదీష్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలగజేసుకుని నష్టనివారణ చర్యలు చేపడుతూ ఉచిత వెరిఫికేషన్‌ చేయాలంటూ అధికారులను ఆదేశించిన ఫలితాల్లో గందరగోళం విషయం రోజురోజుకు చిలికిచిలికి గాలివానగా మారుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఆందోళనకు దిగుతుండడం, రాష్ట్ర గవర్నర్‌ ఫలితాల విషయంలో ఆరా తీయడం, సున్నా మార్కులు రావడం ఏంటని అధికారులను ప్రశ్నించడంతో ఇది మరింత సీరియస్‌గా మారింది. వీటన్నింటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న జగదీష్‌రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఫలితాల విషయంలో నెలకొన్న గందరగోళం మూలంగా నష్టనివారణ జరగాలంటే మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామా చేస్తే పరిస్థితి కొంతమేర చక్కబడుతుందని ప్రతిపక్షాలు, విద్యార్థుల ఆందోళనలను తగ్గించవచ్చని ప్రభుత్వం సైతం అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. జరిగిన లోపాలను సవరించుకుని విద్యార్థులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిస్తున్న పరిస్థితిని చక్కబెట్టాలని కోరుతున్న జగదీష్‌రెడ్డి మాత్రం రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం టిఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారిందని తెలిసింది. మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామా చేస్తే ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టవచ్చని కొందరు గులాబీ నాయకులు అంటున్నారు. పరిస్థితి చక్కబడుతున్న వేళ రాజీనామా యోచన ఎందుకని కొందరు అంటున్నారు.

inter re-varificationku sahakaristam, ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌కు సహకరిస్తాం

ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌కు సహకరిస్తాం

రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌కు ఉచితంగా అనుమతించి ఫెయిలైన 3లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ఇంటర్‌ అధ్యాపకుల జెఎసి కతజ్ఞతలు తెలిపింది. అద్యాపకుల జెఎసితో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సమావేశమై రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ఏర్పాట్లపై చర్చించారు. సమావేశం అనంతరం అధ్యాపకుల జెఎసి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. వేసవి సెలవులతో సంబంధం లేకుండా విద్యాశాఖలోని 25వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియకు సహకరించాలని జనార్దన్‌రెడ్డి కోరారని, దానికి తాము సమ్మతించామని ఆయన చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం అవసరమైతే అదనపు గంటలు పనిచేయాలని కోరారన్నారు. సరైన ప్రమాణాలు లేని గ్లోబరీనా సంస్థ వల్లే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయని మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో తప్పులు వస్తాయని మూడునెలల ముందే చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ పరిణామాలకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ బాధ్యత వహించాలని జెఎసి నేతలు పరోక్షంగా ఆరోపించారు. రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శికి అప్పగించడం మంచి నిర్ణయమన్నారు. ఇంటర్‌ బోర్డు రద్దు చేస్తారని తాము అనుకోవడం లేదని, ముఖ్యమంత్రి అన్ని అంశాలను పరిశీలిస్తారని భావిస్తున్నట్లు మధుసూదన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

acbki pattubadina public prosecutor, ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. గురువారం రాజేంద్రనగర్‌ కోర్టులో లంచం తీసుకుంటుండగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి 15వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పిపి ప్రసన్నలక్ష్మిని రాజేంద్రనగర్‌ కోర్టులో పట్టుకున్నారు.

అధికారులపై గవర్నర్‌ ఆగ్రహం

అధికారులపై గవర్నర్‌ ఆగ్రహం

పదో తరగతి పాసైన విద్యార్థులు..ఇంటర్మీడియట్‌లో ఎందుకు ఫెయిల్‌ అవుతున్నారని, వారికి సున్నా మార్కులు రావడం ఏంటి’ అని గవర్నర్‌ నరసింహన్‌ అధికారులను ప్రశ్నించారు. ‘ఎన్నడూ లేనట్టు ఇంటర్‌ ఫలితాలపై వివాదం ఎందుకు జరుగుతోందని, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌ విద్యార్థుల ఆందోళనలతో తాజా పరిస్థితిపై నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాంతో బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40నిమిషాల పాటు ఆయన అధికారుల నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడానికి కారణమేంటని అడిగారు. ఇటువంటి పరిస్థితి పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, ఇంటర్‌ బోర్డు విశ్వసనీయత పెంచేలా చర్యలు ఉండాలని ఆదేశించారు. 3.2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని, వీరి జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఉచితంగా చేయాలని సీఎం ఆదేశించారని అధికారులు తెలిపారు. తొలుత సెకండియర్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్ణీత వ్యవధిలో వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియలు పూర్తిచేయాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి మానవ తప్పిదంతో నష్టపోకుండా చూడాలని గవర్నర్‌ స్పష్టం చేశారు. నాలుగురోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

