nanyatha patinchali, నాణ్యత పాటించాలి

నాణ్యత పాటించాలి

కమ్యూనిటీ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనాన్ని పురపాలక సంఘం కమిషనర్‌ పర్యవేక్షించారు. అనంతరం ఇందిరా, నెహ్రూ పార్కులను సందర్శించి పార్క్‌, స్విమ్మింగ్‌ పూల్‌లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను గోడలపై చిత్రీకరించడంతోపాటు లైఫ్‌ గార్డ్స్‌, సెఫ్‌ బెలూన్స్‌, ట్యూబ్లను సిద్దంగా ఉంచుతూ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ క్లోరినేషన్‌ చేయాలని సూచించారు. అదేవిధంగా మాస్‌ డ్రైన్‌ క్లీనింగ్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

ennikala abjarvar thaniki, ఎన్నికల అబ్జర్వర్‌ తనిఖీ

ఎన్నికల అబ్జర్వర్‌ తనిఖీ

సాధారణ ఎన్నికల వ్యయపరిశీలకులు శ్రీనివాస్‌ మండలకేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల నిర్వహణ పట్ల మండల ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్న పనుల పట్ల రికార్డులను తనిఖీ చేశారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు, పోస్టల్‌ బ్యాలెట్లు, ఓటింగ్‌ విధానంపై ఎన్నికల అధికారిని గుంటి పల్లవిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలు, జరిగే విధానం, రికార్డుల పట్ల ఆయన సంతప్తి వ్యక్తపరిచారు. అలాగే పోలింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలన చేసి అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఇఓపిఆర్‌డి ఖాజామైనోద్దిన్‌లు ఉన్నారు.

ennikala nirvahanapia avagahana kaligi undali, ఎన్నికల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి

స్థానిక ఎన్నికల నిర్వహణ పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మండల ఎన్నికల అధికారిణి, దుగ్గొండి ఎంపిడివో గుంటి పల్లవి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో 187 మంది పిఓ, ఏపిఓలకు ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. ఓటర్లు ఓటు వేసే విధానం పట్ల, ఓటు వేశాక బ్యాలెట్‌ పత్రం మడత చేసే విధానంతోపాటు పలు అంశాలను పూర్తిస్థాయిలో అధికారులతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాసరావు, ఈవోపీఆర్‌డి ఖాజామైనోద్దిన్‌లతోపాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

thvaralo kulo disaster management course, త్వరలో కెయులో డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు

త్వరలో కెయులో డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో డిసాస్టర్‌ మేనేజిమెంట్‌ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టాలని మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్‌.సాయన్నను వరంగల్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కోశాధికారి ఎం.నాగయ్య, రాష్ట్ర మేనేజింగ్‌ కమిటీ సభ్యుడు ఈ.వీ.శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యుడు బొమ్మినేని పాపిరెడ్డి కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్‌.సాయన్న మాట్లాడుతూ ఏదేని డిసాస్టర్‌ జరిగినపుడు ఏ విధంగా ప్రాణాలను కాపాడుకోవాలని, ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు డిసాస్టర్‌ మేనేజిమెంట్‌ చేసిన వారికి తెలుస్తుందని అన్నారు. డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, త్వరలో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తామన్నారు.

తలసీమియా బాధితుల కోసం…

కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో త్వరలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. వరంగల్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ పాలకవర్గ సభ్యులు తలసీమియా, సికిల్‌ సెల్‌ వ్యాధిగ్రస్తులకు రోజు 10 నుండి 20 యూనిట్ల రక్తం అవసరం అని, రక్తనిధి కేంద్రంలో రక్తనిల్వలు తగ్గి వ్యాధిగ్రస్తులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్‌.సాయన్న కాకతీయ యూనివర్సిటీ అద్వర్యంలో త్వరలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలిపారు.

