ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం.

spiritual union

ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం
మెట్ పల్లి ఫిబ్రవరి 26 నేటి ధాత్రి
ఉదయసాహితి తెలంగాణ ఆధ్వర్యంలో అంతర్జాల సమూహం లో నిర్వహింపబడుతున్న నేటికవిత ఆత్మీయసమ్మేళనం ఫిబ్రవరి23న ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రంలో ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది., రెండు తెలుగు రాష్ట్రాల లోని నేటికవిత సభ్యులు ఈ సమ్మేళనం లో పాల్గొని సమ్మేళనానికి నిండు శోభను కూర్చారు. ఆత్మీయ పలకరింపుతో, సాహిత్య సంబంధ ఊసులను పంచుకోవడానికి ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం వేదికైంది. ఉదయసాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద వరి శ్రీవారు భోగోజు ఉపేందర్ రావు సమ్మేళనానికి హాజరైన ప్రతినిధుల కు ఆతిథ్యాన్నిచ్చి,అందరినీ సాదరంగా ఆహ్వానించారు. నేటికవిత అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య, నేటి కవిత సలహాదారు దాస్యం సేనాధిపతి పర్యవేక్షణలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహింపబడినాయి. ఉదయం పదిగంటలకు జరిగిన ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా భోగోజు ఉపేందర్ రావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనం చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు.
ఉదయసాహితి రాష్ట్ర బాధ్యులు శ్రీదాస్యం లక్ష్మయ్య, దాస్యం సేనాధిపతి, వురిమళ్ల సునంద తో పాటు ఖమ్మం అక్షరాల త్రోవ మిత్రులు రాచమల్ల ఉపేందర్, దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం వేదికను అలంకరించారు. సమావేశంలో దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం, శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి , తదితరులు అతిథి సందేశాలను అందించారు. అనంతరం స్వీయ పరిచయాలను మూడు ఆవృతాలలో నిర్వహించారు. కవయిత్రి బత్తిన గీతాకుమారి స్వాగతం పలికారు.
పుస్తకావిష్కరణలు
ఈ ప్రారంభ సమావేశంలోకరీంనగర్ కు చెందిన కవి నగునూరి రాజన్న రచించిన హైకూల సంకలనం వెలుగు పూలు ను దాస్యం సేనాధిపతి ఆవిష్కరించగా , మంగా నెల్లూరు కు చెందిన కవి యర్రాబత్తిన మునీంద్ర రచించిన కలల కావడి సంకలనాన్ని శ్రీదాస్యం లక్ష్మయ్య ఆవిష్కరించారు.
స్వీయ పరిచయ వేదికలు
ఆత్మీయసమ్మేళనానికి హాజరైన కవులు కవయిత్రులు స్వీయపరిచయవేదిక ద్వారా తమను గురించి తాము పరిచయించుకున్నారు. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు అధ్యక్షత న జరిగిన మొదటి ఆవృతంలో దాస్యం సేనాధిపతి, శ్రీదాస్యం లక్ష్మయ్య, వురిమళ్ల సునంద, కె.మంజుల, కందుకూరి మనోహర్, ఏడెల్లి రాములు, గుడ్లదొన సాయి చంద్రశేఖర్, కె.వి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, మేరుగు అనురాధ, నగునూరి రాజన్న, తుంబూరు జగన్మోహన్ తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు.
రెండవ ఆవృతంలో
రమాదేవి కులకర్ణి అధ్యక్షతన జరిగిన రెండవ ఆవృతంలో బత్తిన గీతాకుమారి, యర్రాబత్తిన మునీంద్ర, లింబగిరి స్వామి, ముద్దు వెంకటలక్ష్మి, చిందం సునీత, చింతల కమల, శింగరాజు శ్రీనివాస్ కుమార్, రమాదేవి బుక్కపట్నం, ఉదయశ్రీ ప్రభాకర్, యనమండ్ర వరలక్ష్మి, వేముల వరలక్ష్మి , పరిమి వెంకట సత్యమూర్తి, తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు.