2 నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు

2నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు

వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మే నెల 2 నుంచి 20వ తేదీ వరకు జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, జర్నలిస్టుల మానసిక ప్రశాంతత కోసం ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని హన్మకొండ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, పెరుమాండ్ల వెంకట్‌ తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్‌, వాలీబాల్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌, చెస్‌ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నామని వారు సంయుక్తంగా వెల్లడించారు. ఆసక్తి గల జర్నలిస్టులు ఈనెల 30వ తేదీ లోపు ఆయా క్రీడల టీముల వివరాలను ప్రెస్‌క్లబ్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే జర్నలిస్ట్‌ క్రీడాకారులు ప్రెస్‌క్లబ్‌ సభ్యులు మాత్రమే అయి ఉండాలని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ కోశాధికారి బొమ్మినేని సునీల్‌రెడ్డి, స్పోర్ట్స్‌ కమిటీ కన్వీనర్‌ అర్షం సదానందం, ప్రెస్‌ క్లబ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

acbki pattubadina public prosecutor, ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. గురువారం రాజేంద్రనగర్‌ కోర్టులో లంచం తీసుకుంటుండగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి 15వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పిపి ప్రసన్నలక్ష్మిని రాజేంద్రనగర్‌ కోర్టులో పట్టుకున్నారు.

adhikarulanu suspend cheyali, అధికారులను సస్పెండ్‌ చేయాలి

అధికారులను సస్పెండ్‌ చేయాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును ఆడ్డుకుని, డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని దళితరత్న అవార్డు గ్రహీత జన్ను రాజు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం తొలగించి చెత్త డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను శిక్షించాలని, వెంటనే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం తొలగించిన స్థలంలోనే విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పినింటి రవీందర్‌రావు, ఆడెపు సోమయ్య, సారయ్య, ఉప్పలయ్య, కుమార్‌, సతీష్‌, చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

vidyashaka mantrini tholiginchali, విద్యాశాఖ మంత్రిని తొలిగించాలి

విద్యాశాఖ మంత్రిని తొలిగించాలి

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలలో తప్పులు దొర్లాయని పూర్తి బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వహించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని బిసి సంక్షేమ సంఘం యువజన విభాగ జాతీయ కార్యదర్శి కల్లూరి పవన్‌ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

prapancha maleria nirmulana dinnostvam, ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం

ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం

ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వైద్యులు డాక్టర్‌ నరేష్‌, డాక్టర్‌ రాహిల్‌ మాట్లాడుతూ నేడు కీటక జనిత వ్యాధుల నియంత్రణా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మలేరియా వ్యాధిని సమూలంగా నిర్మూలించడమే ప్రపంచంలోని దేశాల ధ్యేయమని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే మలేరియా వ్యాధి వ్యాప్తిచెందకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఇళ్లలో దోమ తెరలను వాడాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో వెంకటాపురం, ఎదిరా పిహెచ్‌సిల వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

collectorku vinathi, కలెక్టర్‌కు వినతి

కలెక్టర్‌కు వినతి

ములుగు కలెక్టర్‌ కార్యాలయం ముందు ఇంటర్‌ ఫలితాల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అవకతవకాలపై నిరసన తెలిపి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలు, బోర్డ్‌ నిర్లక్ష్యం ఐటి కంపెనీ నిర్వాకం తదితర అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని, విధ్యార్థులకు సంపూర్ణ న్యాయం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, టౌన్‌ అధ్యక్షులు యూనిస్‌, బానోత్‌ రవిచందర్‌, తిరుపతిరెడ్డి, కంబాల రవి, జన్ను రవి, గండ్రకోట కుమార్‌, గోపాలరావు, సర్పంచ్‌ రత్నం, భద్రయ్య, గండ్రత్‌ విజయకార్‌, రవి, సజన్‌, రాంబాబు, నాజర్‌, ముంజల బిక్షపతి, వెంకటేష్‌, యుగేందర్‌, వెంకన్న, మధు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

railu kindapadi inter vidyarthi atmahatya, రైలు కిందపడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

