gramala uvakule deshaniki pattukommalu, గ్రామాల యువకులే దేశానికి పట్టుకొమ్మలు

గ్రామాల యువకులే దేశానికి పట్టుకొమ్మలు

గ్రామాల్లో ప్రజలు స్నేహపూర్వకంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని డిసిపి నాగరాజు అన్నారు. గురువారం సాయంత్రం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో నర్సంపేట ఏసీపీ సునీతమోహన్‌ ఆధ్వర్యంలో కార్టన్‌సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిలో తనిఖీలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ఆధార్‌కార్డులు పరిశీలన, గ్రామాల్లోని ద్విచక్రవాహనాలకు లైసెన్సులు, ఇన్సూరెన్సుతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలు లేని ద్విచక్రవాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా డిసిపి నాగరాజు మాట్లాడుతూ గ్రామాలల్లో రైతులు విత్తనాలు తీసుకొనేటప్పుడు కల్తీ విత్తనాలకు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఏసీపీ సునీతామోహన్‌ మాట్లాడుతూ వేసవికాలంలో ఆరుబయట నిద్రపోకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా సూచనలు పాటించాలని, చిన్న వయస్సులోనే మద్యానికి బానిసై అధిక వేగంతో ద్విచక్రవాహనాలు నడుపుతున్నారని యువతను ఉద్దేశించి మాట్లాడారు. నర్సంపేట టౌన్‌ సీఐ దేవేందర్‌రెడ్డి, నెక్కొండ సిఐ పెద్దన్నకుమార్‌, నర్సంపేట ఎస్సై నాగ్‌నాథ్‌, దుగ్గొండి ఎస్సై సాంబమూర్తి, చెన్నారావుపేట ఎస్సై జగదీష్‌, ఏఎసైలు, కానిస్టేబుల్స్‌, సిటీ గార్డ్‌ పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.

bamatho…boss, ‘భామ’తో…బాస్‌

‘భామ’తో…బాస్‌

‘గులాబి’ సినిమాలో హీరో హీరోయిన్‌తో బైక్‌పై చెక్కర్లు కొట్టే సన్నివేశం చూశాం. బైక్‌పైనే డ్యూయెట్‌ సాంగ్స్‌ పాడుకోవడం విన్నాం. అదంతా సినిమా మయం. సేమ్‌ అలాగే ప్రేమప్రయాణం సాగించాలనుకున్నాడో ఏమో..? మంచి బుద్దులు నేర్పాల్సిన ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా యువకుడై ప్రేమప్రయాణం చేస్తున్నాడు. పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకొని ఆ అధికారి ఓ మహిళతో ‘ప్రేమలీలలు’ సాగిస్తున్నాడు. వీరి ప్రేమ ఏకంగా ఆ అధికారి పనిచేసే కార్యాలయంలోనే కలుసుకునేంత వరకు వచ్చింది. హద్దులు మీరిన వీరి ప్రేమ సరసానికి కార్యాలయంలోని సీసీ కెమెరాలు సైతం సిగ్గుపడి తలదించుకునే పరిస్థితికి వచ్చింది.

( ‘భామ’తో…బాస్‌ లీలలు త్వరలో…)

rjdnyna…kammestham…,’ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…?

‘ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…?

నేను తలుచుకుంటే ఎవ్వరినైనా మేనేజ్‌ చేయగలను…నాకు ఇంటర్‌బోర్డులో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి..కమీషనర్‌ నాకు బాగా క్లోజ్‌..గతంలో ఓ ఆర్జేడిని సస్పెండ్‌ చేయించింది ఎవరో తెలుసా…కళ్లు మూసుకొని ఎన్నో ప్రైవేటు కాలేజీలకు చిటికెలో అనుమతులు ఇచ్చినోన్ని…గప్పుడే నన్ను ఏం చేయలేకపోయారు..గిప్పుడు ఎవరొస్తరు..ఏం చేత్తరు…ఇంతకంటే ఆఫీస్‌లో పెద్దమొత్తంలో అవినీతి జరిగిన దాఖలాలు లేవా..? మనం నొక్కింది ఏమన్నా కోట్ల రూపాయాలా..? కేవలం లక్షలే కదా..! దీనికి భయపడుడెందుకు..నేనున్నా..మీరు ధైర్యంగా ఉండండి… అన్ని నేను చూసుకుంటాను…నా వాటా నాకు ఇవ్వండి చాలు, మిగితావన్ని నేను మేనేజ్‌ చేస్తా…అంటున్నాడట ఓ అధికారి. ఇదంతా వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులకు ఆ అధికారి భరోసాను కల్పిస్తున్నాడని ఈయన అండదండలతోనే వారు అవినీతికి పాల్పడ్డారని పలువురు చర్చించుకుంటుండటంతో ఆ నోటా..ఈ నోటా విషయం మొత్తం జిల్లాను దాటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీరి అవినీతి భగోతాన్నే మాట్లాడుకుంటున్నారని సమాచారం.

ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు…

అవినీతి లీలలపై విచారణ కమిటి వేస్తే దొరికిపోవడం ఖాయం సార్‌..అంటున్న కొందరి ఉద్యోగులతో మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు..నాకు ఇంటర్‌బోర్డులో పెద్దసార్లు తెలుసు నేను ఎలాచెబితే అలా వింటారు..అసలు కమిటి వేయరు..వేసినా ఇక్కడి రాక ముందే మేనేజ్‌ చేస్తాను, మీరు ఏం భయపడవద్దని అవినీతికి పాల్పడిన దొంగలకు ధైర్యం చెబుతున్నాడని బయట ప్రచారం జరుగుతున్నది.

నా వాటా నాకు ఇస్తే చాలు

మీరెంతన్నా నొక్కండి..నొక్కేసిన దాంట్లో నాకు మాత్రం నా వాటా ఇస్తే చాలు మిగితావన్ని నేను చూసుకుంటాను, రిజిష్లర్లు మార్చుడు, బిల్లులు సృష్టించుడు, దొంగసంతకాలు చేసుడు, దొంగ పేర్లను ఎంట్రీ చేసుడు, లేని సంతకాలు పెట్టుడు, దొంగల అకౌంట్లు ఇక్కడ భాయ్స్‌గా పని చేసినవారేనని చెప్పుడు.. ఎంతసేపు పని మీరేమి భయపడకండి, నా వాటా నాకు ఇస్తే గివన్ని మేనేజ్‌చేసుడు పెద్ద సుతారమా..? అని ఓ అధికారి వీరికి కొండంత అండగా నిలుసున్నాడని, అతని పేరు చెప్పకుండా కొంతమంది గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

si vedipulaku yuvakudu bali, ఎస్సై వేధింపులకు యువకుడు బలి

ఎస్సై వేధింపులకు యువకుడు బలి

సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల గొడవ విషయంలో తలదూర్చిన సంగెం ఎస్సై నాగరాజు ఇజ్జిగిరి కార్తీక్‌ను పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తన కుమారుడిని తీవ్రంగా కొట్టిన విషయంలో కార్తీక్‌ తండ్రి లక్ష్మిపతి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఎస్సైపై చర్యలు తీసుకోక ముందే కార్తీక్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఎస్సై నాగరాజు ఓవరాక్షన్‌ మూలంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడాని మృతుడి తండ్రి లక్ష్మిపతి ఆరోపించారు. శవాన్ని సైతం పోస్టుమార్టమ్‌ త్వరగా చేయకుండా అడ్డుకుంటున్నారని తన కోడలుపై తప్ప ఎస్సైపై ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని సీఐ తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని లక్ష్మిపతి ఆరోపించారు. భార్యాభర్తల గొడవలు పరిష్కారం చేయమని కౌన్సిలింగ్‌ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళితే తన కుమారుడిని తీవ్రంగా చితకబాది ఆత్మహత్య చేసుకునేలా చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడి చావుకు కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

cini prashamsinchina cp, సీఐను ప్రశంసించిన సీపీ

సీఐను ప్రశంసించిన సీపీ

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ప్రశంసించారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డిని పోలీసుల సమక్షంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదేనని తెలిపారు. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసుశాఖకే గౌరవం తీసుకువస్తాయని ఉద్ఘాటించారు.