Zillalo bjp nayakula arrestulu, జిల్లాలో బిజెపి నాయకుల అరెస్టులు

జిల్లాలో బిజెపి నాయకుల అరెస్టులు

ఇంటర్‌ విద్యార్థుల మార్కులలో జరిగిన అవకతవకలపై శాంతియుతంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను అప్రజాస్వామికంగా అడ్డుకొని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ను ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఉదయం నాలుగుగంటల నుండే బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయం నుండి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు బయలుదేరారు. వీరిని హనుమకొండ ఏసిపి శ్రీధర్‌ ఆధ్వర్యంలో హంటర్‌రోడ్‌లో భారీగా పోలీసులను మోహరించి కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న బిజెపి నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ వాహనాలలో సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ ఉదయం నుండి బిజెపి నాయకులను ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించడాన్ని బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలతో 24మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంతమంది విద్యార్థులు బలవన్మరణం చెందిన కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ కాదు…ఆత్మహత్యల తెలంగాణగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మార్చారని ఎద్దేవా చేశారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని కేసీఆర్‌ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇక్కడ ఇంతమంది విద్యార్థులు చనిపోతే కేసీఆర్‌, కేటీఆర్‌ ఎమ్మెల్యేలను కొనడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. నేటి వరకు కూడా ప్రభుత్వం నుండి స్పష్టమైన స్పందన రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇంత మంది విద్యార్థులు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. మతిచెందిన ప్రతి విద్యార్థి కుటుంబానికి 25లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్లోబరీనా సంస్థ గురించి తెలియదని మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటి వరకు కూడా అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన వారిపై, వారికి అండగా ఉంటున్న పెద్ద తలకాయలపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మే 2న నిర్వహించనున్న బంద్‌లో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపాలని పిలుపునిచ్చారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బిజెపి రాష్ట్ర నాయకులు గండ్రతి యాదగిరి, రావుల కిషన్‌, అర్బన్‌ జిల్లా నాయకులు కొలను సంతోష్‌రెడ్డి, సంగని జగదీశ్వర్‌, మండల సురేష్‌, పాశికంటి రాజేంద్రప్రసాద్‌, బాకం హరీశంకర్‌, మామిడాల నరేందర్‌, నర్సింగ్‌గౌడ్‌, శేషగిరిరావు, గోగికార్‌ అనిల్‌కుమార్‌, గడల కుమార్‌, నవనగిరి నిర్మల, వలబోజు శ్రీనివాస్‌, చాంద్‌పాషా, కందగట్ల సత్యనారాయణ, కనకయ్య యాదవ్‌, జాఫర్‌, పెరుగు సురేష్‌, రాజేష్‌ కన్నా, శేఖర్‌ తదితరులు ఉన్నారు.

ktrni kalisina warangal nuthana mayor, కేటీఆర్‌ని కలిసిన వరంగల్‌ నూతన మేయర్‌

కేటీఆర్‌ని కలిసిన వరంగల్‌ నూతన మేయర్‌

నూతనంగా గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికైన గుండా ప్రకాష్‌ మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్‌గా ఎంపికైన ప్రకాష్‌ని కేటిఆర్‌ అభినందించారు. నూతన మేయర్‌తోపాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్లమెంట్‌ సభ్యులు పసునూరి దయాకర్‌, బండా ప్రకాష్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు సీనియర్‌ నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. ఏకగ్రీవంగా మేయర్‌ ఎన్నికను పూర్తి చేసినందుకు స్థానిక నాయకులతోపాటు పార్టీ ఇంచార్జ్‌గా వ్యవహరించిన టిఎస్‌ఐఐసి చైర్మన్‌ బాలమల్లుకు కేటీఆర్‌ కతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ నగర పాలక సంస్థ చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని, ఇందుకోసం స్థానిక కార్పొరేటర్లను అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని నూతన మేయర్‌కి కేటీఆర్‌ సూచించారు.

 

adrushyashakthula anda unddi maku adevadu…?, అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…?

అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…?

నేటిధాత్రి బ్యూరో : ఆయనగారు ఓ కార్పోరేటర్‌ భర్త మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయి వ్యాపారంలో దివాలాతీసి దిక్కుతోచని స్థితిలో ఉండేవాడు. ఏ ‘అల్లాఉద్దీన్‌ అద్భుత దీపమో’ దొరికి ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడో అనుకుని పిక్స్‌ అయిపోకండి. కేవలం పేద ప్రజల భూములు కబ్జా చేసి తినడానికి తిండి లేని వారిని ఏదోరకంగా బురిడి కొట్టించి, దివాళా తీసిన కార్పోరేటర్‌ భర్త కాస్త ప్రస్తుతం వంద ఎకరాలకు పైగా ఆస్తులకు అసామిగా మారాడు. వందల రూపాయలు లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులకు నేనే యజమానిని అంటున్నాడు. కేవలం భూమి కొన్నట్లు భయాన పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూములు కొల్లగొడుతున్నాడు. ఇదేంటని బాధితుల పక్షాన ప్రశ్నిస్తే దృశ్య ప్రపంచం కన్న అదృశ్య ప్రపంచం చాలా పెద్దదని పరోక్షంగా వార్నింగ్‌లు ఇస్తున్నాడు. తన కబ్జాల వెనుకా అదృశ్యంగా చాలా పెద్ద చేతులే ఉన్నాయి ఖబర్ధార్‌…అంటున్నాడు. 14మందిమి కలిసి ఈ దందాలకు పాల్పడుతున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాడు. భూమి ఎవరివైనా వదిలేది లేదని…ఎవరు అడిగిన బెదిరిస్తామని డంబాలు కొడుతున్నాడు.

పూర్తి వివరాలు త్వరలో…

 

samanvayamtho panicheyali : cp doctor v.ravinder, సమన్వయంతో పనిచేయాలి : సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

