ప్రభుత్వం చేసే పనులను ఓర్వలేకనే తప్పుడు ప్రచారం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T124523.826.wav?_=1

 

 

ప్రభుత్వం చేసే పనులను ఓర్వలేకనే తప్పుడు ప్రచారం

గణపురం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది.
రాజేందర్ మాట్లాడుతూ భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గండ్ర సత్యనారాయణ రావు పై తప్పుడు ఆరోపణ చేయడం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనారాయణ రావు చేస్తున్న అభివృద్ధిని కోరవలేక సత్యనారాయణ రావు మీద తప్పుడు ఆరోపాలు చేయు వారిని ఖబర్దార్ అని హెచ్చరించాడు.
తన సొంత అవసరాల కోసం పార్టీ మారి కాంగ్రెస్ కార్యకర్తలను నిలువునా ముంచిన మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కి కొంచమైనా సిగ్గుండాలని, తన భార్య పదవి కోసం పార్టీ మారిన వ్యక్తిన ఈరోజు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి,
మీ సొంత అవసరాల కోసం ఇసుకను జిఎంఆర్ కన్స్ట్రక్షన్ కోసం వాడుకోలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
పెట్రోల్ ట్యాంకర్లలో కర్రను ఎక్స్పోర్ట్ చేసింది నిజం కాదని ప్రశ్నిస్తున్నాను,
మీ ప్రభుత్వ హయాంలో తెగిన చెరువులను కట్టలను మరమ్మత్తులు చేయించి రైతులకు అండగా నిలిచిన నాయకుడు జి.ఎస్.ఆర్ మీ స్వలాభం కొరకు మైలారం గుట్టపై ఉన్న 200 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకొని ఆయిల్ ఫామ్ పెట్టాలనుకున్నది మీరు. వాటిని మా ఎమ్మెల్యే ప్రజా పాలన కొరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్క్ హబ్ గా ఏర్పాటు చేశారు మైలారం గుట్టలను కబ్జా చేసింది ఎవరు? కబ్జాల కూర నుండి విడిపించి ఎడ్యుకేషన్ అబ్బుగా మార్చారు మా ఎమ్మెల్యే
విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసి గత పది సంవత్సరాలుగా మండలాలలో ఎంఈఓ లను కూడా నియమించలేదు మీ ప్రభుత్వం.
గెలిచిన 20 నెలల వ్యవధిలో ఇంటర్నల్స్ రోడ్స్ ఆయకట్ట రోడ్స్. వేసిన ఘనత మా ఎమ్మెల్యే ది మా ప్రభుత్వం ది. మా ప్రభుత్వము గానీ మా ఎమ్మెల్యేని గాని దూషించే ముందు ఒకసారి మీరు చేసిన పనులను గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్ చోటే మియా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి మామిళ్ళ మల్లికార్జున గౌడ్, సీనియర్ నాయకులు బోనాల రాజమౌళి, ఉమ్మడి వెంకటేశ్వర్లు, మోతపోతుల శివ శంకర్ గౌడ్, దూడపాక దుర్గయ్య,పుప్పాల రామారావు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఓరుగంటి కృష్ణ, మాజీ వార్డ్ మెంబర్ గంధం సుధాకర్
మాజీ వార్డ్ మెంబర్ గంధం ఓధాకర్, దూడపాక శ్రీనివాస్, మహమ్మద్ సైదులు, ఎస్.కె మౌలా, తదితరులు పాల్గొన్నారు

పేదల వైద్య సేవలకు అండగా సీఎం సహాయ నిధి. ‌

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T122657.334.wav?_=2

 

పేదల వైద్య సేవలకు అండగా సీఎం సహాయ నిధి.

‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవీందర్ గౌడ్. ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి. ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల లోని పర్లపల్లి గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ వారు మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణలో సీఎం సహాయ నిధి ( సిఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తుందని భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవీందర్ గౌడ్ అన్నారు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్న ఖరీదైన చికిత్సకు వెనకాడకుండా ప్రజలకు ఈ సాయాన్ని వినియోగించుకోవాలని సీఎం సహాయ నిధి రాజకీయాలకు అతీతంగా అందరూ అందుబాటులో ఉంటుందని అవసరమైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామకాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T153147.271.wav?_=3

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

#నాడు పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం…

#ఇచ్చిన మాట ప్రకారం 80% పనులను పూర్తి చేయగలిగినం..