మూడవ ఆవృతంలో
డా.చీదెళ్ల సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన మూడవ ఆవృతంలో లింగుట్ల వెంకటేశ్వర్లు, సయ్యద్ జహీర్ అహ్మద్, డా. ఆడేరు చెంచయ్య, కటుకం కవిత, కొలచన విజయభారతి, బిరుదురాజు ప్రమీలారాణి, మూర్తి శ్రీదేవి, తులసి వెంకట రమణాచార్యులు, అరుణ కీర్తి పతాక, అక్కి నర్సింలు గౌడ్, తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు.
అనంతరం ఉదయసాహితి సర్వసభ్య సమావేశం రాష్ట్ర గౌరవాధ్యక్షులు దాస్యం సేనాధిపతి అధ్యక్షతన జరిగింది.
భోజనానంతరం నేటికవిత సమూహం లో అర్హత సాధించిన 10 మంది కవులకు కవయిత్రులకు కవితాభూషణ
08 మంది కవులకు కవయిత్రులకు కవితావిభూషణ ఐదుగురికి సహస్ర కవితా స్ఫూర్తి అవ్వార్థులను బహుకరించారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వారందరికీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో అతిథులు, నిర్వాహకులచే ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం మూర్తి శ్రీదేవి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది
ఉదయసాహితి తెలంగాణ రాష్ట్ర సర్వ సభ్య సమావేశం – తీర్మానాలు
ఫిబ్రవరి 23 న ఖమ్మం లోని బోడెపూడి విజ్ఞాన కేంద్రం లో ఉదయ సాహితి తెలంగాణ సర్వ సభ్య సమావేశం రాష్ట్ర గౌరవాధ్యక్షులు దాస్యం సేనాధిపతి అధ్యక్షతన జరిగింది…ఈ కార్య క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద ల తో పాటు…రాష్ట్ర,జిల్లా కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.
తొలుత శ్రీమతి మూర్తి శ్రీదేవి స్వాగతం పలికారు. సభాధ్యక్షులు దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ సాహితీ వికాసం లో..సాహితీ సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉదయసాహితికి సహకరిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు..శ్రీదాస్యం లక్ష్మయ్య ఆధ్వర్యం లో ఉదయ సాహితి ద్వారానిర్వహింపబడుతున్న నేటి కవిత అంతర్జాల సమూహం లో వైవిద్యమైన కార్యక్రమాలను చేపట్టడం పట్ల తమ సంతోషాన్ని ప్రకటించారు..
సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద సభలు ఖమ్మం లో నిర్వహించినందులకు వారికి, వారి శ్రీవారు భోగోజు ఉపేందర్ రావ్ కి కృతఙ్ఞతలు తెలిపారు..అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరిమళ్ల సునంద తాము సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను వివరిస్తూ వార్షిక నివేదికను సమర్పించారు.
అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య కోశాధికారి పక్షాన ఆర్ధిక నివేదికను సమర్పించారు. అనంతరం సభ్యులంతా చర్చించి దిగువ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానాలు
ఇప్పుడున్న ఉదయసాహితి జిల్లా కమిటీలను రద్దు చేసి, రాష్ట్రస్థాయిలో ఒకే కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర అధ్యక్షులకు అధికారం ఇవ్వనైనది
ఉదయ సాహితి తెలంగాణ ఇంతకాలం ప్రతి నెలా మొదటి ,మూడవ ఆదివారాల్లో గూగుల్ మీట్ ద్వారా నిర్వహిస్తున్న సాహిత్య సమాలోచన కార్యక్రమాన్ని ఇకముందు ప్రతి నెల రెండవ ఆదివారం మాత్రమే నిర్వహించాలని నిర్ణయించనైనది
.మార్చ్ 2025 మాసం నుండి నేటికవిత సమూహం లో ప్రతి శుక్ర వారం బాల సాహిత్య సృజనకు చోటు కల్పించాలని తీర్మానించనైనది.
ఉదయ సాహితి రాష్ట్రం లో విస్తరణ కోసం రాష్ట్ర కమిటీ నందుఅన్ని ఉమ్మడి జిల్లాల నుండి సభ్యులను చేర్చుకునే అధికారం అధ్యక్షులకు ఇవ్వనైనది.
