42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు
సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
Vaibhavalaxmi Shopping Mall
తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.
ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు
కేసముద్రం/ నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘాలు తలపెట్టిన ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సంపూర్ణ మద్దతు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి పట్టణ కార్యాలయం బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ అడ్డుపడటం తగదు. రెడ్డి సామాజిక వర్గం హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకుని హైకోర్టు స్టేను వెంటనే రద్దు చేయించి బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించా దానికి దోహదపడాలి. బీసీ సంఘాలు ఈ నెల 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణా బంద్ కు బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా వెంటనే చట్టాన్ని చేయాలి . రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవో9ను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించినా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రము లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం *9వ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.బీసీలను ఇంకెన్నాళ్లు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈనెల 18 జరుపు తలపెట్టిన బందును విజయవంతం చేయడానికి వ్యాపార వర్గాలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ఆటోలు, సినిమా హాలు అన్ని వర్గాలు సహకరించగలరని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజన్న ,మేకల రాజేశం ,పట్టణ కార్యవర్గ సభ్యులు బియ్యాల ఉపేందర్, బొంకురి రామచందర్, పులిపాక స్వామి దాస్. తదితరులు పాల్గొన్నారు ,
బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి
బీసీ రిజర్వేషన్లపై బిజేపి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అంబేద్కర్ విగ్రహానికి ఆవేదనతో కూడిన వినతి పత్రం అందజేత
రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి జిల్లా
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని రామన్నపేట మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటి ఆధ్వర్యంలోఈరోజు రామన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేస్తూ, గవర్నర్ వద్ద ఉన్న బిసి బిల్లు పాస్ అవ్వకుండా చేసి,ఇప్పుడు హైకోర్టులో స్టే విధించినా బిజేపి ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా బీసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హడావుడిగా అమలు చేశారని, మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాకుండా, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నదని, తక్షణమే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీఖున చేసే నిరసన ధర్నా , రాస్తారోకో కార్యక్రమాలను అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ సీనీయర్ నాయకులు వీరమల్ల.ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంతం, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, రచ్చ దయాకర్, ఊట్కూరి కృష్ణ, పెండెం రవీందర్ , సల్లా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే 18వ తేదీ శనివారం రామాయంపేట బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా బీసీ సంక్షేమం, రాజకీయ, కుల, మహిళా, యువజన, ఉద్యోగుల, దివ్యాంగుల, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకత్వంలో రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీకర ఫంక్షన్ హాల్‌లో సమావేశం జరిగింది. సమావేశంలో నేతలు మాట్లాడుతూ — రాష్ట్ర జనాభాలో 65 శాతం బీసీలు ఉన్నా, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కేవలం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత న్యాయం చేయాలంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లును చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ జేఏసీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణం మరియు మండలంలోని ప్రజలు, వ్యాపార వాణిజ్యవేత్తలు, కుల సంఘాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు ఉద్యోగులు, యువజన సంఘాలు, అలాగే ఎస్సీ–ఎస్టీ, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నాయకులు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు వచ్చి బంద్‌ను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం. మామిడి సిద్ధరాములు. పోచమ్మల అశ్విని శ్రీనివాస్. రేవెల్లి వినయ్ సాగర్. బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బుద్దుడి చూపిన అంబేద్కర్ ఆశయాలను నేటి యువత సాధించాలి.
