Vemula Mahender Goud Presents Temple Prasadam to Minister Konda Surekha
మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకుని మొక్కులను సమర్పించిన బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను శుక్రవారం హన్మకొండలోని రాంనగర్ లో గల మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారా..? లేదా అని మహేందర్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. తమరి ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల అభివృద్ధి పనులు చక చకా జరుగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సంబంధించి ఎక్కువ నిధులను కేటాయించి..ప్రజలకు మెరుగైన వసతులతో పాటు..ప్రజలలో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా..అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీపై, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు వేముల మహేందర్ గౌడ్ మంత్రి కొండా సురేఖకు తెలిపారు.
