kazipet cipia HRClo firyadu, కాజీపేట సిఐపై హెచ్‌ఆర్‌సిలో పిర్యాదు

కాజీపేట సిఐపై హెచ్‌ఆర్‌సిలో పిర్యాదు

తన భూమి విషయంలో కాజీపేట సిఐ అజయ్‌కుమార్‌ తనను బెదిరింపులకు గురిచేస్తూ తన ప్రత్యర్థులకు సహకరిస్తున్నాడని వడ్డేపల్లికి చెందిన కటకం సంపత్‌ గురువారం మానవహక్కుల కమిషన్‌కు పిర్యాదు చేసారు. కాజీపేట సిఐ భూకబ్జాదారులకు సహకరిస్తూ తనపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నాడని, రౌడీషీట్‌ నమోదు చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సిఐ అండతో భూకబ్జాదారులు తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సీఐ తరుచుగా ఫోన్‌ చేస్తూ బూతులు తిడుతూ స్టేషన్‌కు రావాలని వేధిస్తున్నాడని లేఖలో భాదితుడు సంపత్‌ ఆరోపించాడు. భూమి విషయంలో కోర్టు నుంచి తనకు అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉందని సీఐకి వివరించే ప్రయత్నం చేసినా తన మాటను లెక్క చేయకుండా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందేనని ఫోన్‌లో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టు విచారణలో ఉందని బాధితుడు తెలిపారు.

acbki chikkina avinithi chepa, ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

అవినీతికి పాల్పడుతూ మెప్మాకు చెందిన ఓ కో-ఆర్డినేటర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మెప్మా సమన్వయ అధికారి (డిఎంసి) కమలశ్రీ పొదుపు సంఘం సభ్యురాలి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. రుణం మంజూరుకూ, రిసోర్స్‌ పర్సన్‌ నియామకానికి సంబంధించి లంచం డిమాండ్‌ చేసి, రూ.40 వేలు తీసుకుంటుండగా అధికారులు రైడ్‌ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

vidyarthi jivithalatho kalashala yajamanyam chelagatam, విద్యార్థి జీవితాలతో కళాశాల యాజమాన్యం చెలగాటం

విద్యార్థి జీవితాలతో కళాశాల యాజమాన్యం చెలగాటం

సుబేదారి పీఎస్‌లో యాజమాన్యంపై విద్యార్థి ఫిర్యాదు

విద్యాబుద్దులు నేర్పాల్సిన అధ్యాపకులు గుండాల్లా వ్యవహరించిన తీరు, మానవత్వాన్ని చేపాల్సిన కాలేజి యాజమాన్యం అధిక ఫీజుల రూపంలో మానవమృగాలై విద్యార్థి జీవితాన్ని సర్వనాశనం చేసిన ఘటన, మృదువుగా విద్యార్థి తల్లిని కాలేజికి రప్పించి మూకుమ్మడిగా ఆ తల్లిపై బెదురింపులకు పాల్పడిన కాలేజి అధ్యాపక బృందం. అడ్మిషన్‌ సమయంలో ఒప్పందం చేసుకున్న ఫీజు కంటే ఎక్కువ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసిన వైనం. ఫీజు చెల్లించలేదన్న సాకుతో నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా విద్యార్థి పరీక్షా ఫీజును ఇంటర్మీడియట్‌ బోర్డులో చెల్లించకుండా భవిష్యత్‌ను బజారుపాల్జేసిన ఘోర తప్పిదం. మా అబ్బాయి పరీక్షా ఫీజును ఎందుకు కట్టలేదని ప్రశ్నించిన తల్లిదండ్రులపై విద్యా విలువలను మట్టిలో గలిపి విద్యార్తి పేరెంట్స్‌ పైనే కాలేజి యాజమాన్యం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ ఫిర్యాదు చేసిన తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నది.ఇంటర్మీడియట్‌ బోర్డు డి.ఐ.ఈ.వో ప్రధానకార్యాలయానికి కూతవేటు దూరంలో వున్న ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజి నిబంధనలకు విరుద్దంగా నడుపుతూ, ఓ విద్యార్థి జీవితాన్ని కాలేజి యాజమాన్యం సర్వనాశనం చేసి, విద్యార్థి తల్లిని కాలేజికి పిలిపించి పదిమందికి పైగా కాలేజి అధ్యపకులు చుట్టు ముట్టి రౌఢీల్లా వ్యవహరించిన తీరుపై నగర ప్రజలు,విద్యార్థులు,విద్యార్థిసంఘాలు,ప్రజాసంఘాలు,విద్యావేత్తలు,విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కాలేజి పై పెదవి విరుస్తున్నారు.