సమన్వయంతో పనిచేయాలి : సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

నేరాలకు పాల్పడిన నేరస్థులకు కోర్టులో నేరం నిరూపించబడి శిక్షలు పడాలంటే పోలీసులు, ప్రాసిక్యూషన్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సి వుంటుందని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. కలెక్షన్‌ ఆఫ్‌ ఎవిడేన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్టిగేషన్‌ ప్రోసిజర్స్‌ ఫ్రం ఎఫ్‌ఐఆర్‌ టూ చార్జ్‌షీట్‌ అంశంపై వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెమినార్‌ను శనివారం పోలీస్‌ పోలీస్‌ కమీషనర్‌ ప్రారంభించారు. డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ ప్రాసీక్యూషన్స్‌ వరంగల్‌ విభాగం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెమినార్‌లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పోలీస్‌ అధికారులు పాల్గోనగా వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సెమీనార్‌లో కోర్టులో నిందితులు పాల్పడిన నేరాలు కోర్టులో రుజువయ్యేందుకు పోలీస్‌ అధికారులు నేర పరిశోధనలో సేకరించాల్సిన సాక్ష్యాధారాలతోపాటు, పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు నిర్వహించే న్యాయ విచారణలో సమయంలో పరిగణనలోకి తీసుకోవల్సిన అంశాలతోపాటు, బెయిల్‌, రిమాండ్స్‌, పోలీస్‌ కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నూతనంగా వెలువరించిన తీర్పుల వివరాలకు సంబంధించిన అంశాలపై నిజామాబాద్‌ రెండవ గ్రేడ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాంరెడ్డి ఈ సెమీనార్‌లో వివరించారు. ప్రాసీక్యూషన్‌పరంగా పోలీస్‌ అధికారులకు ఎదురవుతున్నా సమస్యలకు పరిష్కారాలను పోలీస్‌ అధికారులు పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లతో చర్చించారు. ఈ సందర్బంగా సీపీ రవీందర్‌ మాట్లాడుతూ దేశంలో ప్రజలకు ఎప్పుడు ఎక్కడ నేరం జరుగుతుందో అనే భయం వుంది తప్పా, నేరం చేస్తే శిక్షపడుతుందనే భయం చాలా తక్కువగా వుందని అన్నారు. ఈ భయం లేకపోవడం వల్లనే నేరస్థులు పాల్పడే నేరాలకు పాల్పడుతున్నారని, ఇది దష్టిలో వుంచుకోని డీజీపీ అధ్వర్యంలో పోలీసులు, పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిందితులకు శిక్షలు పడేందుకు అవలంభించాల్సిన విధానంపై చర్చించారు. న్యాయస్థానంలో నిందితులకు శిక్ష పడేందుకు నిందితులను అరెస్టు నుండి పోలీస్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ప్లాన్‌ యాక్షన్‌ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం వుందని, కొన్ని సందర్బాల్లో నిందితులపై నేరనిరూపణ కాకపోవడంతో కేసులను కొట్టివేయబడుతున్నాయని చెప్పారు. ఇందుకు గల కారణాలను కేసు ఇన్వేస్టిగేషన్‌ పోలీస్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు సంయుక్తంగా కల్సి కేసులు కొట్టివేయడానికి గల కారణాలపై చర్చించుకోవల్సి వుంటుందని తెలిపారు. నమోదైన ప్రతి కేసులో నిందితుడిపై నేరనిరూపణ జరిగి శిక్ష పడేయడం మన భాధ్యత అని, అలా చేయడం వలన నేరస్థుల్లో భయాన్ని కలిగించడంతో పాటు నిందితులు నేరాలకు పాల్పడకండా నియంత్రించడంతోపాటు ప్రజలకు భరోసా కలిగించవచ్చని తెలిపార. ఇందులో భాగంగానే గత సంవత్సరం వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో నేరస్థులకు శిక్షలు పడటంలో 46శాతానికి పెరిగిందని, పోలీస్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు సమన్వయంతో పనిచేయడం ద్వారా నేరస్థులకు శిక్షలుపడే శాతం పెరిగిందని, శిక్షలు పడితేనే నేరస్థులకు భయం కలగడంతోపాటు బాధితులు న్యాయం చేసిన వారమవుతామని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ ప్రాసీక్యూషన్స్‌ సత్యనారాయణ, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎసిపి శ్రీనివాస్‌తోపాటు పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు పాల్గోన్నారు.

 

nadiche daredhi…, నడిచే దారేది…

నడిచే దారేది…

నడిచే దారే లేదని, బురదమయంగా పాత్రపురం గ్రామ పంచాయితీ మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజి కాలువ వెంట నీరు పోతున్న పట్టించుకొనే నాథుడే లేక తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్‌ను నిర్మించేందుకు ఇరువైపులా శుభ్రం చేసి రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయలేదని గ్రామస్తులు అంటున్నారు. ఏడాది గడిచిన పట్టింపు లేకుండా కాంట్రాక్టర్‌, అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గుంతలు పడినా…నీళ్లు నిలుస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని, రాత్రి వేళల్లో రోడ్డు వెంట వెళ్లాలంటేనే భయంగా ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బైకులు వెళ్తున్న సందర్భంలో గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పాత్రపురం నుండి 2కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగవాయి గ్రామంలోకి వెళ్లటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

warangal mayorga gunda prakash ennika ekagream, వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాష్‌ ఎన్నిక ఏకగ్రీవం..

వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాష్‌ ఎన్నిక ఏకగ్రీవం..

