pidugupadi gorrelakapari mruthi, పిడుగుపడి గొర్లకాపరి మతి

పిడుగుపడి గొర్లకాపరి మతి

పిడుగుపాటుకు గొర్లకాపరి మత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నర్సంపేట డివిజన్‌ దుగ్గొండి మండలంలోని గుడ్డెలుగులపల్లె గ్రామశివారులో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దుగ్గొండి మండలం గుడ్డెలుగులపల్లె గ్రామానికి చెందిన మంద రాజయ్య(40) తనకున్న వ్యవసాయంతోపాటు గొర్రెలను పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే శనివారం గొర్రెలను మేపడానికి ఊరి శివారులోకి వెళ్లాడు. అనుకోకుండా ఈదురుగాలులు భారీగా వర్షం రావడంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు వెళ్లాడు. వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు చెట్టుపై పడటంతో రాజయ్య అక్కడికక్కడే మతిచెందాడు. అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే మతువాత పడినట్టు గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపారు. మతునికి భార్య మమతతోపాటు కూతురు స్రవంతి ఉన్నారు.

kagitham recycling andivachina varam, కాగితం రీసైక్లింగ్‌ అందివచ్చిన వరం

కాగితం రీసైక్లింగ్‌ అందివచ్చిన వరం

కాగితం నిత్యజీవితంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది. టిష్యూ పేపర్‌ మొదలుకుని, వార్తపత్రిక వరకు కాగితాన్నే వాడుతారు. కాగితానికి ఉన్న ప్రాధాన్యత అంతా…ఇంతా కాదు. ఇది లేనిది ఏ పని నడవదు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ప్రభుత్వ కార్యకలాపాలు నడవాలన్న, పాలనపరమైన పనులు సజావుగా కొనసాగాలన్న, ఏ విషయంలోనైనా మనిషికి భరోసా, నమ్మకం కలగాలన్న పేపర్‌ ప్రముఖపాత్రను పోషిస్తుంది అనుకున్న విషయాన్ని కాగితంపై ఉంచితే మనిషి మాటకన్న కాగితంపై ఉన్న మాటలే ఎక్కువ విలువను కలిగి ఉంటాయనడంలో ఎంతమాత్రం సందేహం కలగదు. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న పేపర్‌ మనకు కలప నుంచే లభిస్తుంది. కాగితం తయారీ కర్మాగారాలు కలప గుజ్జు నుంచి కాగితాన్ని తయారుచేస్తారు. కొన్ని కర్మాగారాల యజమానులు కాగితం తయారీ కోసం ప్రత్యేకంగా చెట్లను పెంచి గుజ్జును తీసి కాగితాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా చేసేందుకు అందని సందర్భంలో లేదా మరింతగా కాగితాన్ని తయారు చేసేందుకు వృక్షాలను కొనుగోలు సైతం చేస్తున్నారు. అయితే కాగితం ఉత్పత్తి మూలంగా పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు కాగితాన్ని తయారు చేయడానికి చెట్లే ఆధారంగా కనపడుతున్నాయి తప్ప మరో ప్రత్యామ్నాయమార్గం కనపడడం లేదు. దీని వల్ల చెట్లను కాగితం తయారీకి వాడక తప్పడం లేదని తయారీ కర్మాగార యజమానులు అంటున్నారు. అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మూలంగా, కంప్యూటరీకరణ కారణంగా కాగితం వాడకం తగ్గిందని అంటున్న ఆశించినంత మేర తగ్గలేదు. పైగా కాగితానికి ఉన్న ప్రాధాన్యత అలాగే ఉండిపోయింది. టెక్నాలజీ ఎంతగా వచ్చిన కాగితం వాడకం తగ్గలేదన్నది నిజంగా నిజం. ఇది ఇలా ఉంటే కాగితం తయారీకి కలపను విరివిగా ఉపయోగిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా కాగితం తయారీ పరిశ్రమలో ఓ మార్పు చోటు చేసుకుంది. రీ సైక్లింగ్‌ ద్వారా పేపర్‌ను ఉత్పత్తి చేయడం కర్మాగారాలు ప్రారంభించడంతో భారీ ఊరట కలిగింది. రీసైక్లింగ్‌ కాగితం వాడకం విషయంలో వినియోగదారులకు అవగాహన కలగడంతో కలపను గతంలో కంటే చాలా తక్కువగానే వాడుతున్నారు. దీనివల్ల కొంతమేర ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. రీసైక్లింగ్‌ పేపర్‌ను వినియోగదారులు ఉపయోగించడంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తే ఈ కాగితానికి ఎక్కువ గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల అటు పర్యావరణానికి కానీ ఇటు వృక్షాలకు కానీ ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అందుకే రీసైక్లింగ్‌ పేపర్‌ వాడకాన్ని మరింతగా పెంచేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది.