shubanandini karyalayam mundu andholana, శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన

శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన

మహబూబాబాద్‌ జిల్లా పట్టణంలోని శుభనందిని చిట్‌ఫండ్‌ ప్రధానకార్యాలయం ముందు బాదితులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా బాదితులు మాట్లాడుతూ శుభనందిని చిట్‌ఫండ్‌లో నెలనెల చిట్టీలు కట్టామని,చిట్టీ ఎత్తుకున్న తతువాత డబ్తులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాదితులు తెలిపారు.ఇప్పుడిస్గాము,అప్పుడిస్తామంటూ కాలయాపన చేస్తుండటంతో ఆందోళన చేపట్టామని మాకు రావల్సిన చిట్టీ డబ్బులు ఇచ్చేంత వరకు మా ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.

okka cc camera vanda manditho samanam, ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం

ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం

సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య

నగరంలో ఇంటి యజమానులు ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య ప్రజలకు సూచించారు.సీసీ కెమెరాలతో ఇంటికి ఎంతో భద్రత వుంటుందని, ఒక్కో సీసీ కెమెరా వందమందితో సమానం అని అన్నారు.నగరంలో రోజురోజుకు దొంగలు పెట్రేగాపోతూ తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని వీరి బారి నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్క ఇంటి యజమాని సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు.30-40 లక్షలు పెట్టి ఇంటిని నిర్మించుకొని 20 వేల రూపాయలకు వచ్చే సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అలా కాకుండా ఇంటి భద్రత కొరకు సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సదయ్య నగర ప్రజలను కోరారు.

samyuktha collectorga yasmin basha, సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా

సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. నాన్‌ క్యాడర్‌ హోదాలో రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేస్తున్న యాస్మిన్‌ భాషాకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ హోదా ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. జెసితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మరో 10మందికి కలిపి మొత్తం 11మందికి కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ హోదాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

కొత్తగా ఐఎఎస్‌ పదోన్నతి పొందిన యాస్మిన్‌ భాషాకు నూతన హోదాతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యాస్మిన్‌ భాషా ఐఎఎస్‌ హోదాతో రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఐఎఎస్‌ హోదాతో జేసిగా బాధ్యతలు స్వీకరించిన జెసి యాస్మిన్‌ భాషాకు జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి ఫోన్‌లో అభినందించారు. డిఆర్వో ఎన్‌.ఖీమ్యానాయక్‌, ఆర్డీఓ టి.శ్రీనివాసరావు, డిఆర్‌డిఓ బి.రవీందర్‌, డిఇఓ రాధాకిషన్‌, డిసిఎస్‌ఓ శ్రీనాథ్‌, డిపిఆర్వో మామిండ్ల దశరథం, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీకాంత్‌, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ పరిపాలనా అధికారి గంగయ్య, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రసాద్‌, విజయ్‌, రామకష్ణ, ప్రశాంత్‌, ఇతర కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ బాధ్యతల స్వీకరణ అనంతరం జెసి యాస్మిన్‌ భాషా మాట్లాడుతూ ఐఎఎస్‌ హోదా మరింత భాద్యతను పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మరింత విస్తత సేవ చేసేందుకు అవకాశం లభించిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

aropanalu nirupinchakunte udyogam vadulukuntava…, ఆరోపణలు నిరూపించకుంటే ఉద్యోగం వదులుకుంటావా…?

ఆరోపణలు నిరూపించకుంటే ఉద్యోగం వదులుకుంటావా…?