pds biyyam pattivetha, పిడిఎస్‌ బియ్యం పట్టివేత

పిడిఎస్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్‌ బియ్యాన్ని ఆర్‌పిఎఫ్‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఆర్‌పిఎఫ్‌ ఎస్సై కె. రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం…తాను, తన సిబ్బంది తమ విధినిర్వహణలో భాగంగా టిఎన్‌ 17201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో తనిఖీలు చేపట్టారు. తనికీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్‌ బియ్యం బస్తాలు కనిపించడంతో అవి ఎవరివి అని విచారించారు. వాటిని తరలిస్తున్న వారెవరు ఎవరు చెప్పకపోవడంతో ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది లైసెన్స్‌ పోర్టర్‌ల సహకారంతో అక్రమంగా తరలిస్తున్న 25బస్తాలు సుమారు 800కిలోల పిడిఎస్‌ బియ్యంపై తగు చర్య తీసుకునేందుకు రైల్వేస్టేషన్‌లోనే దించివేశామని తెలిపారు. అనంతరం వీటిని సివిల్‌ సప్లై అధికారులకు అప్పగించనున్నారు.

bakthajana sandramga kondagattu divyakshtram, భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం

భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అర్ధరాత్రి నుంచే ఆలయం కిక్కిరిసిపోయింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా కఠోరదీక్షతో ఇరుముడితో తరలివచ్చిన మాలదారులు అంజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించుకుని దీక్ష విరమణ చేస్తున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఏ వైపు చూసినా రామనామ జపంతో ఆలయం మారుమోగింది.

గట్టి భద్రతా ఏర్పాట్లు

జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో 450మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. ఎస్పీ సింధూశర్మ దగ్గర ఉండి భద్రతను పర్యవేక్షించారు.

gananga hanuman jayanthi vedukalu, ఘనంగా హనూమాన్‌ జయంతి వేడుకలు

ఘనంగా హనూమాన్‌ జయంతి వేడుకలు

వర్థన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ జయంతి, దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు బుధ, గురువారాలు రెండురోజులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ కౌడగాని కవితరాంబాబు, శివాని విద్యాసంస్థల చైర్మన్‌ తాళ్లపల్లి స్వామి, శుభనందిని సంస్థల చైర్మన్‌ కౌడగాని రాంబాబు, గ్రామ పాలకవర్గం, ఆలయ కమిటి సభ్యులు, గ్రామస్తులు పాల్గోన్నారు.

acb valalo vro, ఏసీబీ వలలో విఆర్వో

ఏసీబీ వలలో విఆర్వో

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని మద్దివంచ విఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవారం మద్దివంచ గ్రామ విఆర్వో శివరావు 1.40లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

bahirangamga urithiyali, బహిరంగంగా ఉరితీయాలి..

బహిరంగంగా ఉరితీయాలి..

యాదాద్రి జిల్లా వలిగొండలో వికలాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను వెంటనే ఉరితీయాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం చిలుకూరు మండల రామాపురం గ్రామంలో అత్యాచారం చేసిన వ్యక్తి మహేందర్‌పై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా పోలిసులు వ్యవహరించిన తీరుపై వికలాంగుల సంఘాలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఐనవోలు మండలకేంద్రంలో సింగారం గ్రామంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశంలో జన్ను రాజు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర హోంమంత్రి వెంటనే స్పందించాలని, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగ మహిళలపై రోజుకు ఒక్కో ప్రాంతంలో ఏదో చోట అత్యాచారాలకు పాల్పడుతున్న సకలాంగులపై చర్యలు తీసుకోవడంలో, వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంలో తెలంగాణా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. వికలాంగుల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి స్థాయిలో సమీక్షా నిర్వహించి వికలాంగ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన 2016 వికలాంగుల చట్టాన్ని అమలుచేయాలని, తీసుకువచ్చేందుకు కషి వలిగోండలో వికలాంగురాలు బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనీ పోలీసులను ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికీ న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వాలు వికలాంగులకు ఒక న్యాయం, సకలాంగులకు మరో న్యాయంలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సకలాంగుల మహిళపై అత్యాచారాలు జరిగితే నిర్భయ చట్జాలు తెచ్చిన ప్రభుత్వాలు, వికలాంగుల మహిళలపై అత్యాచారాలు జరిగితే అదే రీతిలో ఎందుకు స్పందించారని అన్నారు. గతంలో జానారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో వరంగల్‌ జిల్లాలో ప్రణీత, స్వప్నిక అనే ఇద్దరు యువతులపై యాసిడ్‌ దాడీ జరిగితే అప్పటీ ప్రభుత్వం అత్యాచారం చేసిన వారిపై ఎన్‌కౌంటర్‌ చేసిందనీ, మరి ఇప్పుడు వికలాంగుల మహిళలపై రోజురోజూకు అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్‌కు సహకరించడం లేదని, ప్రభుత్వాలు వికలాంగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ వరంగల్‌ జిల్లా ఇంచార్జ్‌ మడిగె నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగారపు స్వామి, మండల అధ్యక్షుడు తాటికాయల రమేష్‌, సారయ్య, ఎల్లయ్య, హైమవతి, సతీష్‌, కుమార్‌, రమ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీర శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూపాటి ఆనంద్‌, బొందయ్య, దుగ్గొండి మండల తెలుగు యువత అధ్యక్షుడు పెంచాల సతీష్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