చిట్యాల, నేటి ధాత్రి:
చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ ఆద్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భౌద్ధమతం స్వీకరించిన రోజును పురస్కరించుకుని ముందుగా గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పూలు వేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* విచ్చేసి మాట్లాడుతూ .. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు హిందువుగా పుట్టి హిందువుగా మరణించనని భారత దేశంలో ఉన్న అన్ని మతాల గురించి తెలుసుకొని చివరకు గౌతమ బుద్ధుడి బోధనలు సూక్తులు సిద్ధాంతాలు నచ్చి బౌద్ధమతాన్ని 14 ఆక్టోబర్ 1956న 5లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలిపారు. నేటితో ఆది 69 సంవత్సరాలు అన్నారు . ఈ ఆధునిక ప్రపంచానికి సరిపోయేది భౌద్ధ మతమే అని , ఈ ప్రపంచాన్ని రక్షించ గల శక్తి ఓక భౌద్ధ మతానికి మాత్రమె ఆన్నారు. మానవతా విలువల వైపు నడిపించేధి భౌద్ధం మాత్రమే అని బోధిసత్వ డా బి ఆర్ అంబేద్కర్ గారు తెలిపారని అని చెప్పారు. ఈ ప్రపంచంలో గౌతమా బుద్ధుడు పుట్టిన తర్వాత మానవ పరివర్తన కోసం మొట్ట మొదటి సారిగా ప్రెమ దయ జాలి ఆకరుణ దానం శీలం ప్రజ్ఞ సమత వంటి గొప్ప సిద్ధాంతమే కాక మైత్రి ధ్యానం మానవ కళ్యాణం కోసం త్రిచరణములను పంచ శిలాలను ఆస్టాంగా మార్గాలను 11 పారమిధులను 24 మానవ జీవన సూత్రాలను మనషి పకృతి జీవనాధారంలో బుధుడు కనుక్కొని ఇతరులకు వర్తించే విధంగా శ్వాసపైనా ధ్యాస మనసు శరీరానికి ఉన్న సమతా భావాలు సామాజిక శాస్త్ర విజ్ఞానము జ్ఞానంతో. భారత దేశం దేశంలో బుధుడు 45 సంవత్సరాల పాటు కాలి నడకన ప్రయాణిస్తూ తాను దమ్మ జ్ఞానాన్ని ప్రజలకు బోధించాడని అన్నారు. బుధుడు చూపిన మార్గంలో నడుస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుటకు నేటి యువతీ యువకులు ముందుకు రావాలన్నారు* ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గడ్డం సదానందం కట్కూరి మొగిలి చందర్ మొగిలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గము (సంగారెడ్డి జిల్లా) మొగుడంపల్లి మండలంలో మండల బీసీ కుల సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ విషయం పై చేస్తున కుట్రల పై చర్చించారు. దీనికి సంబంధించి ఈ నెల 14 న తెలంగాణ రాష్ట్ర బంధుకు , పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు తెలిపారు. బిసి లంగా ఐక్యం అయ్యి రాబోవు ఎన్నికల్లో కూడా అన్ని గ్రామాల్లో బిసి అభ్యర్థులనే గెలిపించుకోవాలి. ఈ కార్యక్రమంలో .పెద్దగొల్ల నారాయణ,కొండాపురం నర్సిములు, శంకర్ సాగర, నారాయణ బీసీ సంఘం ప్రతినిధి, వాడే శేఖర్, ఆర్.ఈశ్వర్, గొల్ల దశరత్ శ్రీకాంత్ ముదిరాజ్, మాదిరే వీరేశం, గోవింద్ గుండు, వాడే చెన్నూ, బాయిని సుభాష్, నర్సింలు గుడిసె, శ్రీనివాస్ గొల్ల, సుభాష్ సతోలి, మంగలి రాములు, సిద్దు, నరసింహ గౌడ్, తదితరులు పాల్గొనారు
ఈ నెలలో పెరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికలు రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ వేసిన నేపద్యంలో హైకోర్టు స్టే విధించడం పట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి సామ్రాజ మల్లేశం అధ్యక్షతన నర్సంపేట పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్టే తేవడం అనేది అగ్రవర్ణాల కుట్రగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి స్టేలకు, కోర్టులకు వెళ్లలేదని తెలిపారు.మా ఓట్లు మీకు అవసరంకాబట్టే ఇలాంటి కుట్ర పన్నుతున్నారని తస్మాత్ జాగ్రత్త అని అగ్రవర్ణాలను సోల్తి సారయ్య హెచ్చరించారు.హై కోర్టు స్టే పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే బీ.సీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు బందులో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాలపూర్ నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోల్తి రవి,నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గండు రవి,ఉపాధ్యక్షుడు చీర వెంకట్ నారాయణ,జిల్లా యువ నాయకులు బైరి నాగరాజు, సోల్తి అనిల్,సోల్తి పెద్ద సాంబయ్య,సోల్తి చిన్న సాంబయ్య అఖిల్,అనీష్,రాజు,రమేష్,సంపత్ సతీష్ ,రాంబాబు, కే సాంబయ్య తదితరులు తెలిపారు.