#4,53 వ డివిజన్ లలో 92.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్ జ్యోతి బసు నగర్ మరియు 53 వ డివిజన్ సరస్వతి నగర్ లో రూ.92.50 లక్షలతో అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులు,ప్రజలతో కలసిన కాలనీల పరిస్థితులను పరిశీలించారు .

 

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతు నాడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ 80% పనులను పూర్తి చేశామని తెలిపారు.శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు.గతంలో వర్షాకాలం వస్తే వరదలో హనుమకొండ అనే శీర్షికలు ఉండేవి అని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్వత్వంలో ఒకటి రెండు మినహా వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజల సహకారం ఉండాలని వెల్లడించారు.
ఈ కార్యక్రమలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, జిల్లా ఆర్టిఏ మెంబర్ పల్లకొండ సతీష్,మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,ఎర్రం మహేందర్ ఆయా డివిజన్ ల అధ్యక్షులు శ్రీధర్ యాదవ్,బాబాయ్ మరియు స్థానిక నాయకులు,కార్యకర్తలు,అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ…

పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల నీటి ధాత్రి

 

 

తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు 10 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టుదల, ఏకాగ్రతతో పని చేస్తే సామాన్యుడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలువచ్చని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

◆:- పి.రాములు నేత

*జహీరాబాద్ నేటి ధాత్రి:

జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు కార్మిక నాయకులు వ్యవసాయ కార్మిక నాయకులు స్వచ్ఛందంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని దిగ్విజయం చేయగలరు సమావేశంలోని ముఖ్యంశాలు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారత దేశానికి సంబంధించిన వర్తకులు కార్మికులు మన రాష్ట్రానికి వలస వచ్చి మన యొక్క వర్తకులను మన కార్మికులను మరియు వ్యవసాయ కార్మికులను వ్యాపార రంగంలో శ్రామిక రంగంలో కృంగదీస్తున్నారు దీని మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని వర్తకులు కార్మికులు వ్యవసాయదారులు అనేక రకాలుగా నష్టపోతున్నారు ఈ విషయాల పైన ప్రత్యేకమైన చర్చా ఉంటుంది అదేవిధంగా ఇంకా కొంతమంది ఉత్తరభారతీయులు రాష్ట్రం లోపల అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఉదాహరణకు నకిలీ వస్తువుల విక్రయం కల్తీ తినుబండ రాళ్ల తయారీ చేస్తూ మోసపూరితమైన స్కీమ్ లతో వ్యాపారం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అనేక రకాలుగా అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా వారికి నకిలీ వ్యక్తులు విక్రయించి వారి ధనాన్ని కూడా దోచుకెళుతున్నారు అనేక సందర్భాలలో రకరకాల మోసపూరిత వ్యాపారాలు నిర్వహించి తెలంగాణ సామాన్య ప్రజానీకానికి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు ఇట్టి విషయాల మీద ప్రత్యేకమైన చర్చ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం అనేక రకాల ప్రజా సంఘాలు వారికి తోచిన విధంగా తమకు తామే వాళ్లకు ప్రజా సంఘాన్ని నామకరణం చేసుకొని ముందుకెళుతున్న సంగతి తెలిసినదే అయినప్పటికిని ఏది ఏమైనా ప్రతి సంఘం యొక్క లక్ష్యం తెలంగాణ ప్రజల రక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కాబట్టి ఎవరు ఏ రకంగా ముందుకు వెళ్లిన అందరం కూడా మాసానికి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏకమై ముందుకు కదలాలని కార్యచరణలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది ఇటి సమావేశానికి అందరూ కూడా సమయపాలన పాటించి స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము కార్యక్రమంలో జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బెడబుడగజంగం నాయకులు మాదినం శివ ప్రసాద్ ,పి.దేషరథ్ ,వడ్డెర సంఘం నాయకులు పల్లెపు శేఖర్ ,డివిజన్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ధనరాజ్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యార్థి నాయకులు కార్తీక్ రామ్ చరణ్ బాలకృష్ణ రవి కిషోర్ విష్ణు గార్లు పాల్గొన్నారు,

ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T143950.186.wav?_=4

 

ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు

◆:- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాక్సుధ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పరకాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ వర్ధంతి ఘనంగా…

https://youtu.be/FNA9Z2jcGNY?si=L8S4XeiEOx4ctZ5w

కొయ్యాడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి

అనంతరం సాయుదపోరాట యోధులకు నివాళులు అర్పించిన నాయకులు

పరకాల నేటిధాత్రి

పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రక్కల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి లు రాజశేఖర్ రెడ్డికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ గుండెల్లో నిలిచిన నాయకుడు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషిచేసి ఈరోజు దేశంలోనే ఎవరూ చేయలేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన మహా గొప్ప నేత ఆరోగ్యశ్రీ కార్డుతో దేశంలోనే గొప్ప పేరుగాంచిన మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఎంపీ లోని గెలిపించుకొని దేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానాయకుడని నాటి నుంచి నేటి వరకు రాజశేఖర్ రెడ్డి గుర్తులు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు.ఆ మహానీయుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.సెప్టెంబర్ 2 తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు,పరకాల అమరవీరులకు వర్గాల అమరధామంలో వారిని స్మరిస్తూ నివాళులర్పించడం జరిగింది.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పరకాల ప్రాంతంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పట్టుకుని పరకాల ప్రాంతంలో తిరుగుతున్న వారిని నిజాం ప్రజకారులు కాల్పులు జరిపి ఎంతో మందిని చిత్రహింసల గురిచేసి మహిళలు వృద్ధులు చిన్నపిల్లలను చూడకుంట విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నటువంటి రజాకారులను ఎదిరించి పోరాడిన మహనీయులను స్మరిస్తూ తెలంగాణ కోసం పరకాల ప్రాంతానికి చెందిన అమరులు ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకొని వారికి స్మరించడం జరిగింది కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో
సమన్వయ కమిటీ సభ్యులు చిన్నల గునాథ్,ఒంటేరు రామ్మూర్తి,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,పసుల రమేష్,దుబాస్ వెంకటస్వామి,పాడి ప్రతాప్ రెడ్డి,సదానందం గౌడ్,బొచ్చు బాబు,నల్లల అనిల్,ఒంటేరు శ్రావణ్ కుమార్,పాలకుర్తి శ్రీనివాస్,బొచ్చు మోహన్
తదితరులు పాల్గొన్నారు.

గిడుగు రామ్మూర్తి అవార్డు సతీష్ యాదవ్‌కు సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T143645.834.wav?_=5

 

గిడుగు రామ్మూర్తి అవార్డు అందుకున్న సతీష్ యాదవ్ కు సన్మానము
వనపర్తి నేటిదాత్రి .

 

పాండిచ్చేరిలో డాక్టరేట్ విజయవాడలో గిడుగు రామ్మూర్తి అవార్డు అందు కున్న సందర్భంగా కొత్తకోట లో యాదవ సంఘం నాయకుల సన్మానం చేశారు. గత 20 సంవత్సరాలు వనపర్తి ప్రజాసమస్యలపై గతంలో పాత బస్టాండ్ రామాటాకీస్ నుండి మారెమ్మ కుంట వరకు పెండింగులో ఉన్న రోడ్డు విస్తరణ సి సి రోడ్ల నిర్మాణం మూరికి కాలువలు నిర్మాణ ము తల్లి తండ్రులులేనిచిన్న పిల్లలకు స్వ oత ఖర్చుతో అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కృషి సన్మానముచేసిన వారిలో మాజీ ఎంపీ టి సి సత్యం ముంత సత్యం యాదవ్ మాజీ ఎంపిటిసి జి రాముల యాదవ్ మాజీ కౌన్సిలర్, ఎం బాల కొండయ్య టీ మన్యం యాదవ్ పెంటన్న యాదవ్, పి శంకర్ యాదవ్, కురుమూర్తి, శివన్న కుమార్ బాలచంద్రి యాదవ్ లు సతీష్ ను అభినందించారు

జహీరాబాద్‌లో రాబడిని అందజేసిన సీఎం సహాయనిధి చెక్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T142227.901.wav?_=6

 

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన జి సిద్ధప్ప గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన రూ.15,000/- విలువ గల చెక్కును ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో అందజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ షెరీ సత్యం ముదిరాజ్,గ్రామ యువ నాయకులు శశి వర్ధన్ రెడ్డి బి బసంతి తదితరులు .