దుగ్గొండిలో…

దుగ్గొండి మండలకేంద్రంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు, మల్లంపల్లి సర్పంచ్‌ చుక్క రమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హర్షం రాజయ్య, బూర్గు రవీందర్‌గౌడ్‌, రమేష్‌లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ధర్నాను విజయవంతం చేయాలి

ధర్నాను విజయవంతం చేయాలి

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో పోరాటకారులను విడిపించుట కోసం ఈనెల 31న చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలేంద్ర వెంకటేశ్వర్లు, గుంటి ప్రకాష్‌, చింతకింది శ్రీను, నల్ల రవీందర్‌, గొడిశాల ప్రత్యుష, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇంచార్జ్‌ డ్యాగల శ్రీనివాస్‌, మన్నే రామ్మోహన్‌, సనవులుల స్వామి, మర్రి రాజు, కోమండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

illaku current cut, ఇళ్లకు కరెంట్‌ కట్‌

ఇళ్లకు కరెంట్‌ కట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పథకం కార్యక్రమంలో మరుగుదొడ్లను నిర్మాణం పనులు పూర్తిచేయని లబ్ధిదారుల ఇళ్ల విద్యుత్తు కనెక్షన్‌లను గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు. ప్రభుత్వం గతం నుండే మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయని వారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించినప్పటికీ కొందరు లబ్ధిదారులు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించడంతో వారు అన్నంత పని చేశారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయని లబ్ధిదారులను ఇటీవల గుర్తించి స్థానిక ఎంపిడిఓ కొద్ది రోజుల వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని తెలిపిన విషయం తెలిసిందే. మంగళవారం చంద్రయ్యపల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి శతి ఆధ్వర్యంలో మరుగుదొడ్ల తనిఖీలను నిర్వహించారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను ఏమాత్రం చేయకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో వారి ఇంటి విద్యుత్తు కనెక్షన్లను సిబ్బంది సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 31లోపు పూర్తిచేసుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బరిగెల లావణ్య కిషోర్‌, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, రాజేశ్వర్రావుపల్లి సర్పంచ్‌ యువరాజు, కారోబార్‌ కొల్లాపురం కోటిలింగం, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మాటేటి శ్రీను, సిబ్బంది రజనీకర్‌, ఎల్లయ్యలు పాల్గొన్నారు.

hanuman jayanthi utsavalu, హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

హసన్‌పర్తి మండలంలోని సూదన్‌పల్లి గ్రామంలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరు కొబ్బరికాయతో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రామనామస్మరణతో గ్రామమంతా మార్మోగింది. గ్రామంలోని ఆలయానికి పెద్దఎత్తున హనుమాన్‌ దీక్షా స్వాములు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

prathyaka adhikariniki sanmanam, ప్రత్యేక అధికారిణికి సన్మానం

ప్రత్యేక అధికారిణికి సన్మానం

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పదవతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఆ పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజులను జిల్లా కలెక్టర్‌ గుండ్రాతి హరిత, ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్‌లు హరిత ప్రసాదం (మొక్క), శాలువాతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిణి మంజుల మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో నిరుపేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని తెలిపారు. అందుకు గుర్తించిన ప్రభుత్వం అవార్డుతో పాటు పాఠశాల అభివద్ధి కోసం 50వేల నగదు పారితోషికాన్ని అందిస్తున్నదని అన్నారు. నగదు బహుమతిని జూన్‌ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కలెక్టర్‌ చేతుల మీదుగా అందుకోనున్నట్లు ప్రత్యేకాధికారిణి మంజుల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకురాళ్లు సుభాషిని, స్రవంతిలు పాల్గొన్నారు.