కాజీపేట సీఐకి కార్పోరేటర్‌ బహిరంగ లేఖ

‘ఖాకి ఎంత కఠినం’ శీర్షికన ‘నేటిధాత్రి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై దుమారం రేగుతోంది. కథనం ప్రచురితం కాగానే కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ పత్రికకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ మెసేజ్‌ పోస్టు చేశారు. ఈ మెసేజ్‌లో పత్రికపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే కబ్జా కార్పోరేటర్‌కు సహకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్న స్పందించారు. సీఐ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ గురువాంర ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. భూమి విషయంలో అన్ని అర్హతలు ఉన్న బాధితుడు తనకు వినతిపత్రం ఇచ్చాడని భూమికి సంబంధించిన అన్ని పత్రాలను ‘నేటిధాత్రి’ గ్రూప్‌లో పోస్టు చేశారు. తనపై సీఐ చేసిన ఆరోపణలు నిరూపిస్తే కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే సీఐ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడా…? అని సవాల్‌ విసిరారు. కబ్జాదారులకు ఎవరు సహకరిస్తున్నారో అందరికీ తెలుసునని, బాధితుల భూమి సర్వే నెంబర్‌ 641, సీఐ సహకరిస్తున్న వారి సర్వే నెంబర్‌ 730, 731లకు కిలోమీటర్‌ దూరం ఉందని అన్నారు. సీఐ కావాలనే ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సివిల్‌ విషయంలో తలదూర్చి బాధితుడిని బెదిరింపులకు గురిచేస్తున్నాడని కార్పొరేటర్‌ సీఐ, బాధితుడిని బెదిరిస్తున్న ఆడియోను విడుదల చేశారు.

చట్టప్రకారం నడుచుకుంటాం

కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌

తాము చట్టప్రకారమే నడుచుకుంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కార్పొరేటర్‌ స్వప్న బహిరంగ లేఖపై స్పందించిన ఆయన ఎవరి పక్షం వహించాల్సిన అవసరం తమకు లేదని, చట్టప్రకారం నడుచుకుంటూ న్యాయం పక్షమే తాముంటామని అన్నారు. భూమి ఎవరిదనేది కోర్టు తేల్చుతుందన్నారు.

bukabzalatho maaku sambandham ledu, భూకబ్జాలతో మాకు సంబంధం లేదు

భూకబ్జాలతో మాకు సంబంధం లేదు

కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌

నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఎలాంటి భూకబ్జాలతో తమకు సంబంధం లేదని 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌ ‘నేటిధాత్రి’కి స్పష్టం చేశారు. భూకబ్జాల విషయంలో తమ డివిజన్‌ను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. మూడు దశాబ్ధాల రాజకీయ జీవితంలో తన భర్త కాని, 21వ డివిజన్‌లో ప్రజాభిమానాన్ని చూరగోని భారీ మెజార్టీతో గెలుపొందిన తానుగానీ, ప్రజల పక్షమే నిలుస్తాం తప్ప ప్రజావ్యతిరేకమైన పనులను ఏనాడు చేయమన్నారు. 21వ డివిజన్‌లో ఎలాంటి భూకబ్జాలకు తాము పాల్పడటం కానీ, ఎవరికీ సహకరించడం కానీ చేయడం లేదని అన్నారు. ఎవరు గిట్టని వారు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని, భూములను కోల్పోయిన భాదితులు ఎవరైన తమపై ఆరోపణలు చేస్తే అవి తప్పని నిరూపించడానికి తాము సిద్ధమన్నారు. కార్పోరేటర్‌గా గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేశామే తప్ప అక్రమాలకు ఎన్నడు పాల్పడలేదని, పాల్పడబోమని అన్నారు. తమపై ఎవరైన నారాధారమైన ఆరోపణలు చేస్తే అవి తప్పని నిరూపిస్తామని, చేయనప్పుడు తాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసేవ చేయడం తప్ప కబ్జాలు, అవినీతి, అక్రమాలు చేయడం తమకు రాదన్నారు. డివిజన్‌లో ఎవరిని పలకరించిన తమకు క్లీన్‌చీట్‌ ఇస్తారని రాజకీయాల్లో నీతిగా తాము మెదలుతున్నామన్నారు.

 

marosari bariga bangaram pattivetha, మరోసారి భారీగా బంగారం పట్టివేత ..

మరోసారి భారీగా బంగారం పట్టివేత ..

దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో ప్రత్యేకమైన జేబులను తయారుచేసుకుని బంగారాన్ని ప్రయాణికులు తీసుకువచ్చారు. బంగారం విలువ కోటి రూపాయల పైచిలుకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలుపుతున్నారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులు విచారిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే 7కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

june 1 nunchi kotha ration cardulu, జూన్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

జూన్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

తెలంగాణలో జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ వేగవంతం చేసింది. ఇందుకోసం రెండు కమిటీలను నియమించింది. కొత్తగా రేషన్‌కార్డులకోసం

దరఖాస్తు చేసుకునేవారు, కొత్త పేర్లను చేర్చుకునేవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

encounterlo iddaru mavolu mruthi, ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి

సుఖ్మా జిల్లా దంతెవాడలోని ఆర్నాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో డీఆర్‌ జీ, ఎస్‌టీఎఫ్‌ బందాలు కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో కూంబింగ్‌ బృందాలు కూడా ఎదురు కాల్పులు చేయగా ఇద్దరు మావోలు మతిచెందారు. వీరిలో ఒకరు పురుషుడు, ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. వీరి వద్ద నుండి విప్లవ సాహిత్యం, ఒక ఇన్‌ సాస్‌, 12 బోర్‌ వెపన్‌లను పోలీస్‌ బందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతూనే ఉంది.

rakthadana shibiram, రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరం

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలలో క్షతగాత్రులకు సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక చాలామంది మరణిస్తున్నారని, అలాగే ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు అనేక జబ్బులకు గురికావల్సి వస్తుందని వీరికి రక్తం అందించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రక్తం బ్లడ్‌ బ్యాంక్‌లలో ఒక్కొక్కసారి అందుబాటులో ఉండటం లేదని, దీనికంతటికి కారణం దాతలు రక్తదానాలు చేయకపోవడమే ప్రధాన కారణమని కాజీపేట ఏసీపీ నర్సింగరావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలకేంద్రానికి చెందిన చిలుక మేఘన స్వేరో తన శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువ ఉండి బ్రెయిన్‌ ట్యూమర్‌కు గురై మరణించడం జరిగింది. ఇలాంటి మరణాలు నివారించడానికి ఆమె జ్ఞాపకార్థంగా ధర్మసాగర్‌ మండలకేంద్రంలో అంబేద్కర్‌ విజ్ఞాన మందిరం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు బొడ్డు ధనుంజయరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరం గురువారం వరంగల్‌ ఎంజిఎం బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతుందని యువకులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను కాజీపేట ఏసీపీ నర్సింగరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎం వైద్యులు డాక్టర్‌ బి.రాజమోహన్‌, డాక్టర్‌ జి.వేణు, డాక్టర్‌ మల్లిఖార్జున్‌, డాక్టర్‌ కొమురయ్య, మడికొండ సీఐ జాన్‌నర్సింహులు, స్థానిక సీఐ శ్రీలక్ష్మీ, ఎస్సై విజయ్‌రామ్‌కుమార్‌, బొడ్డు ప్రసాద్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

athmiya sanmanam, ఆత్మీయ సన్మానం

ఆత్మీయ సన్మానం

గ్రేటర్‌ వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌కు గురువారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మానం కార్యక్రమం వరంగల్‌ తూర్పు వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ చౌరస్తాలోని ఆర్యవైశ్య భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వర్కింగ్‌ జర్నలిస్టు సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మేయర్‌ గుండా ప్రకాష్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని, వరంగల్‌ తూర్పు వర్కింగ్‌ జర్నలిస్టులు చేసిన సత్కారాన్ని తాను మర్చిపోలేనని అన్నారు. జర్నలిస్టుల ఇండ్ల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి జర్నలిస్టులకు గహాలను అందేలా కషి చేస్తానని తెలిపారు. ప్రజల సేవకే అంకితం కావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, నగర అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తానని హామీ ఇచ్చారు.