వరంగల్‌ మేయర్‌గా గత డిసెంబర్‌లో నన్నపునేని నరేందర్‌ రాజీనామా చేసి తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్బంగా ఖాళీ అయిన మేయర్‌ స్థానానికి శనివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటీల్‌ వరంగల్‌ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ తన అభ్యర్దిగా ప్రకటించిన గుండా ప్రకాష్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రత్యర్ది పార్టీల నుండి పోటీలో ఎవరు లేనందున కౌన్సిల్‌లో కార్పోరేటర్లు ఏకగ్రీవంగా గుండా ప్రకాష్‌ ఎన్నికకు ఆమోదం తెలిపారు. మేయర్‌గా గుండా ప్రకాష్‌ ఎన్నికైనట్టు కలెక్టర్‌ అధికారికంగా ప్రకటించి సర్టిఫికేట్‌ అందజేసారు. అనంతరం ప్రమాణస్వీకారం చేసారు. ఈ సందర్బంగా తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు కతజ్ఞతలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

వరంగల్‌ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుండా ప్రకాష్‌కు వరంగల్‌ తూర్పు శానససభ్యులు నన్నపునేని నరేందర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. నగర అభివద్దికి కషిచేయాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే సూచించారు.

mayorga gunda prakashrao ennika, మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక

మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశరావు ఎంపికయ్యారు. మేయర్‌ పదవి ఖాళీ అయినందున రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ మేరకు అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. శనివారం కార్పొరేషన్‌లో నిర్వహించిన సమావేశంలో గుండా ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్‌ నియామకానికి 29మంది సభ్యుల కోరం అవసరం ఉండగా మొత్తం 50కి పైగా సభ్యులు హాజరయ్యారు. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును కార్పొరేటర్‌ వద్ధిరాజు గణేష్‌ ప్రతిపాదించగా కార్పొరేటర్‌ మరుపల్లి భాగ్యలక్ష్మి బలపరిచారు. పోటీకి ఎవరు లేకపోవడంతో మేయర్‌గా ప్రకాశ్‌రావు ఎన్నికైనట్లు ప్రకటించారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్‌లో మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును ఏకగ్రీమైనట్లు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రకటించారు. అనంతరం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా గుండా ప్రకాష్‌ రావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మేయర్‌ గుండా ప్రకాష్‌ మాట్లాడుతూ వరంగల్‌ మేయర్‌గా ఎన్నిక చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తారక రామారావు, పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే లు నన్నపునేని నరేందర్‌, వినయ్‌ భాస్కర్‌, అరూరి రమేష్‌, మేయర్‌ ఎన్నిక ఇంచార్జ్‌ బాలమల్లులకు కతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ నగర అభివద్ధికి కేటాయిస్తున్న నిధులతో నగర అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తానని అన్నారు.

mayorga gunda prakashrao ennika, మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక

మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశరావు ఎంపికయ్యారు. మేయర్‌ పదవి ఖాళీ అయినందున రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ మేరకు అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. శనివారం కార్పొరేషన్‌లో నిర్వహించిన సమావేశంలో గుండా ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్‌ నియామకానికి 29మంది సభ్యుల కోరం అవసరం ఉండగా మొత్తం 50కి పైగా సభ్యులు హాజరయ్యారు. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును కార్పొరేటర్‌ వద్ధిరాజు గణేష్‌ ప్రతిపాదించగా కార్పొరేటర్‌ మరుపల్లి భాగ్యలక్ష్మి బలపరిచారు. పోటీకి ఎవరు లేకపోవడంతో మేయర్‌గా ప్రకాశ్‌రావు ఎన్నికైనట్లు ప్రకటించారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్‌లో మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును ఏకగ్రీమైనట్లు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రకటించారు. అనంతరం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా గుండా ప్రకాష్‌ రావు మాట్లాడుతూ వరంగల్‌ మేయర్‌గా ఎన్నిక చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తారక రామారావు, పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే లు నన్నపునేని నరేందర్‌, వినయ్‌ భాస్కర్‌, అరూరి రమేష్‌, మేయర్‌ ఎన్నిక ఇంచార్జ్‌ బాలమల్లులకు కతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ నగర అభివద్ధికి కేటాయిస్తున్న నిధులతో నగర అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తానని అన్నారు.

business unn varike bank linkege, బిజినెస్‌ ఉన్న వారికే బ్యాంకు లింకేజ్‌

బిజినెస్‌ ఉన్న వారికే బ్యాంకు లింకేజ్‌

బ్యాంకు లింకేజ్‌ బిజినెస్‌ ఉన్న వారికే నాల్గవ లింకేజ్‌ ఇవ్వాలని సూచించామని రాజన్న సిరిసిల్ల జిల్లా మెప్మా పథక సంచాలకులు డాక్టర్‌ కె.వి.రమణాచారి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకు లింకేజ్‌, సెప్‌ టార్గెట్‌ బ్యాంకుల వారిగా తెలిపారు. ఈ సమావేశంలో ఎల్‌డిఎం రంగారెడ్డి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్లు, మెప్మా డిఎంసి ఎం.సుమలత, ఎడిఎంసి భూలక్ష్మి, మెప్మా సీఓలు మహాలక్ష్మి, ఇ.శ్రీమతి, ఎం.రాజేశం, డి.సుగంధ, వేములవాడ సిఎల్‌ఆర్‌పిలు కె.బాబాయ్‌, కె.కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

ennikalaku siddamga unnaam : sp rahul hegde, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : ఎస్పీ రాహుల్‌ హెగ్డే