రీసైక్లింగ్‌తో ముప్పు తగ్గుతుంది

– ఠాకూర్‌ కిషన్‌సింగ్‌

రీసైక్లింగ్‌ పేపర్‌ మూలంగా పర్యావరణానికి ముప్పు తగ్గుతుందని పేపర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ఠాకూర్‌ కిషన్‌సింగ్‌ అన్నారు. కాగితం వాడకం గూర్చి ‘నేటిధాత్రి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కాగితం తయారీకి ప్రత్యామ్నాయ ముడిసరుకు ఏది లేకపోవడం ఒకింత బాధాకరమేనన్నారు. అయితే పేపర్‌ ఉత్పత్తిలో రీసైక్లింగ్‌ రావడం శుభపరిణామం అన్నారు. రీసైక్లింగ్‌ వల్ల కలప వాడకాన్ని అధికశాతం నియంత్రించవచ్చన్నారు. అయితే వినియోగదారులు సైతం రీసైక్లింగ్‌ పేపర్‌ వాడకంలో శ్రద్ద కనబర్చాలని ఈ కాగితంపై అవగాహన పెంచుకోవాలన్నారు.

matti namunala valana eruvula niyanthrana, మట్టి నమూనాల వలన ఎరువుల నియంత్రణ

మట్టి నమూనాల వలన ఎరువుల నియంత్రణ

మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌

వ్యవసాయ భూములల్లో మట్టి పరీక్షలు చేయించుకోవడం వలన ఎరువుల నియంత్రణను అరికట్టవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ అన్నారు. శుక్రవారం దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ సుస్థిర వ్యవసాయ పథకం కింద నూతనంగా ఏర్పాటైన చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీని ఈ పథకంలో భాగంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా 224మట్టి నమూనాలను సేకరించారు. వ్యవసాయశాఖ అధికారి దయాకర్‌ మాట్లాడుతూ మట్టి పరీక్షలు చేయించడం వలన భూమిలో ఎరువులు ఎంత మేరకు వేసుకోవచ్చు అని నిర్ధారణ వస్తుందన్నారు. ఎరువులు మోతాదులో వేయడం వలన అధిక దిగుబడులు వస్తాయని, భూసారం దెబ్బతినకుండా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు రాజేష్‌, విశ్వశాంతి గ్రామ రైతులు కేశవరెడ్డి, సుధాకర్‌ రెడ్డి, కొమ్మాలు, కక్కెర్ల శ్రీనివాస్‌, లక్క రాజు, మదునయ్య, రమేష్‌, మల్లారెడ్డి, నూనె రాములులతోపాటు పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