రిజర్వేషన్ల పేరుతో బేసి లను మోసం చేసిన ప్రభుత్వం….
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము ( సంగారెడ్డి జిల్లా) స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం పట్ల రెడ్డి జాగృతి నాయకులు కేసు వేసి అడ్డుకోవడం పట్ల స్పందించిన బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసింది అని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు . 5 శాతం లేని అగ్రవర్ణాలకు 10 శాతం EWS రిజర్వేషన్ ఇస్తే ఏ బీసీ నాయకులు అడ్డుకోలేదని అగ్ర వర్గాలలో ఉన్న పేదలకు న్యాయం చేయాలని కోరుకున్న బీసీ సమాజానికి నేడు రెడ్డి జాగృతి నాయకులు బీసీలకు వచ్చిన 42% రిజర్వేషన్లు పట్టు పట్టి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో బీసీలు అగ్ర వర్గాలతో రాజకీయ యుధం చేయడానికి సిద్ధమే అని హెచ్చరించారు.ఈ సమావేశంలో లో జహీరాబాద్ తాలూకా బీసీ నాయకులు కొండాపురం నర్సిములు, డా.పెద్దగొల్ల నారాయణ,పెద్దతోట రాచన్న ,కోహిర్ మండల్ నాయకులు,విశ్వనాథ్ యాదవ్,రమేష్ ముదిరాజ్,గొల్ల శ్రీనివాస్, ఉప్పల శ్రీకాంత్,అంబదాస్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.
చిట్యాల, నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిని, మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ దశాబ్ద కాలం పైగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను సామాజికంగా మరియు రాజకీయంగా చైతన్య పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేయబోతుందని చిట్యాల మండల కేంద్రంలో భూపాలపల్లి జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.
చిట్యాల, నేటిధాత్రి :
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.
నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,
*చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనంపై భూమన ఆధ్వర్యంలో వైసిపి నిరసన..
*ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి..
తిరుపతి(నేటిధాత్రి) అక్టోబర్04:
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చ పత్రికల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఫైబర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మగౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ ఘటనపై ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, కమిషన్ వేగంగా స్పందించి చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసి విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇది దళితుల ఆత్మగౌరవ రక్షణకు సానుకూల పరిణామమని ఎంపీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను నిర్లక్ష్యంగా తీసుకోవడం దురదృష్టకరమని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ దహనం జరిగిన మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు గుర్తించకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనం కలిగిస్తోందని పేర్కొన్నారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని ఆయన హెచ్చరించారుఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొన్నం భిక్షపతి గౌడ్ బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థగత ఎన్నికల దృష్ట్యా బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని స్థానాల గ్రామ వార్డు సభ్యులు గ్రామ సర్పంచులు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో బీఎస్పీ ఉంటుందని పొన్నం భిక్షపతి గౌడ్ బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీట్లను కేటాయించి పోటీ చేయబోతున్నామని అగ్రవర్ణాల రాజకీయ కుట్రలను పసిగట్టి వారిని ప్రజల్లో ఎండ కడతామని రాజ్యాధికారం యొPonnam Bhikshapathi Goud
BSP Bhupalpalli District Presidentక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా ఇంటింటికి ప్రచారాన్ని తీసుకెళ్తామని రాష్ట్రంలో 92 శాతం ఉన్న బహుజనులను రాజ్యాధికార పీఠం మీద కూర్చోబెట్టడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారమే అణచివేయబడ్డ బహుజన కులాలకు విముక్తి కలిగిస్తుందని సమాజం యొక్క మార్పు కోరుకునే వారందరూ ఏకతాటిపైకి రావాలని ఎన్నికలలో పోటీ చేయకపోతే మన ఆస్తిత్వాన్ని కోల్పోయి అణచివేతకు గురైతామని కాబట్టి ఈ ఎన్నికలను మన భవిష్యత్తుగా భావించాలని ఈ సందర్భంగా అన్నారు
ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ – తెలంగాణ కోసం చేసిన ఉద్యమం స్ఫూర్తిదాయకం – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణ అని అన్నారు. ఆయన తెలంగాణ కోసం చేసిన ఉద్యమం, రైతు హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ తరానికి బాపూజీ ఒక ఆదర్శమని అన్నారు. తన రాజకీయ జీవితమంతా సాధారణ ప్రజల కోసం అర్పించిన మహానుభావుడు బాపూజీ అని అన్నారు. ముఖ్యంగా రైతాంగం కోసం నిస్వార్థంగా కృషి చేశారనీ అన్నారు. ఆయన చూపిన మార్గం పల్లెబాటలో నడిపే వెలుగుదీపమని అన్నారు. వారి ఆలోచనలు నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలనీ, ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
ఆయన ఆశయాల సాధనకోసం కృషి చేయాలని అన్నారు. హైదరాబాద్ సంస్థాన ప్రజలకోసం నిజాం ను ఎదిరించిన యోధుడు,తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేదుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, వస్త్ర వ్యాపార, అనుబంధ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్.