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : ఎస్పీ రాహుల్‌ హెగ్డే

రాబోవు ఎన్నికలు ఫెయిర్‌ అండ్‌ ఫ్రీగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని రకాల భద్రత చర్యలతో సంసిద్ధంగా ఉన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. శుక్రవారం సిరిసిల్లలోని పంచాయతీ రాజ్‌ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ ు ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.శరవణన్‌తో పాల్గొన్నారు. రాబోవు ఎన్నికల నిర్వహణ శాంతియుత వాతావరణంలో నిర్వహించటమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశం కొనసాగింది. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మూడు దశలలో జరిగే ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల

పటిష్టమైన చర్యలు వివరించారు. జిల్లాలో మొత్తం 266 లోకేషన్లలో పోలింగ్‌ కేంద్రాలు 699, వాటిలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 90, నార్మల్‌ పోలింగ్‌ కేంద్రాలు 176 ఉన్నాయని తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసి సిద్ధంగా ఉన్నామని, పోలింగ్‌ కేంద్రాలు వాటి స్థితిగతులు భౌగోళిక పరిస్థితుల గురించి పోలింగ్‌ కేంద్రం వద్ద ఎంత మంది పోలీసు భద్రత అవసరము, ఏ విధమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా పరిధిలోని అన్నీ బార్డర్‌ పిఎస్‌ పరిధిల్లో (స్టాటిక్‌ సర్వే లెన్స్‌ టీమ్స్‌ 4, చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం, 12 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 03 చెక్‌పోస్ట్‌లు 24-7 నిరంతరాయంగా వాహనాలు తనిఖీ చేయడం గురించి వివరించారు. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికలలో 1,14,640/- రూపాయల విలువ గల 305.2లీటర్లు, లోక్‌సభ ఎన్నికలలో 631.14 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్‌ చేశామని చెప్పారు. పెండింగ్‌లో వారెంట్లు అమలు చేశామని, ఇప్పటివరకు 1230మందిని 280కేసులలో శాంతిభద్రతల విఘాతం కలిగించే వ్యక్తులు, పాత నేరస్తులను బైండోవర్‌ చేశామని తెలిపారు. తరచుగా కార్డెన్‌సెర్చ్‌ ఆపరేషన్‌లు నిర్వహిస్తూ ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కళాబందంచే జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్నికల నియమావళి, పలు ముఖ్య చట్టాలు, సాంస్క తిక కార్యక్రమాల ద్వారా అవగాహన కలగజేస్తూ ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకొనేలా కషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం అబ్జర్వర్‌ సి.శరవణన్‌ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సాంకేతిక నైపుణ్యన్నీ ఉపయోగించుకొని పనిచేయాలని, ఎన్నికలు ప్రశాంత, స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలు అందరు తమ ఓటుహక్కును ఉపయోగించుకొనే విధంగా వారికి అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎలక్షన్‌కు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా, ఫిర్యాది వచ్చిన వీడియోగ్రాఫ్‌, సీసీ కెమెరాలు, సీసీ కెమెరా ఫుటేజ్‌ డాక్యుమెంటేషన్‌ తప్పనిసరిగా ఉండాలని, అధికారులందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ప్రతి స్టేషన్‌ పరిధిలో ఉన్న పోలింగ్‌ బూత్‌లను ఎల్లపుడు సందర్శిస్తూ, స్థానికులతో సత్సంబంధాలు కలిగి యుండాలని తెలిపారు. అధికారులు ఇన్‌ఫర్మేషన్‌ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు, ప్రతి పోలీసు అధికారి పక్కా ప్రణాళికతో సిద్ధంగా వుండాలని సూచించారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల సమన్వయ అధికారి బి.గౌతంరెడ్డి పాల్గొన్నారు.

prajalu jagrathaga vyavaharinthali, ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలి

ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలి

ఇటీవల కాలంలో కొంతమంది నేరచరిత్ర గల అంతర్‌రాష్ట్ర ముఠాలు తప్పుడు ధృవపత్రాలు సమర్పించి బ్యాంక్‌ మేనేజర్‌ అంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం వారు బ్యాంకు కస్టమర్లకు పలు సూచనలు చేశారు. బ్యాంకు మేనేజర్‌ను అంటూ మొబైల్‌ సిమ్‌కార్డు పొంది అమాయకులైన బ్యాంక్‌ కస్టమర్‌లకు ఫోన్‌ చేస్తూ హిందీలో మాట్లాడతారని తెలిపారు. బ్యాంక్‌ మేనేజర్‌ను మాట్లాడుతున్న అని పరిచయం చేసుకుని, అకౌంట్‌ పూర్తిగా అప్‌డేట్‌ చేస్తున్నామని, అకౌంట్‌ నెంబర్‌ చెప్పమని కొరగానే చాలా మంది నిజంగానే మాట్లాడుతున్న వ్యక్తి బ్యాంక్‌ అధికారి అని నమ్మి తమ అకౌంట్‌ నెంబర్‌ చెబుతున్నారని అన్నారు. వెంటనే ఆ వ్యక్తి ఆ అకౌంట్‌ నుండి డబ్బులు డ్రా చేయడం మొదలుపెడతాడని, అతను డబ్బులు డ్రా చేయడం మొదలు పెట్టగానే కస్టమర్‌ ఫోన్‌కి మెసేజ్‌ వస్తుందని చెప్పారు. బ్యాంక్‌ మేనేజర్‌గా మాట్లాడుతున్న వ్యక్తి నెంబర్‌ చెప్పవలసిందిగా కోరతాడని, ఆ తర్వాత అమాయకంగా చాలామంది తమ సెల్‌ఫోన్‌కి వచ్చిన ఓటిపి నెంబర్‌ వారికి చెప్పగానే వారి అకౌంట్‌లో డబ్బులు మాయం అయిపోతాయని తెలిపారు.