రైలు కిందపడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్కొండ మండలం మత్తడి తండాకు చెందిన బానోత్‌ నవీన్‌ అనే విద్యార్థి నెక్కొండ – ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

hanamkondalo vijayashanti arrest, హన్మకొండలో విజయశాంతి అరెస్ట్‌

హన్మకొండలో విజయశాంతి అరెస్ట్‌

ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ముట్టడిలో పాల్గొనేందుకు వచ్చిన టీపీసీసీసి చైర్‌పర్సన్‌ విజయశాంతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ఏకశిలా పార్కు నుంచి కాంగ్రెస్‌ ర్యాలీ మొదలు కాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న విజయశాంతిని అరెస్ట్‌చేసి హసన్‌పర్తి పోలీసుస్టేషన్‌కు తరలించారు. హన్మకొండ, సుబేదారి పోలీస్‌స్టేషన్‌లకు తరలించే వీలు ఉన్న పోలీసులు ముందు జాగ్రత్తగా ఇక్కడకు తరలించినట్లు తెలిసింది. నగరానికి దూరంగా ఉంటే ఆందోళన తగ్గుతుందని పోలీసులు ఇలా వ్యవహరించినట్లు తెలిసింది. కాగా పోలీసుల తీరుపై రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

kishanreddyki matruviyugam, కిషన్‌రెడ్డికి మాతవియోగం

కిషన్‌రెడ్డికి మాతవియోగం

బీజేపీ నేత కిషన్‌రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ (80) కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత అండాలమ్మ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం ఆమె స్వస్థలం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. కిషన్‌రెడ్డి తల్లి మృతిచెందిన విషయం తెలిసిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమె మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపి, కిషన్‌రెడ్డిని పరామర్శించారు.

ambedkar vigrahanni punaprathishitinchali, అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి

అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని పంజాగుట్ట సెంటర్‌లో పున:ప్రతిష్టించాలని, లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చడం, ఎస్సీ, ఎస్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, ప్రభుత్వం వెంటనే అంబేద్కర్‌ విగ్రహన్ని పున:ప్రతిష్టించాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను ఏకం కావాలని, ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండి.నయిం, జాతీయ నాయకులు చిన్నపెల్లి శ్రీనివాస్‌, వస్కుల ఉదయ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు ఫమిజుల్లా, బిసి సెల్‌ సెక్రటరీ లెనిన్‌, తూర్పు ఇన్‌చార్జ్‌ ప్రసన్నకుమార్‌, క్రాంతి, జిల్లా డైరెక్టర్‌ వజిద్‌ అలీ, జిల్లా నాయకులు ఎండి.సుబాని, రాష్ట్ర నాయకులు రాబర్ట్‌ విల్సన్‌, రవీందర్‌, జెసి రవీందర్‌, సయిద్‌, అంబాల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

kaleshwaram project wet run vijayavantham, కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్క తం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్‌ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వ చేసేందుకు మొత్తం 82మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కనిష్టంగా 2.66మెగావాట్ల నుండి మొదలు 26, 40, 106…ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న..బాహుబలిగా పిలిచే 139మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పాట్లు వివిధ దశల్లో ఉన్నాయి. నందిమేడారం పంపుహౌజ్‌లో 124.4మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమరుస్తున్నారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్‌ పూర్తి చేసుకొని, వెట్‌ రన్‌ కు సిద్ధంగా ఉన్నాయి.

zptc abyarthiga nomination dakalu, జడ్పీటిసి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

జడ్పీటిసి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

వీణవంక మండలకేంద్రంలో జడ్పీటిసిగా రామకష్ణపూర్‌ సర్పంచ్‌ మ్యాకల సమ్మిరెడ్డి సతీమణి మ్యాకల అనిత నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక సర్పంచ్‌ నీల కుమార్‌, ఉపసర్పంచ్‌ భాను, సిద్దెపెల్లి మహిపాల్‌రెడ్డి అభ్యర్థిని ప్రతిపాదించారు.

chinna nagaramlo health camp, చిన్ననాగారంలో హెల్త్‌క్యాంప్‌

చిన్ననాగారంలో హెల్త్‌క్యాంప్‌

నూగూరు వెంకటాపురం మండలంలోని చిన్న నాగారం గ్రామంలో బుధవారం హెల్త్‌క్యాంప్‌ నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో బిపి, షుగర్‌ తదితర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరికీ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ హెల్త్‌ క్యాంప్‌లో డాక్టర్‌ రాజమౌళి, సిబ్బంది వై.సరోజన, రాఘవులు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version