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161118.191-1.wav?_=7

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు
బిజెపి నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

https://youtu.be/mgl8GBmGx0A?si=5kIR7WXajNDM3xSBv

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

రైతుల సంక్షేమం కోరి _ కాంగ్రెస్ పార్టీ సమరభేరి…

రైతుల సంక్షేమం కోరి _ కాంగ్రెస్ పార్టీ సమరభేరి

జిల్లా ప్రధాన కార్యదర్శి: రిక్కుల శ్రీనివాస్ రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

రైతుల సంక్షేమం కోసమే గల్లి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,నాయకులు రైతుల తరఫున కేంద్రంతో పోరాడుతున్నారని,బిజెపి- బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతు సమస్యలపై నోరు మెదపట్లేదనీ,చోద్యం చూస్తున్నారు అని జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను ఆదుకోలేని బీఆర్‌ఎస్ నేతలే ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పడం అవివేకం అని మండిపడ్డారు.యూరియా కేటాయింపులో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని,మాటలు కాదు,చర్యలు ముఖ్యమని,రైతులకు ఎరువులు తెప్పించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.బీజేపీ–బీఆర్‌ఎస్ చేతగానితనం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని రిక్కుల శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు చేసిందని నేతలు వివరించారు.ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంమని,బీజేపీ–బిఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధిని,ప్రజల ఆదరణను జీర్ణించుకోవడం లేదనీ,అందుకే వారు నిరాధార ఆరోపణలకు తెగబడుతున్నారనీ ఎద్దేవా చేశారు.చెన్నూర్ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిరంతరం సంక్షేమ పథకాలతో,అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీలం వెంకటేశం,ఆసంపల్లి శ్రీకాంత్,గద్దల అనిల్ కుమార్, సుమన్,షారుక్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నేటి డిజిటల్ ఇండియా….నాటి రాజీవ్ గాంధీ విజన్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/rajiv-gandhi-1.wav?_=8

నేటి డిజిటల్ ఇండియా….నాటి రాజీవ్ గాంధీ విజన్

టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడారు.

దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన నేడు తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందని పేర్కొన్నారు.దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు వెళ్లడానికి కారణం నాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ వైస్ చైర్ పర్సన్ జంగం కళ, దీకొండ శ్యామ్ గౌడ్, గోపురాజం,పుల్లూరి కళ్యాణ్, కట్ల రమేష్,బత్తుల వేణు,శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, మహిళా నాయకురాళ్ళు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-28-5.wav?_=9

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల,నడికూడ,దామెర,ఆత్మకూరు మండల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించాలని,గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు సమావేశంలో గత ప్రభుత్వ వైఫల్యాలు,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని, మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలన్నారు.స్థానిక సంస్థలు ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలిస్తేనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందిఅని,సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం అన్నారు.విలేజ్ మేనిఫెస్టోతో ముందుకు వెళ్లి ప్రజా సమస్యలకు ప్రియార్టీ ఇస్తామని,వచ్చే ఆదివారం సమావేశాల్లో ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని 60 ఓట్లకు ఒక బాధ్యున్ని నియమించాలన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతున్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గ్రామంలోని సమస్యలను చర్చించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరచాలన్నారు.గ్రామాల వారిగా జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపట్ల ప్రజలలో నమ్మకం కలిగిందని అందరూ కలిసి కట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-35-5.wav?_=10

గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో

డాక్టర్ పట్ట పొందిన ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్

వనపర్తి నేటిదాత్రి .