leaser cosmotics uchitha vaidya shibiram, లేజర్‌ కాస్మోటిక్స్‌ ఉచిత వైద్య శిబిరం

లేజర్‌ కాస్మోటిక్స్‌ ఉచిత వైద్య శిబిరం

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో లేజర్‌ కాస్మోటిక్స్‌ ఉచిత వైద్యశిబిరాన్ని శుక్రవారం నర్సంపేట పట్టణంలోని భరత్‌ డెంటల్‌, లేజర్‌ ఆసుపత్రిలో నిర్వహించారు. నర్సంపేట కెఎస్‌ఆర్‌ మహిళా కళాశాలకు చెందిన ఇరవైమంది విద్యార్థినులకు పులిపిర్లు, నల్లమచ్చలపై లేజర్‌ చికిత్సను ఉచితంగా నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో చర్మ వైద్యులు డాక్టర్‌ విజయ్‌ మాట్లాడుతూ అత్యాధునిక లేజర్‌ వైద్య విధానాల వల్ల మనం కోరుకున్న ఫలితాలు వస్తాయన్నారు పులిపిరులు, నల్లమచ్చల కోసం పసర వైద్యం కీడు చేస్తుందని అన్నారు. మహిళలు చర్మ సౌందర్యం కోసం లేజర్‌ స్పెషలిస్టులను సంప్రదించి ఆత్మవిశ్వాసం పొంది విజయం సాధించాలన్నారు. ఎండ తాకిడి నుండి చర్మ రక్షణకు సన్క్రీమ్‌ లోషన్‌ వాడాలన్నారు. యూవీ కిరణాల ప్రభావంతో చర్మ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు రాజేందర్‌ రెడ్డి, కోశాధికారి రవీందర్‌ ప్రముఖ వైద్యులు రాజేశ్వర్రావు ఎస్సార్‌ పారా మెడికల్‌, కెఎస్‌ఆర్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.

ishtamaina courselanu empika chesukuni sthirapadali, ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని స్థిరపడాలి

ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని స్థిరపడాలి

విద్యార్థినులు తనకు ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని భవిష్యత్తులో స్థిరపడాలని కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజుల అన్నారు. శుక్రవారం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిపి విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిణి మంజుల మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలపై ఎలాంటి ఆవేశపూరితమైన నిర?యాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి తర్వాత ఉండే అన్ని కోర్సులపై అవగాహన కల్పిస్తూ ఇష్టమైన కోర్సును ఎంచుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచిపేరు తెచ్చుకునే విధంగా ముందుకుసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బందం రమ, సుభాషిని, మంజుల, సరస్వతి, రాధలతోపాటు విద్యార్థినిలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

manvathvanni chatina adivasi upadyayulu, మానవత్వాన్ని చాటిన ఆదివాసీ ఉపాధ్యాయులు

మానవత్వాన్ని చాటిన ఆదివాసీ ఉపాధ్యాయులు

ట్రాక్టర్‌ లోడ్‌ పడి ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఆదివాసీ ఉపాధ్యాయులు శుక్రవారం ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని గ్రామ సర్పంచ్‌ నర్సింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూగూరు వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామపంచాయితీ పరిధిలోని పర్శికగూడెం గ్రామానికి చెందిన పర్శిక శ్రీను-సరితలకు ఆరుగురు సంతానమని, అందులో చివరివాడు కుమారస్వామి 5నెలల క్రితం పర్శికగూడెం గ్రామంలో ట్రాక్టర్‌ లోడ్‌ పడి కుమారస్వామికి తీవ్రగాయాలయ్యాయని పేర్కొన్నారు. రెక్కాడితేనేగానీ డొక్కాడని స్థితిలో ఉన్న శ్రీను-సరిత దంపతులు కుమారస్వామికి వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నారన్నారు. సర్పంచ్‌ నర్సింహమూర్తి ద్వారా విషయం తెలుసుకున్న ఆదివాసీ ఉపాధ్యాయులు స్పందించి 11400 రూపాయలను బాధితుడి తల్లిదండ్రులకు అందజేశారని తెలిపారు. కుమారస్వామికి వైద్యం చేయించాలంటే 2లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారన్నారు. నిస్సహాయస్థితిలో ఉన్న వీరికి మానవతాదృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయులలో సోలం పుల్లారావు, వాసం లక్ష్మయ్య, శేషాచలం, పీర్ల కృష్ణబాబు ఉన్నారన్నారు.

arpatlanu parishilinchina sp, ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపిటిసి రెండవ విడత ఎన్నికల సందర్బంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే తంగళ్లపల్లి గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను, పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అదేవిధంగా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో నిర్వహించాలన్నారు. ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌ ఉన్నారు.

shwetharkamula ganapathini darshinchukunna corporator swapnasridhar, శ్వేతార్కమూల గణపతిని దర్శించుకున్న కార్పొరేటర్‌ స్వప్నశ్రీధర్‌