మరిపెడ నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కొత్త మైలురాయి. బీసీలకు 42% రిజర్వేషన్లతో జీవోనెంబర్9 విడుదల బీసీ వర్గాల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి, సామాజిక న్యాయం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో జీవోనెంబర్ 9 ని విడుదల చేసింది,వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్నిపెంపొందిస్తూ వారి భవిష్యత్ తరాలకు భరోసా అందించడమే లక్ష్యంగా తీసుకున్నఈ నిర్ణయం గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో బీసీలకు 42% సీట్ల రిజర్వేషన్ కల్పిస్తూ వెనుకబడిన వర్గాల ప్రజలకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని, ఇది వెనుకబడిన వర్గాల ప్రజలకు భరోసా అన్నారు,అన్ని వర్గాల ప్రజలను అక్కునచేర్చుకుంటుందని మరోసారి ఋజువు చేసింది అన్నారు,బీసీ సమాజం సమగ్రాభివృద్ధి దిశగా ముందడుగు వేయాలని కోరుకుంటూ..బీసీవర్గాల ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తో కలిసి పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. ఆమె సామాన్య వర్గానికి చెందినప్పటికీ, సామాజిక అసమానతలకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆమె ధైర్యం, పట్టుదల మనందరికీ ఆదర్శం కావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్,మేయర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్,మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షులు సురేందర్,కుమార్ యాదవ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు,ఐలమ్మ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఏండ్లు గడిచిన ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకొని రాఘవరెడ్డిపేట గ్రామం
గ్రామ పంచాయతీ పుట్టినప్పటి నుంచి ఎస్సీ రిజర్వేషన్ రాకుండా రాజకీయంగా దగా చేస్తుండ్రు.
దూడపాక శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ నాయకుడు డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
రాజకీయ పదవులు అనుభవించడానికి మేము అర్హులం కాదా..? పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించే అధికారులు ఈసారైనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కు గ్రామాన్ని ఎన్నిక చెయ్యాలని దూడపాక శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకుడు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాఘవరెడ్డిపేట గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకోలేదని, ఏండ్లు గడిచిన ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం లేదని..? సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పదవులు అనుభవించడానికి మేము అర్హులం కాదా..? రాజకీయంగా దగాకు గురవ్వడమేనా…? ఎన్నికల్లో పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించే అధికారులు తేల్చాలనీ వారు అన్నారు
ఓట్లు వేసే యంత్రాలుగానే కాదు పరిపాలన వ్యవస్థలో భాగమై రాజకీయ పదవుల్లో సైతం అవకాశాలు రావాలని పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తే, మేము పుట్టక ముందు నుంచి ఇప్పటివరకు తరతరాలుగా ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదంటే ఎంత అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనరల్ స్థానాలు వచ్చిన పోటీకి వచ్చే వారి కుల, ధన బలాలతో పోటీ పడే స్థాయిలో ఎస్సీ కులాల ప్రజలు లేరని, అందుకు ఈసారైనా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను తేల్చే అధికారులు తక్షణమే స్పందించి ఎండ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి రాఘవరెడ్డిపేట గ్రామపంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా అణిచివేతలే ఎదురైతే అభివృద్ధిలో కూడా అన్యాయమే జరుగుతుందని, వచ్చే నిధుల కానీ, సంక్షేమ అవకాశాలు మా వర్గాల ప్రజలకు అందకుండా పోతున్నాయని, మనల్ని గుర్తించే పరిస్థితే కనబడటం లేదని అన్నారు. అందుకు జిల్లా కలెక్టర్ ఆర్డీవో పంచాయతీ అధికారులు స్పందించి ఎస్సీ రిజర్వేషన్ వచ్చేలా మా గ్రామానికి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
-బీసీ రిజర్వేషన్ల సాదన కోసం..నవంబర్ 9న భువనగిరిలో బీసీల రాజకీయ యుద్దబేరి మహసభ