కింది సూచనలు పాటించండి

1) బ్యాంక్‌ అధికారులమని ఏ అపరిచితవ్యక్తి ఫోన్‌ చేసిన నమ్మకండి. కావాలంటే బ్యాంకుకి స్వయంగా వెళ్లి మేనేజర్‌తో మాట్లాడాలని తెలిపారు.

2) అపరిచిత వ్యక్తితో అకౌంట్‌ నెంబర్‌ షేర్‌ చేసుకోవద్దని, చెప్పవద్దని అన్నారు.

3) బ్యాంక్‌ మేనేజర్‌ ఫోన్‌ చేసి అకౌంట్‌ నెంబర్‌ గురించి వివరాలు అడగరని, ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే అనుమనించాలని తెలిపారు.

4) బ్యాంక్‌ అకౌంట్‌, పిన్‌ నెంబర్‌, ఆస్తి, ఆస్తిని కొల్లగొట్టడానికి కొన్ని ముఠాలు వల వేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, అమాయకంగా నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరుల పాలు చేసుకోవద్దని అన్నారు.

manasika balopetha vidya vidanam ravali : r.laxman sudhakar, మానసిక బలోపేత విద్యా విధానం రావాలి: ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌

మానసిక బలోపేత విద్యా విధానం రావాలి: ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌

విద్యార్థులను మానసికంగా బలోపేతం చేసే భారతీయ విద్యా విధానం రావాలని, దాని వల్లనే వ్యక్తిత్వం వికసించి బుద్ధి, వివేకం పెరిగి జయాపజయాలను ఒకే విధంగా స్వీకరిస్తారని, తద్వారా అ నుత్తీర్ణులు అయినప్పుడు ఆత్మహత్యల జోలికి పోరని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ ప్రచార ప్రముఖ్‌ ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌ అన్నారు. శ్రీరామకష్ణ మఠం హైదరాబాద్‌ మార్గదర్శనంలో శ్రీ రామకష్ణ సేవా సమితి హనుమకొండ శాఖ నక్కలగుట్టలోని వివేకానంద హైస్కూల్‌లో నిర్వహిస్తున్న వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణా శిబిరం బాలసంస్కార్‌లో శుక్రవారం ఆయన పాల్గొని ఆదర్శ విద్యార్థి లక్షణాలు అనే అంశంపై మాట్లాడారు. ఒత్తిడితో కూడిన విద్యావిధానం ఫలితంగానే విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. స్వామి వివేకానంద ప్రవచించిన భారతీయ విద్యా విధానమే నేటి తరానికి ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. శీల సంపదను వద్ధి చేసి, మనోబలాన్ని పెంపొందించి, బుద్ధిని వికసింప చేసి, స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యను స్వామీజీ ఆశించాడన్నారు. నేటి తల్లిదండ్రుల కోరిక మేరకు డాలర్లు సంపాదించడానికి కావలసిన విద్య కోసం విద్యార్థులు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని కార్పోరేటు బడుల్లో, కళాశాలల్లో కుస్తీలు పడుతున్నారు. ఈ విధానం మారి విద్యార్థి కోరికకు అనుకూలమైనటువంటి స్వేచ్చాయుత, నైతిక విలువలతో కూడిన, మానవీయ విలువలు నిండిన విద్యా విధానం వచ్చినప్పుడే విద్యార్థులు స్వేచ్చగా విద్యార్జనపైన దష్టి కేంద్రీకరిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చదివింది గుర్తుంచుకునేలా కొన్ని అధునాతన టెక్నిక్లను పరిచయం చేశారు. వారంరోజులు నిర్వహించే ఈ శిబిరంలో ఆదర్శ విద్యార్థి, ఏకాగ్రత రహస్యం, గురు శిష్యుల సంబంధము, మాతపిత భక్తి, భారతీయ వారసత్వ వైభవం, మన ఆచారాలు ఆదర్శాలు, దేశభక్తి అనే అంశాలపై వక్తలు విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. అంతేకాకుండా యోగాసనాలు, ధ్యానము, వేదిక్‌ మాథ్స్‌, ఆకర్షణీయమైన చేతిరాత, నత్యం, ఆటలు, పాటలు, మట్టితో బొమ్మలు చేయుట తదితర అంశాలలో నిష్ణాతులతో శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో శిబిర నిర్వాహాకులు, శ్రీరామకష్ణ సేవా సమితి హనుమకొండ శాఖ ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, రాధిక, స్వరూప, అశ్వి వివేక్‌, లక్ష్మణ్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