తెలంగాణ ఆణిముత్యం.. సురవరం

సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆణిముత్యమని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి 123వ జయంతి వేడుకలను గ్రంధాలయ సంస్థ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి నిజాంకాలంలోనే గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని గుర్తుచేశారు.

తెలంగాణలో కవులు లేరనే విమర్శను సవాల్‌గా స్వీకరించి 354మందితో గోల్కొండ కవుల సంకలనం ద్వారా మన మట్టి గొప్పతనాన్ని చాటారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక చరిత్రను సష్టించుకున్న సురవరం తెలంగాణ ఆణిముత్యమని కొనియాడారు. తెలంగాణలో తెలుగురాదని వాదన ఉన్న సమయంలో సురవరం గోల్కొండ పత్రిక స్థాపించి ప్రజాసమస్యలను పత్రికలో ప్రచురించి ప్రజలపక్షాన నిలిచారన్నారు. నిజాం నిరంకుశపాలన కాలంలోనే సురవరం తెలుగుపత్రికను స్థాపించి తెలంగాణవాణిని వినిపించారన్నారు.

సాంఘిక సంస్కర్తగా ఆయన బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలిచారని, రెడ్డిహాస్టల్‌ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఆయన రచనా సమగ్రాన్ని తెలంగాణ ప్రజలలోకి తీసుకెళ్లేందుకు తద్వారా సురవరం గౌరవాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. జిల్లా ప్రజాసంబంధాల అధికారి మామిండ్ల దశరథం మాట్లాడుతూ సురవరం బహుముఖ ప్రజ్ఞాశాలి అని, పత్రికా సంపాదకుడిగా, రచయితగా, గ్రంథాలయోద్యకారుడిగా, రెడ్డి హాస్టల్‌ నిర్వాహకుడిగా, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా విశేష కషి చేశారన్నారు. తెలంగాణలో సాహిత్య చైతన్యాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. గొల్కొండ పత్రిక, గొల్కొండ కవుల సంకలనంతోపాటు తొలి జానపద సాహిత్యాన్ని సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించారన్నారు.

aruhulaku double bedroom illu nirminchali, అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి

అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి

అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్రీకాంత్‌ అన్నారు. మంగళవారం శాయంపేట మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా మిషన్‌ భగీరథ నల్లాలు పూర్తిగా నిర్మించాలని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ్‌, ప్రసాద్‌, ప్రభాస్‌, వికాస్‌, మోహన్‌, కపిల్‌ రామ్‌ పాల్గొన్నారు.

govulatho veluthunna lorry pattivetha, గోవులతో వెళుతున్న లారీ పట్టివేత

గోవులతో వెళుతున్న లారీ పట్టివేత

అక్రమంగా గోవులను తరలిస్తున్న రెండు కంటైనర్ల పెట్టే గల వాహనాలను మంగళవారం వెంకటాపురం యువకులు పట్టుకున్నారు. పట్టుకున్న రెండు లారీలలో గోవులు ఉండటాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. వెంకటాపురం యువకులు పట్టుకున్న రెండు లారీలు, గోవులను పోలీసులకు అప్పగించారు. రెండు లారీలు, పశువులు పోలీసుల అదుపులో ఉన్నాయి.

mhmpia avagahana karyakramam, ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం

ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం

మెన్‌స్ట్రాల్‌ హైజినిక్‌ డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మహిళలతో ర్యాలీ చేపట్టారు. మంగళవారం పట్టణకేంద్రంలోని పొదుపు భవన్‌లో ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఎంహెచ్‌ఎంపై అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు, కిశోర బాలికలకు పరిశుభ్రత లేకపోవడం వల్ల అనేకరకాల ఆరోగ్యసంబంధమైన శారీరక, మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఎన్నో అపోహాలతో ఆ రోజుల్లో బయటకు వెళ్లవద్దని మూఢనమ్మకాలను పాటిస్తున్నారని తెలిపారు. గ్రామగ్రామాల్లో అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టి మహిళలు, కిషోర బాలికలలో అవగాహన కల్పించాలని చెప్పారు. సానిటరి పాతపద్దతులను మానేసి కొత్త పద్దతులు అవలంభించేలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా మార్పు తీసుకురావాలని, గ్రామాల్లో మరుగుదొడ్లు, ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేసినవిధంగానే ఎంహెచ్‌ఎంపై ప్రచారం చేయాలని వివరించారు. డిడబ్ల్యుఓ మాట్లాడుతూ కిషోర బాలికలకు, మహిళలకు రుతుస్రావ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. అదేవిధంగా సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. అదనపు డిఆర్‌డిఓ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా ప్రతి సమావేశంలో ఎంహెచ్‌ఎంపై చర్చించి పేదప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ డిపార్టుమెంట్‌ ఆర్‌బిలు, వైద్యులు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, ఎస్‌బిఎం కన్సల్టెంట్‌ సురేష్‌, సిడిపిఓలు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు, డిఎం అండ్‌ హెచ్‌ఓలు, ఎఎన్‌ఎంలు, ప్రేమ్‌కుమార్‌, నిహారిక, రమ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