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక రాజకీయ పార్టిలను తేలంగాణలో రాజకీయంగా భూస్తాపితం చేస్తామని, బీసీ రిజర్వేషన్ల సాదన కోసం నవంబర్ 9న భువనగిరిలో లక్షాలాది మందితో బిసీల రాజకీయ యుద్దబేరి మహసభను నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చేసిన బిల్లులను రాష్ట్రపతి, అలాగే అసెంబ్లీలో చేసిన చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ తక్షణమే ఆమోదించి బీసీలకు తగిన న్యాయం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లను తమిళనాడు రాష్ట్ర తరహాలో పెంచడానికి 9వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను..రాష్ట్రంలో రాజ్ భవన్ ను ప్రభావితం చేస్తూ..బీసీలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. బీసీలపై బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లులను చట్ట రూపంలో తీసుకురావాలని కోరారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా..బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కకుండా అగ్రవర్ణ పార్టీలు చేస్తున్న కుట్రలను ఎండగడుతూ..బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి నవంబర్ 9న భువనగిరిలో లక్షలాది మంది బీసీ సైనికులతో బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభను నిర్వహించి అగ్రవర్ణ పార్టీల కుట్రలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని, లేకుంటే బిజెపికి వ్యతిరేకంగా బీహార్ ఎన్నికలలో బీసీలమంతా ప్రచారం నిర్వహించి..బిజెపి కుట్రలను చిత్తు చేస్తామన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం మూలంగా బీసీలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, వెంటనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభలలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ క్రిమిలేయర్ రద్దు, ఉన్నత న్యాయస్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కల్పించడానికి దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్ల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సమాచార కమీషనర్లు, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర మంత్రి వర్గంలో బీసీల జనాభా ప్రాతిపాదికన మంత్రులు, క్యాబినెట్ చైర్మన్ లు, సీఎం పేసి నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ సెక్రెటరీలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాల్సిందేనన్నారు. బీసీల పోరాటాన్ని రాజకీయ పోరాటంగా ముందుకు తీసుకెళ్ళేందుకు బీసీ మేధావుల సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకుని నవంబర్ 9న నిర్వహించబోయే భువనగిరి సభా వేదికగా రాజకీయ భవిష్యత్ ఎజెండాను ప్రకటిస్తామని వేముల మహేందర్ గౌడ్ తెలిపారు.
ఈనెల 15న తాసిల్దార్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయండి
మడిపల్లి శ్యాంబాబు మాదిగ జిల్లా ఇన్చార్జి
అంబాల చంద్రమౌళి మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ విహెచ్ పేస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం ఎంఆర్పిఎస్ భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మడిపల్లి శ్యాంబాబు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగలు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిలదీయడానికి ఈనెల 15వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల తాసిల్దార్ కార్యాలయాల ముట్టడించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రతి గ్రామం నుండి వచ్చి ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వికలాంగులు వృద్ధులు విత్తంతులు బీడీ గీత నేత నూతన పెన్షన్ దరులందరూ పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు బొల్లి బాబు మాదిగ నోముల శ్రీనివాస్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేంద్ర మాదిగ దూడపాక శ్రీనివాస్ మాదిగ టౌన్ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ మిరపటి అశోక్ మాదిగ రేణిగుంట్ల రవి మాదిగ మంద తిరుపతి మాదిగ ఎర్ర భద్రయ్య మాదిగ చంటి మాదిగ నూనెపాకుల కుమారు మాదిగ మంద కిరణ్ మాదిగ మంచినీళ్ల వైకుంఠం మాదిగ బోడికల శ్రీకాంత్ మాదిగ ఒంటెరి రాజేష్ మాదిగ కుమ్మరి అనిల్ మాదిగ బోడికల సమయ మాదిగ సునీల్ మాదిగ మంగళ రవి తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.