శ్వేతార్కమూల గణపతిని దర్శించుకున్న కార్పొరేటర్‌ స్వప్నశ్రీధర్‌

కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతిస్వామిని 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్నశ్రీధర్‌ శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో ఈనెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న 21వ వసంతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో చివరిరోజు శుక్రవారం 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్నశ్రీధర్‌ కుటుంబసభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు అనంతమల్లయ్యశర్మ స్వాగతం పలికి ప్రత్యేకపూజలు చేసి ఆశీర్వాదించారు. అనంతరం ఆలయ అర్చకులు రాధాకృష్ణశర్మ కార్పొరేటర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ శ్రీశ్వేతార్కమూల గణపతిస్వామి అందరి కోరికలు తీర్చే దేవుడని, ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు రావడం గొప్ప విషయమని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు క్షేమంగా ఉండాలని అన్నారు.

kazipet cipia HRClo firyadu, కాజీపేట సిఐపై హెచ్‌ఆర్‌సిలో పిర్యాదు

కాజీపేట సిఐపై హెచ్‌ఆర్‌సిలో పిర్యాదు

తన భూమి విషయంలో కాజీపేట సిఐ అజయ్‌కుమార్‌ తనను బెదిరింపులకు గురిచేస్తూ తన ప్రత్యర్థులకు సహకరిస్తున్నాడని వడ్డేపల్లికి చెందిన కటకం సంపత్‌ గురువారం మానవహక్కుల కమిషన్‌కు పిర్యాదు చేసారు. కాజీపేట సిఐ భూకబ్జాదారులకు సహకరిస్తూ తనపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నాడని, రౌడీషీట్‌ నమోదు చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సిఐ అండతో భూకబ్జాదారులు తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సీఐ తరుచుగా ఫోన్‌ చేస్తూ బూతులు తిడుతూ స్టేషన్‌కు రావాలని వేధిస్తున్నాడని లేఖలో భాదితుడు సంపత్‌ ఆరోపించాడు. భూమి విషయంలో కోర్టు నుంచి తనకు అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉందని సీఐకి వివరించే ప్రయత్నం చేసినా తన మాటను లెక్క చేయకుండా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందేనని ఫోన్‌లో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టు విచారణలో ఉందని బాధితుడు తెలిపారు.

acbki chikkina avinithi chepa, ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

అవినీతికి పాల్పడుతూ మెప్మాకు చెందిన ఓ కో-ఆర్డినేటర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మెప్మా సమన్వయ అధికారి (డిఎంసి) కమలశ్రీ పొదుపు సంఘం సభ్యురాలి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. రుణం మంజూరుకూ, రిసోర్స్‌ పర్సన్‌ నియామకానికి సంబంధించి లంచం డిమాండ్‌ చేసి, రూ.40 వేలు తీసుకుంటుండగా అధికారులు రైడ్‌ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

vidyarthi jivithalatho kalashala yajamanyam chelagatam, విద్యార్థి జీవితాలతో కళాశాల యాజమాన్యం చెలగాటం