prajala avasaralaku thaggattuga panicheyali, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి

ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి

ప్రజల మనోభావాలు, అవసరాలకు తగ్గట్లుగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తించాల్సి వుంటుందని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పనీతీరుపై రాష్ట్ర డీజీపీ మంగళవారం రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతోపాటు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లయిన ఇన్స్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లతో హైదరాబాద్‌ డిజీపీ కార్యాలయం నుండి వీడియో సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌తోపాటు కమిషనరేట్‌కు చెందిన అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో గత తొమ్మిదినెలల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన శాసన, పార్లమెంటరీ, పంచాయితీ, పరిషత్‌ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు, ఎలాంటి సంఘటన జరగకుండా ఎన్నికల విధులు నిర్వహర్తించినందుకు డీజీపీ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌తోపాటు అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం రానున్న తెలంగాణ పోలీసుల ముందున్న లక్ష్యాలపై డీజీపీ వివిధస్థాయి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరం తెలంగాణ పోలీస్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ పోలీస్‌గా నిలిచిందని, ఈ స్థాయికి తెలంగాణ పోలీస్‌ను తీసుకరావడంలో పోలీస్‌ ఆధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయడమే ఇందుకు కారణమని. ఫిర్యాదుదారుడు రాష్ట్రంలోని ఏ పోలీస్‌స్టేషన్‌కు, ఏ సమయంలో వెళ్లిన ఒకే విధమైన స్పందన వుండాలని, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మనమందరం జీతాలందుకుంటున్నామని, ప్రజలను మన యజమానులుగా భావించాల్సి వుంటుందని తెలిపారు. అధేవిధంగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా పోలీసు అధికారులు పనిచేయాలని, విధినిర్వహణలో భాగంగా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పోలీసులు విధులు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా చట్టాలను అమలుపర్చే ముందుగా పోలీసులు, అధికారులు చట్టాలను పాటించాల్సి వుంటుందని, ముందుగా ట్రాఫిక్‌ సంబంధించి ప్రతి పోలీస్‌ అధికారులు విధిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మేట్‌ ధరించాల్సి వుంటుందని సూచించారు. అధేవిధంగా కారుడ్రైవింగ్‌ చేసే సమయంలో సీటుబెల్ట్‌ తప్పక ధరించే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్‌స్టేషన్లతోపాటు పోలీస్‌ కార్యాలయాల్లో పనితీరుతోపాటు, పరిసరాలను మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన 5ఎస్‌ అమలుతీరుపై రాష్ట్ర డీజీపీ అడిగిన ప్రశ్నకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ తెలిపిన వివరణపై రాష్ట్ర డీజీపీ సంతోషాన్ని వ్యక్తం చేయడంతోపాటు ఇన్‌స్పెక్టర్‌ను అభినందించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చినప్పుడు తప్పకుండా కమిషనరేట్‌ పరిధిలో 5ఎస్‌ ఆమలుతీరును పరిశీలిస్తానని డీజీపీ పోలీస్‌ కమిషనర్‌కు తెలిపారు. ఈ సమావేశంలో ఎసిపిలు చక్రవర్తి, శ్రీనివాస్‌, జనార్థన్‌, శ్యాంసుందర్‌ సింగ్‌, మాజీద్‌, బాబురావు, శ్రీనివాస్‌తోపాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సబ్‌-ఇన్స్‌స్పెక్టర్లు, పరిపాలన సిబ్బంది పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version