.రాష్ట్ర స్థాయిలో తమ తల్లిదండ్రుల స్మారకర్థం సాహితీ పురస్కారాలను ఉదయ సాహితీ ఆధ్వర్యం లో‌ అందజేయడానికి ముందుకు వచ్చిన దాస్యం సేనాధిపతి, లక్ష్మయ్య కు సభ తమ ఆమోదం తెలిపింది
ఉదయ సాహితీ సభ్యులందరూ నేటికవిత సమూహం లో చేర్చు కోవాలని నిర్ణయించనైనది
ఆంధ్రప్రదేశ్ లో ఉదయసాహితీ కమిటీ ఏర్పాటు మరియు విస్తరణ కోసం లింగుట్ల వెంకటేశ్వర్లు (తిరుపతి )ని కన్వీనర్ గా, సింగరాజు శ్రీనివాస్ కుమార్ (నెల్లూరు) ని కో కన్వీనర్ గా నియమించనైనది.
మూర్తి శ్రీదేవి వందన సమర్పణతో ఉదయసాహితి సర్వ సభ్య సమావేశం ముగిసింది.
ఉదయసాహితి తెలంగాణ
(రాష్ట్ర నూతన కార్యవర్గం )
తేది 23 ఫిబ్రవరి రోజున ఖమ్మం లో జరిగిన ఉదయసాహితి తెలంగాణ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య ప్రకటించారు
గౌరవాధ్యక్షులు* : శ్రీ దాస్యం సేనాధిపతి (కరీంనగర్ )
అధ్యక్షులు* శ్రీదాస్యం లక్ష్మయ్య (పెద్దపల్లి )
ఉపాధ్యక్షులు
ఎన్. వి. రఘువీర్ ప్రతాప్ (నల్గొండ )
డా. పోరెడ్డి రంగయ్య (ఆలేరు )
డా. పల్లేరు వీరాస్వామి (వరంగల్ )
ఎర్రం రాజా రెడ్డి (కరీంనగర్ )
శ్రీపెరంబుదూరి లింబగిరి స్వామి (మెట్ పల్లి )
మహిళా ఉపాధ్యక్షులు*
డా. చీదేళ్ల సీతాలక్ష్మి (హైదరాబాద్ )
రమాదేవి కులకర్ణి (హైదరాబాద్ )
మద్దెల సరోజన (జగిత్యాల )
చిందం సునీత (కరీంనగర్ )
కటుకం కవిత (కోరుట్ల )
ప్రధాన కార్యదర్శి :
వురిమళ్ల సునంద (ఖమ్మం )
సహాయ కార్యదర్శులు*:
ఏడెల్లి రాములు (పెద్దపల్లి ) గుడ్లదొన సాయి చంద్రశేఖర్ (హైదరాబాద్ )
మేరుగు అనురాధ (వరంగల్ )
నగునూరి రాజన్న (కరీంనగర్ )
కోశాధికారి : శ్రీ తులసి వెంకట రమణాచార్యులు హైదరాబాద్ )
మహిళా కార్యదర్శి మూర్తి శ్రీదేవి (హైదరాబాద్ )
ప్రచార కార్యదర్శి*లక్ష్మీ పద్మజ దుగ్గరాజు (హైదరాబాద్ )
కార్యవర్గ సభ్యులు*:
నామా పురుషోత్తం (ఖమ్మం )
అల్లాడి శ్రీనివాస్ (మంచిర్యాల )
మేజర్ రేళ్ళ సంజీవ్ (కరీంనగర్ )
రమాదేవి బుక్కపట్నం (హైదరాబాద్ )వకుళ వాసు (వరంగల్ )
తాళ్లూరి లక్ష్మి (ఖమ్మం )
తుంబూరు జగన్మోహన్ (నిజామాబాదు )
పరిమి సత్య మూర్తి .(హైదరాబాద్ )
పులి జమున (మహబూబ్ నగర్ )
డా. బి. సుధాకర్ ( సిద్దిపేట ) ఉషశ్రీ వెగ్గలం (కరీంనగర్ )
గుర్రాల మాధవ్ (మెట్టుపల్లి )
విజయలక్ష్మి నాగరాజు (కరీంనగర్ )
బత్తిన గీతాకుమారి (ఖమ్మం )
ప్రత్యేక ఆహ్వానితులు*
లింగుట్ల వెంకటేశ్వర్లు
శింగరాజు శ్రీనివాస్ కుమార్
సావిత్రి రంజోల్కర్,
డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి ముద్దు వెంకటలక్ష్మి పత్తిపాటి రూపలత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!