warangal vastravyaparaniki gundekaya, వరంగల్‌ వస్త్రవ్యాపారానికి గుండెకాయ

వరంగల్‌ వస్త్రవ్యాపారానికి గుండెకాయ

వరంగల్‌ నగరం వస్త్రవ్యాపార రంగానికి గుండెకాయ లాంటిదని కాకతీయ ఆల్‌షాప్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నగరబోయిన బాబురావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఆర్యవైశ్య భవనంలో యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా పేదరికంలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు జరగడం లేదని అన్నారు. కార్మికులు న్యాయం కోసం ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. యజమానులు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం నగర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

polycet falithalu vidudala, పాలిసెట్‌ ఫలితాలు విడుదల

పాలిసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర పాలీసెట్‌-2019 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌ బిఆర్‌కే భవన్‌లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ కార్యాలయంలో టెక్నికల్‌ బోర్డు కమిషనర్‌, చైర్మన్‌ నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ పాలిసెట్‌ ఫలితాలలో 92.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. స్టేట్‌ మొదటి ర్యాంకు సిద్దిపేట జిల్లాకు చెందిన మంకాల సజనకు, రెండవ ర్యాంక్‌ సూర్యాపేట జిల్లాకు చెందిన ఆరురి సాత్విక్‌కు దక్కాయి. ఈ పాలిసెట్‌-2019 పరీక్షలో 1,06,295 మంది అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 1,03,587 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 92.53శాతం, 95,850అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, అందులో 61505 బాలురు పరీక్ష రాయగా, 55933మంది ఉత్తీర్ణత (90.94శాతం) సాధించారు. 42082 బాలికలకు 39917మంది ఉత్తీర్ణత (94.86శాతం) సాధించారు. మే మొదటి వారంలో కౌన్సిలింగ్‌, జూన్‌ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయి.

mamidi pandlatho jagratha, మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి సీజన్‌ వచ్చింది. దోరగా కంటికి ఇంపుగా ఉన్నాయని మామిడి పండ్లను కొని తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. మామిడి పండ్లను అమ్మే వ్యాపారులు మార్కెట్‌లో వ్యాపారాన్ని దష్టిలో ఉంచుకుని పచ్చి మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని వివిధ రకాలుగా మాగబెట్టి ఉంచుతున్నారు. ఇలా ఒక్కరోజు పచ్చి మామిడికాయలను ఉంచితే చాలు రెండురోజుల్లో దోరగా పండిన మామిడి పండ్లు రెడీ. వాటినే వ్యాపారులు మార్కెట్లకు తరలిస్తున్నారు. కంటికి దోరగా పండినట్లు కనబడే మామిడి పండ్లను చూసి వినియోగదారులు మోసపోతున్నారు. రసాయనాల ద్వారా మగ్గపెట్టిన మామిడి పండ్లను తీసుకున్న వారికి తొలుత కడుపునొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్‌ సమస్య, విరేచనాలు, వాంతులు మొదలవుతాయి. చివరకు మనిషి పూర్తిగా నీరసించిపోతాడు. తిరిగి కోలుకోవడానికి సెలైన్‌ పెట్టాల్సి రావచ్చు. అంతేకాదు ఈ సీజన్‌ మొత్తం ఇటువంటి కాయలను తీసుకున్న వారిలో పెప్టిక్‌ అల్సర్‌ తలెత్తే తీవ్రమైన ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు అమ్ముతున్న మామిడి పండ్లు సరైనవో…కాదో తనిఖీ చేయాల్సిన అధికారులు జాడ లేకుండా పోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాగా నల్లటి మచ్చలతో పండిన మామిడికాయ దర్శనమిస్తే అది రసాయనాల ద్వారా మగ్గబెట్టిందని తెలుసుకోవాలి. అయితే అన్ని సందర్భాల్లో ఇది నిజమని చెప్పలేమంటున్నారు నిపుణులు.

రసాయనాల పండును ఎలా గుర్తించాలి

రసాయనాలతో పండించిన మామిడి పండు తొక్క, మామిడికాయను తినేటపుడు తేలికగా ఊడిపోతుంటుంది. అదే చెట్టుకే పండిన మామిడికాయ అయితే మంచి సువాసనను కలిగి తినేటపుడు తొక్క కూడా చాలా దఢంగా ఉంటుంది. అదే మధురఫలం. అయితే ఇందులోనూ కల్తీ రాయుళ్లు ఎందరి ఆరోగ్యంతోనో చెలగాటమాడుతున్నారన్నమాట.

మామిడిపండు తింటే ఆరు ఉపయోగాలు

వేసవికాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం…

1. మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్‌ సి ఇంకా ఫైబర్‌ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

2. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్‌ కూడా ధడంగా ఉంటుంది.

3. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం ఇంకా అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.

4. దోరగా పండిన మామిడిలో ఐరన్‌ సమద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్‌ ఎర్ర రక్తకణాల వద్దికి దోహదపడుతుంది.

