*లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాల అప్పగింత*

 

*వరంగల్ పోలీస్* *కమిషనర్ డా.వి.రవీందర్*

*లాక్ డౌన్ సమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను వాహనదారులు తిరిగి అందజేసే ప్రక్రియ నేటి నుండి ప్రారంభిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రకటించారు.*

కరోనా నేపధ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత వాహన యజమానులను తిరిగి అందజేసే ప్రక్రియ జురుగుతున్న తీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ రోజు ఉదయం హన్మకొండ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా వాహనాలను తిరిగి అందజేసే తీరుపై పోలీసు కమిషనర్ సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాహనానికి సంబంధించిన ద్రువ ప్రతాలను అందజేసిన వాహనయజమానికి పోలీస్ కమిషనర్ వాహన తాళాలను అందజేయసారు.
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రకటించిన తేదినాటి నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 13917 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో *13040* *ద్విచక్ర వాహనాలు, *554* *ఆటోలు,* *281కార్లు,* *42 ట్రాక్టర్ లాంటి ఇతర వాహనాలను* స్వాధీనం చేసుకోవడంతో పాటు, 24,492 ఈ పెట్టీ కేసులు, 575 ఎఫ్.ఐ.ఆర్ కేసులు నమోదు చేయడం జరిగిందని.

సీజ్ చేసిన వాహనాలను వాహన యజమానులు తిరిగి పొందేండుకు గాను రాష్ట్ర పోలీస్ డీ.జీ.పీగారి మార్గ దర్శకాలను అనుసరించి రహదారులపై తనీఖీల క్రమంలో స్వాధీనం చేసుకున్న వాహనాలపై ఐ.పి.సి 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఈ విధంగా స్వాధీనం చేసుకున్న వాహనాలను పొందేందుకు యజమానులు ఆధార్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాల సంబంధించిన జిరాక్స్ కాఫీలతో పాటు, న్యాయస్థానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వాహనాన్ని ప్రవేశ పెడతామని వాహన యజమాని ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ ఇంచార్జ్ అదనపు డి.సి.పి మల్లారెడ్డి, హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్ దయాకర్, ఎస్.ఐలు శ్రీనివాస్,
కోమురెల్లితో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!