విద్యార్థి జీవితాలతో కళాశాల యాజమాన్యం చెలగాటం

సుబేదారి పీఎస్‌లో యాజమాన్యంపై విద్యార్థి ఫిర్యాదు

విద్యాబుద్దులు నేర్పాల్సిన అధ్యాపకులు గుండాల్లా వ్యవహరించిన తీరు, మానవత్వాన్ని చేపాల్సిన కాలేజి యాజమాన్యం అధిక ఫీజుల రూపంలో మానవమృగాలై విద్యార్థి జీవితాన్ని సర్వనాశనం చేసిన ఘటన, మృదువుగా విద్యార్థి తల్లిని కాలేజికి రప్పించి మూకుమ్మడిగా ఆ తల్లిపై బెదురింపులకు పాల్పడిన కాలేజి అధ్యాపక బృందం. అడ్మిషన్‌ సమయంలో ఒప్పందం చేసుకున్న ఫీజు కంటే ఎక్కువ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసిన వైనం. ఫీజు చెల్లించలేదన్న సాకుతో నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా విద్యార్థి పరీక్షా ఫీజును ఇంటర్మీడియట్‌ బోర్డులో చెల్లించకుండా భవిష్యత్‌ను బజారుపాల్జేసిన ఘోర తప్పిదం. మా అబ్బాయి పరీక్షా ఫీజును ఎందుకు కట్టలేదని ప్రశ్నించిన తల్లిదండ్రులపై విద్యా విలువలను మట్టిలో గలిపి విద్యార్తి పేరెంట్స్‌ పైనే కాలేజి యాజమాన్యం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ ఫిర్యాదు చేసిన తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నది.ఇంటర్మీడియట్‌ బోర్డు డి.ఐ.ఈ.వో ప్రధానకార్యాలయానికి కూతవేటు దూరంలో వున్న ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజి నిబంధనలకు విరుద్దంగా నడుపుతూ, ఓ విద్యార్థి జీవితాన్ని కాలేజి యాజమాన్యం సర్వనాశనం చేసి, విద్యార్థి తల్లిని కాలేజికి పిలిపించి పదిమందికి పైగా కాలేజి అధ్యపకులు చుట్టు ముట్టి రౌఢీల్లా వ్యవహరించిన తీరుపై నగర ప్రజలు,విద్యార్థులు,విద్యార్థిసంఘాలు,ప్రజాసంఘాలు,విద్యావేత్తలు,విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కాలేజి పై పెదవి విరుస్తున్నారు.

shubanandini karyalayam mundu andholana, శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన

శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన

మహబూబాబాద్‌ జిల్లా పట్టణంలోని శుభనందిని చిట్‌ఫండ్‌ ప్రధానకార్యాలయం ముందు బాదితులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా బాదితులు మాట్లాడుతూ శుభనందిని చిట్‌ఫండ్‌లో నెలనెల చిట్టీలు కట్టామని,చిట్టీ ఎత్తుకున్న తతువాత డబ్తులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాదితులు తెలిపారు.ఇప్పుడిస్గాము,అప్పుడిస్తామంటూ కాలయాపన చేస్తుండటంతో ఆందోళన చేపట్టామని మాకు రావల్సిన చిట్టీ డబ్బులు ఇచ్చేంత వరకు మా ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.

okka cc camera vanda manditho samanam, ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం

ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం

సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య

నగరంలో ఇంటి యజమానులు ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య ప్రజలకు సూచించారు.సీసీ కెమెరాలతో ఇంటికి ఎంతో భద్రత వుంటుందని, ఒక్కో సీసీ కెమెరా వందమందితో సమానం అని అన్నారు.నగరంలో రోజురోజుకు దొంగలు పెట్రేగాపోతూ తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని వీరి బారి నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్క ఇంటి యజమాని సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు.30-40 లక్షలు పెట్టి ఇంటిని నిర్మించుకొని 20 వేల రూపాయలకు వచ్చే సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అలా కాకుండా ఇంటి భద్రత కొరకు సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సదయ్య నగర ప్రజలను కోరారు.

samyuktha collectorga yasmin basha, సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా

సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. నాన్‌ క్యాడర్‌ హోదాలో రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేస్తున్న యాస్మిన్‌ భాషాకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ హోదా ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. జెసితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మరో 10మందికి కలిపి మొత్తం 11మందికి కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ హోదాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

కొత్తగా ఐఎఎస్‌ పదోన్నతి పొందిన యాస్మిన్‌ భాషాకు నూతన హోదాతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యాస్మిన్‌ భాషా ఐఎఎస్‌ హోదాతో రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఐఎఎస్‌ హోదాతో జేసిగా బాధ్యతలు స్వీకరించిన జెసి యాస్మిన్‌ భాషాకు జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి ఫోన్‌లో అభినందించారు. డిఆర్వో ఎన్‌.ఖీమ్యానాయక్‌, ఆర్డీఓ టి.శ్రీనివాసరావు, డిఆర్‌డిఓ బి.రవీందర్‌, డిఇఓ రాధాకిషన్‌, డిసిఎస్‌ఓ శ్రీనాథ్‌, డిపిఆర్వో మామిండ్ల దశరథం, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీకాంత్‌, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ పరిపాలనా అధికారి గంగయ్య, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రసాద్‌, విజయ్‌, రామకష్ణ, ప్రశాంత్‌, ఇతర కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ బాధ్యతల స్వీకరణ అనంతరం జెసి యాస్మిన్‌ భాషా మాట్లాడుతూ ఐఎఎస్‌ హోదా మరింత భాద్యతను పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మరింత విస్తత సేవ చేసేందుకు అవకాశం లభించిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