ci overaction, సీఐ ఓవరాక్షన్‌

సీఐ ఓవరాక్షన్‌

వరంగల్‌ నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల, భూకబ్జాదారులకు సహకరించిన పోలీసు అధికారుల పట్ల పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహారిస్తుందని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పదేపదే చెబుతున్న పోలీస్‌ బాస్‌ మాటలను పెడచెవిన పెడుతూ యథేచ్చగా భూకబ్జాదారులకు పోలీస్‌ అధికారులు సహకరిస్తున్నారని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి సంపత్‌ అనే భూభాదితుడిని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తీవ్ర వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు తన ఆవేదనను ‘నేటిధాత్రి’కి వ్యక్తం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…హన్మకొండ మండలం వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి సంపత్‌ భూబాధితుడికి సర్వే నెంబర్‌ 641/ఎ/ఇ లో గల స్థలం విషయంలో వివాదం ఉంది. ఈ వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తున్న క్రమంలో బాధితుడైన సంపత్‌కు కోర్టు అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. అయినప్పటికీ కొంతమంది భూకబ్జాదారులు 641/ఎ/ఇ వడ్డేపల్లిలోని ప్రశాంత్‌నగర్‌ స్థలంలో అక్రమనిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తనకు ఫోన్‌ చేసి ప్రశాంత్‌నగర్‌ స్థలవివాదంలో పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ మీపై కేసు నమోదైందని వస్తావా…రావా…అంటూ పరుషపదజాలంతో తిడుతూ బెదిరించాడని తెలిపారు. ఆ స్థలం మాదేనని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కబ్జాదారులకు వంతపాడుతూ తమను మానసికంగా భయభ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తున్నాడని చెప్పాడు. మాకు కోర్టు నుంచి ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉందని కూడా చెప్పిన వినకుండా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందే…రాకుంటే బాగుండదని వ్యక్తిగత దూషణ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు రమ్మని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు…రా…బే…అంటూ అవమానకరంగా మాట్లాడుతూ తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు. నాకు జరుగుతున్న అన్యాయంపై ప్రెస్‌మీట్‌ పెట్టుకుని వాస్తవాలను ప్రజలకు, పోలీసు ఉన్నతాధికారులకు తెలియపరుచుకుంటానని బాధితుడు సీఐకి చెప్పగా ప్రెస్‌మీటే పెట్టుకో…ఇంకేమైనా పెట్టుకో…అంటూ ధ్వంధార్థంతో తిట్టాడని తెలిపాడు. ఇదిలా ఉండగా…భూబాధితుల కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భూబాధితుల ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినా నగరంలో భూబాధితులకు భూకబ్జాదారుల నుంచి, వారికి సహకరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల నుండి వేధింపులు, బెదిరింపులు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. పోలీసులు సివిల్‌ తగదాలలో తలదూర్చవద్దని పోలీసు ఉన్నతశాఖ అధికారులు చెబుతున్న నగరంలో కొంతమంది పెడచెవిన పెడుతూ భూబాధితులను పైవిధంగా బెదిరింపులకు గురిచేయడంతోపాటు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో గత కొన్ని రోజుల క్రితం భూకబ్జాదారులకు సహకరిస్తున్నాడని విచారణలో తేలడంతో కాకతీయ యూనివర్సిటీ సీఐ రాఘవేందర్‌రావు, ఎస్సై విఠల్‌లను సస్పెండ్‌ చేసిన విషయం మరవకముందే కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ భూకబ్జాదారులకు వంతపాడుతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ భూబాధితుడిని బెదిరించిన వైనాన్ని చూస్తే పోలీసు అధికారులకు పోలీస్‌ బాస్‌ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల గౌరవం, భయం ఏ మాత్రం లేనట్లు కనిపిస్తుందని నగర ప్రజలు, భూబాధితులు భావిస్తున్నారు. ‘నేటిధాత్రి’ కాజీపేట సీఐని వివరణ కోరేందుకు ఫోన్‌ చేయగా సీఐ అందుబాటులో ఉండటం లేదు.

baari mejaritytho gelipinchukundam…,భారీ మెజారిటీతో గెలుపించుకుందాం….

భారీ మెజారిటీతో గెలుపించుకుందాం….

వర్ధన్నపేట మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి కులానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత, నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కషి చేస్తు, పొదుపు సంఘాలతోనే పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. పొదుపు సంఘాల అభివద్ధికి కషిచేస్తున్న భిక్షపతిని అన్నివర్గాల ప్రజలు ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర నాయకుడు పినింటి రవీందర్‌ రావు, జిల్లా అధ్యక్షుడు ఎండి.మదర్‌ పాషా, వెంకట్‌ రెడ్డి, రాజయ్య, మహబూబ్‌ఆలీ, సారయ్య, వీరయ్య, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

pranalikalu rupondinchali, నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిలు రూపొందించాలి

నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిలు రూపొందించాలి

వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి తెలిపారు. శనివారం డివిజన్‌లోని రంగశాయిపేట, గొల్లవాడ, రజకవీధి, కాపువాడలలో పర్యటించారు. అనంతరం డిఇ, ఎఇలకు ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటిని పంపిణీ చేయించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రంగశాయిపేటలోని కొన్ని ప్రాంతాలలో కనీసం ఒక బిందె నీరు కూడా రావడం లేదని, ఈ ప్రాంత ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డిఇ మనోహర్‌ మాట్లాడుతూ నీరురాని ప్రాంతంలో నూతనంగా పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తే ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేసి నీటి ఎద్దడిని తీర్చవచ్చని తెలిపారు. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారుచేసి కమీషనర్‌ దృష్టికి తీసుకువెళుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇ వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్‌ నాయకులు మరుపల్ల రవి, లైన్‌మెన్‌ కరుణాకర్‌తోపాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

spandana, ‘నేటిధాత్రి’కి స్పందన

‘నేటిధాత్రి’కి స్పందన

‘స్మశనమే తనదంటున్నాడు’ శీర్షికతో ‘నేటిధాత్రి’లో ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. సర్వే నెంబర్‌ 700లోని పెద్దమ్మగడ్డ స్మశన స్థలం కబ్జాకు గురైందని విషయాన్ని వెలుగులోకి ‘నేటిధాత్రి’ తీసుకురావడంతో కథనానికి స్పందించిన వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ఇటీవల ఏర్పాటు చేసిన భూబాదితుల ప్రత్యేక సెల్‌ అధికారి అయిన బోనాల కిషన్‌ విచారణ నిమిత్తం శనివారం పెద్దమ్మగడ్డ స్మశనవాటిక స్థల పరిశీలనకు పంపించారు. విచారణకు వెళ్లిన సీఐ ఇరువర్గాలతో మాట్లాడి తమ వద్ద ఉన్న ఆధారాలను తీసుకురావాలని వారికి చెప్పానని సీఐ బోనాల కిషన్‌ తెలిపారు. ఇరువర్గాలు తీసుకువచ్చే ఆధారాల ఆధారంగా నిజనిజాలను నిగ్గుతేల్చుతామని చెప్పారు.

aa naluguru corporatorlu, ఆ నలుగురు కార్పోరేటర్లు

అమాయకుల భూముల కొల్లగొడుతున్న ఆ నలుగురు కార్పోరేటర్లు

మీ సొంత స్థలంలో మీరు ప్రహారీగోడ కట్టుకున్న కూల్చేస్తారు…సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తారు…మా డివిజన్‌ కార్పోరేటర్‌ అయితే బెటర్‌ అని సలహా ఇస్తారు…తీరా కార్పోరేటర్‌ దగ్గరకు వెళ్తే ప్రహారీగోడ కూల్చిన గ్యాంగ్‌, కార్పోరేటర్‌ ఒక్కటేనని బాధితులకు బోధపడుతుంది. ల్యాండ్‌ కావాలంటే ఫిప్టీ..ఫిఫ్టీ మంత్రం ఉత్తమమని బెదిరిస్తారు. వినకుంటే ఏమవుతుందో అర్థమయ్యేలా విడమరచి చెప్తారు. ఉత్తపుణ్యానికి సగం భూమిని మింగేసి స్థల యజమానులకు చుక్కలు చూపిస్తారు. వరంగల్‌ తూర్పు 8,18,21,23వ డివిజన్లలో నలుగురు కార్పోరేటర్లు ఆడుతున్న భూసెటిల్‌మెంట్‌ ఆట ఇది. ఇలాగే ఉత్తపుణ్యానికి భూమిని కోల్పోయిన ఓ బాధితుడు ‘నేటిధాత్రి’ ని సంప్రదిస్తే ఈ కార్పోరేటర్ల తతంగం అంతా బయటపడింది.

6 nundi sri bhadrakali ammavari kalyana brahmastavalu, 6నుండి శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు

6నుండి శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు

వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవస్థానంలో ఈనెల 6వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహించబోతున్నామని ఈఓ సునీత, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో వారు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌ ప్రజలకు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ బ్రహ్మూెత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

 

కార్పొరేషన్‌ ‘దండ’న

కార్పొరేషన్‌ ‘దండ’న

వరంగల్‌ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎదురుగా బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తులకు బల్దియా అధికారులు పూలమాల వేసి జరిమాన విధిస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలుు వేస్తున్నారని నగర అభివద్ధికి మల, మూత్ర విసర్జననే అడ్డుపడిందా అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్‌లో ప్రాంగణంలోనే ఉన్న మరుగుదొడ్లకు తాళంవేసి ఉంటే ఎక్కడికి పోవాలని, కార్పొరేషన్‌ అధికారుల పనితీరుపై స్థానికులు, ప్రజలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పోరేషన్‌ అధికారులు నగరాభివృద్ధిపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version