గ్లోబల్ అక్రిడే షన్ యునైటెడ్ నేషన్..నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పాండిచ్చేరిలో డాక్టర్ రేట్ పట్ట పొందారు25 సంవత్సరాలుగా వనపర్తి జిల్లా ప్రజల సమాజ సేవకు, ప్రజా సమస్యలపై 18 ఏళ్లపాటు రాజీలేని పోరాటానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని సతీష్ తెలిపారు వనపర్తి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కౌన్సిలర్,గా సేవలు వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఇంకుడు గుంతలు తవ్వించడం హరితహారం లో ఒకేసారి మూడు వేల చెట్లు నాటడం ప్లాస్టిక్ వ్యతిరేకంగా బట్ట సంచులు ఉచితంగా ప్రజలకు పంచడం.కరోనా సమయంలో పోలీసు శాఖకు , మున్సిపల్ కార్మికులకు అన్నదానం చేయడం కార్మికులకు నిత్యావసర సరుకులు పంచడం ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ ఆస్తులు రక్షించడం ప్రజా సమస్యలపై పోరాడడం అనేక సేవ లకు గురించి డాక్టరేట్ ఇచ్చారని చెప్పారు.
శనివారం పాండిచ్చేరి రాష్ట్రంలో గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలోజరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పట్టా అందజేశారు
డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం గర్వంగా ఉందని, శ్రీ కృష్ణాష్టమి రోజున పట్ట అందుకోవడం అదృష్టం గా ఉందని అన్నారు
గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ, జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు*

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30-3.wav?_=11

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

*ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

తిరుప‌తి(నేటిధాత్రి(ఆగస్టు 16:

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా ఇస్కాన్ లోని రాధా కృష్ణ‌ స‌మేత అష్ట‌స‌తులను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం దర్శించుకున్నారు.ఆల‌య ప్ర‌తినిధులు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. గోకులాష్ట‌మి సంద‌ర్భంగా శ్రీకృష్ణ ప‌ర‌మాత్మున్ని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌకర్యం క‌ల‌గ‌కుండా ఆల‌య ప్ర‌తినిధుల తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు.తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రిపై శ్రీకృష్ణుని కృపాక‌టాక్షాలు మెండుగా ఉండాల‌ని ఆకాంక్షించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆర‌ణి జ‌గ‌న్, రాజా రెడ్డి, జీవ‌కోన సుధా, బాబ్జీ, రాజేష్ ఆచ్చారీ, మున‌స్వామి, పురుషోత్తం, శ్రావ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన వారికి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ షోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల.ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన గాలి పెళ్లి బాలకృష్ణ కి..(40000). వేల రూపాయల సీఎంఆర్ఎఫ్. చెక్కుని లబ్ధిదారులకు స్థానిక. కాంగ్రెస్ పార్టీ నాయకుల. ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు సహకరించిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. శ్రీ ఏ నుముల. రేవంత్ రెడ్డికి. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి. ప్రభుత్వ . వీప్ . వేములవాడ శాసనసభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు. శ్రీ ఆది శ్రీనివాస్ కి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. కంది గట్ల సదానందం. బై రీ. వేణు. జంగంపల్లి భాగ్యలక్ష్మి. ముందటి శారద. కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మంచి ప్రభుత్వాన్ని ఆదరించండి.

మంచి ప్రభుత్వాన్ని ఆదరించండి..

*ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం..

*వైసిపి నేతల విమర్శలను ప్రజలు నమ్మొద్దు..

*ఇంటింటికి టిడిపితో ప్రజా సమస్యల పరిష్కారం..

*సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి..

పలమనేరు(నేటి ధాత్రి):

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే సంక్షేమ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సత్య గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారుఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణి చేశారు. అదేవిధంగా ప్రజల వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ఇలా ఉండగా వార్డులో అడుగడుగునా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూఏడాది పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా అర్ధరహిత విమర్శలు చేస్తున్నదన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు పరచిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేసి మరోమారు సంక్షేమ ప్రభుత్వం అని నిరూపించు కుందన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ప్రజాభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కూటమి మంచి ప్రభుత్వమని ఇప్పటి వరకు తాము చేసిన మంచి పనులను ప్రజానికానికి వివరించేందుకే సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్. వి.బాలాజీ,
ఆర్ బి సి
కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు,
బీఆర్శి కుమార్,కిరణ్, రూపేష్, సుదర్శన్ బాలాజీ, సురేష్ లతో పాటు జనసేన నాయకులు దిలీప్, హరీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version