aropanalu nirupinchakunte udyogam vadulukuntava…, ఆరోపణలు నిరూపించకుంటే ఉద్యోగం వదులుకుంటావా…?

ఆరోపణలు నిరూపించకుంటే ఉద్యోగం వదులుకుంటావా…?

కాజీపేట సీఐకి కార్పోరేటర్‌ బహిరంగ లేఖ

‘ఖాకి ఎంత కఠినం’ శీర్షికన ‘నేటిధాత్రి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై దుమారం రేగుతోంది. కథనం ప్రచురితం కాగానే కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ పత్రికకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ మెసేజ్‌ పోస్టు చేశారు. ఈ మెసేజ్‌లో పత్రికపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే కబ్జా కార్పోరేటర్‌కు సహకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్న స్పందించారు. సీఐ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ గురువాంర ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. భూమి విషయంలో అన్ని అర్హతలు ఉన్న బాధితుడు తనకు వినతిపత్రం ఇచ్చాడని భూమికి సంబంధించిన అన్ని పత్రాలను ‘నేటిధాత్రి’ గ్రూప్‌లో పోస్టు చేశారు. తనపై సీఐ చేసిన ఆరోపణలు నిరూపిస్తే కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే సీఐ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడా…? అని సవాల్‌ విసిరారు. కబ్జాదారులకు ఎవరు సహకరిస్తున్నారో అందరికీ తెలుసునని, బాధితుల భూమి సర్వే నెంబర్‌ 641, సీఐ సహకరిస్తున్న వారి సర్వే నెంబర్‌ 730, 731లకు కిలోమీటర్‌ దూరం ఉందని అన్నారు. సీఐ కావాలనే ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సివిల్‌ విషయంలో తలదూర్చి బాధితుడిని బెదిరింపులకు గురిచేస్తున్నాడని కార్పొరేటర్‌ సీఐ, బాధితుడిని బెదిరిస్తున్న ఆడియోను విడుదల చేశారు.

చట్టప్రకారం నడుచుకుంటాం

కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌

తాము చట్టప్రకారమే నడుచుకుంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కార్పొరేటర్‌ స్వప్న బహిరంగ లేఖపై స్పందించిన ఆయన ఎవరి పక్షం వహించాల్సిన అవసరం తమకు లేదని, చట్టప్రకారం నడుచుకుంటూ న్యాయం పక్షమే తాముంటామని అన్నారు. భూమి ఎవరిదనేది కోర్టు తేల్చుతుందన్నారు.

bukabzalatho maaku sambandham ledu, భూకబ్జాలతో మాకు సంబంధం లేదు

భూకబ్జాలతో మాకు సంబంధం లేదు

కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌

నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఎలాంటి భూకబ్జాలతో తమకు సంబంధం లేదని 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌ ‘నేటిధాత్రి’కి స్పష్టం చేశారు. భూకబ్జాల విషయంలో తమ డివిజన్‌ను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. మూడు దశాబ్ధాల రాజకీయ జీవితంలో తన భర్త కాని, 21వ డివిజన్‌లో ప్రజాభిమానాన్ని చూరగోని భారీ మెజార్టీతో గెలుపొందిన తానుగానీ, ప్రజల పక్షమే నిలుస్తాం తప్ప ప్రజావ్యతిరేకమైన పనులను ఏనాడు చేయమన్నారు. 21వ డివిజన్‌లో ఎలాంటి భూకబ్జాలకు తాము పాల్పడటం కానీ, ఎవరికీ సహకరించడం కానీ చేయడం లేదని అన్నారు. ఎవరు గిట్టని వారు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని, భూములను కోల్పోయిన భాదితులు ఎవరైన తమపై ఆరోపణలు చేస్తే అవి తప్పని నిరూపించడానికి తాము సిద్ధమన్నారు. కార్పోరేటర్‌గా గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేశామే తప్ప అక్రమాలకు ఎన్నడు పాల్పడలేదని, పాల్పడబోమని అన్నారు. తమపై ఎవరైన నారాధారమైన ఆరోపణలు చేస్తే అవి తప్పని నిరూపిస్తామని, చేయనప్పుడు తాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసేవ చేయడం తప్ప కబ్జాలు, అవినీతి, అక్రమాలు చేయడం తమకు రాదన్నారు. డివిజన్‌లో ఎవరిని పలకరించిన తమకు క్లీన్‌చీట్‌ ఇస్తారని రాజకీయాల్లో నీతిగా తాము మెదలుతున్నామన్నారు.