5. ఈ పండులో వుండే విటమిన్లు, ఇంకా ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. శంగారంలో ఆసక్తి లేనివారికి శంగార వాంఛను కలిగిస్తుంది.

6. మామిడిపండులో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్‌ అనే పదార్దం సమద్దిగా ఉంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

అతిగా తిన్నా ఇబ్బందే

ప్రస్తుతం చాలామంది వ్యాపారులు మామిడి పండ్లను సహజసిద్ధంగా మాగబెట్టడం లేదు. కాల్షియం కార్బైడ్‌ అనే కెమికల్‌ను వాడి ఆర్టిఫిషియల్‌గా మగాబెడుతున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులు లాగడం, తిమ్మెర్లు వంటి రుగ్మతల బారిన పడతారు.

అజీర్తి సమస్య

సరిగా మాగని మామిడి పండ్లను తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో మంట, సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు. పచ్చి మామిడిని ఎంత తక్కువ తింటే అంత మంచిది.

చర్మ సంబంధిత వ్యాధులు..

మామిడి పండ్లను విపరీతంగా తినేవాళ్లలో గమనించిన మరో సమస్య అలర్జీ. చర్మంపై బొబ్బలు, సెగగడ్డలు, ఎర్రటి కాయలు వస్తాయి. మామిడి పండ్లు శరీరానికి వేడి చేస్తాయని పెద్దలు అంటుంటారు. అందువల్లే సెగగడ్డలు వస్తాయి.

మధుమేహం పెరుగుతుంది

మామిడి పండ్లలో ఫ్రక్టోజ్‌ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్‌ లెవెల్స్‌ అమాంతం పెరిగిపోతాయి. డయాబిటిస్‌తో బాధపడుతున్నవారు. మామిడి పండ్లకు దూరంగా ఉండటమే ఉత్తమం అని నిపుణులు తెలుపుతున్నారు.

చోద్యం చూస్తున్న మార్కెట్‌ అధికారులు :

వరంగల్‌ పండ్ల మార్కెట్‌లో మామిడి అమ్మకాలు జోరందుకున్నాయి. మార్కెట్‌ ఆదాయాన్ని పెంచడంలో దష్టి పెట్టిన అధికారులు మామిడి పండ్లు రసాయనాలతో మాగబెట్టి తీసుకువస్తున్న దళారులపై చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు రసాయన ద్రవ్యాల నియంత్రణపై దష్టి సారించాలని మామిడి ప్రియులు కోరుతున్నారు. దళారులకు అడ్డాగా పండ్ల మార్కెట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డాలు వేసి మారుబేరం చేసి మార్కెట్‌ ఆదాయానికి గండి కోడుతున్నారని చెప్పొచ్చు. దళారితనాన్ని నిర్మూలించి మార్కెట్‌ ఆదాయానికి గండి పడకుండా చూడాలని మార్కెట్‌ లైసెన్స్‌ దారులు కోరుతున్నారు.

prakruthi prakash endariko adarsham: yasmin basha, ప్రకతి ప్రకాష్‌ ఎందరికో ఆదర్శం : యాస్మిన్‌ బాషా

ప్రకతి ప్రకాష్‌ ఎందరికో ఆదర్శం : యాస్మిన్‌ బాషా

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న కార్యక్రమానికి సామాజిక సేవకుడు ప్రకతి ప్రకాష్‌ శ్రీకారం చుట్టడం ఎంతో గొప్ప విషయమని సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రకతి ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులలో ఉచితంగా చల్లని నీరు పంపిణీ కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్న తరుణంలో ఎదుటి వారికి కూడా సాయం చేయాలనే భావనను ప్రకాష్‌ అందరికీ కల్పిస్తున్నారని అన్నారు. వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడని తెలిపారు. వనజీవి రామయ్యని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో వేలసంఖ్యలో మొక్కలు నాటడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టడం సంతోషకరమన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో బస్సులో ప్రయాణించడం ఎంతో ఇబ్బందిగా ఉంటుందని చాలా సందర్భాల్లో గుక్కేడు నీటికోసం తరువాత స్టాప్‌ వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఎదురవుతుందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన ప్రకాష్‌ ఆర్టీసీ బస్సులలో చల్లని నీటిని ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమన్నారు. ప్రకాష్‌ ఆలోచనకు సహకరించిన ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్‌, సిబ్బందిని సైతం ఆమె అభినందించారు. ప్రకతి ప్రకాష్‌ మాట్లాడుతూ చల్లని నీరు పంపిణీలో బాగంగా సిరిసిల్ల నుండి హైదరాబాద్‌, కరీంనగర్‌ వెళ్లే నాన్‌స్టాప్‌ బస్సులలో చల్లని నీటి బబుల్స్‌ని ఏర్పాటు చేయడం చేశామన్నారు. ప్రతి రోజు 32 చల్లని నీటి బబుల్స్‌ని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగిస్తున్నామని, అందుకోసం ప్రతి రోజూ రూ.640 వెచ్చిస్తున్నట్లు వేసవికాలం ముగిసే వరకు బస్సులో ప్రయాణించే ప్రయాణికుల దాహాన్ని తీరుస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి చక్కని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన జెసి యాస్మిన్‌ బాషాకి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version