 

marosari bariga bangaram pattivetha, మరోసారి భారీగా బంగారం పట్టివేత ..

మరోసారి భారీగా బంగారం పట్టివేత ..

దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో ప్రత్యేకమైన జేబులను తయారుచేసుకుని బంగారాన్ని ప్రయాణికులు తీసుకువచ్చారు. బంగారం విలువ కోటి రూపాయల పైచిలుకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలుపుతున్నారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులు విచారిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే 7కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

june 1 nunchi kotha ration cardulu, జూన్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

జూన్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

తెలంగాణలో జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ వేగవంతం చేసింది. ఇందుకోసం రెండు కమిటీలను నియమించింది. కొత్తగా రేషన్‌కార్డులకోసం

దరఖాస్తు చేసుకునేవారు, కొత్త పేర్లను చేర్చుకునేవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

encounterlo iddaru mavolu mruthi, ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి

సుఖ్మా జిల్లా దంతెవాడలోని ఆర్నాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో డీఆర్‌ జీ, ఎస్‌టీఎఫ్‌ బందాలు కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో కూంబింగ్‌ బృందాలు కూడా ఎదురు కాల్పులు చేయగా ఇద్దరు మావోలు మతిచెందారు. వీరిలో ఒకరు పురుషుడు, ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. వీరి వద్ద నుండి విప్లవ సాహిత్యం, ఒక ఇన్‌ సాస్‌, 12 బోర్‌ వెపన్‌లను పోలీస్‌ బందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతూనే ఉంది.

rakthadana shibiram, రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరం

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలలో క్షతగాత్రులకు సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక చాలామంది మరణిస్తున్నారని, అలాగే ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు అనేక జబ్బులకు గురికావల్సి వస్తుందని వీరికి రక్తం అందించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రక్తం బ్లడ్‌ బ్యాంక్‌లలో ఒక్కొక్కసారి అందుబాటులో ఉండటం లేదని, దీనికంతటికి కారణం దాతలు రక్తదానాలు చేయకపోవడమే ప్రధాన కారణమని కాజీపేట ఏసీపీ నర్సింగరావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలకేంద్రానికి చెందిన చిలుక మేఘన స్వేరో తన శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువ ఉండి బ్రెయిన్‌ ట్యూమర్‌కు గురై మరణించడం జరిగింది. ఇలాంటి మరణాలు నివారించడానికి ఆమె జ్ఞాపకార్థంగా ధర్మసాగర్‌ మండలకేంద్రంలో అంబేద్కర్‌ విజ్ఞాన మందిరం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు బొడ్డు ధనుంజయరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరం గురువారం వరంగల్‌ ఎంజిఎం బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతుందని యువకులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను కాజీపేట ఏసీపీ నర్సింగరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎం వైద్యులు డాక్టర్‌ బి.రాజమోహన్‌, డాక్టర్‌ జి.వేణు, డాక్టర్‌ మల్లిఖార్జున్‌, డాక్టర్‌ కొమురయ్య, మడికొండ సీఐ జాన్‌నర్సింహులు, స్థానిక సీఐ శ్రీలక్ష్మీ, ఎస్సై విజయ్‌రామ్‌కుమార్‌, బొడ్డు ప్రసాద్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version