ఒకే వేదికపై రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాసుల కలయిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-27T125929.355.wav?_=1

 

ఒకే వేదికపై రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాసుల కలయిక

సేవే లక్ష్యం-ధర్మ పరిరక్షణే ధ్యేయం: శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివారులోని ఒక ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం తెలంగాణ శ్రీనివాసుల సమ్మేళనం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈసమ్మేళనంలో జగిత్యాల వాసి శ్రీనివాసుడి వేషధారణ సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తలపించింది. అయోధ్య రాముడి పాదుకలను శ్రీనివాసుల దర్శనార్థం వేదికపై ఉంచి, కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వాహకులు, చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి సురేశ్ ఆత్మారాం మహారాజ్, తాటిచర్ల హరికిషన్ శర్మలు శ్రీనివాస్ పేరు గొప్పతనాన్ని వివరించారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీతో పాటు దేశవిదేశాల్లో ఉంటున్న రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాస్ పేరు గల వ్యక్తులు ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈసందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సహాయార్థం తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రెండు వందల యాభై మంది శ్రీనివాసులు రక్తదానం చేశారు. శ్రీనివాస్ పేరుగల రెండు వేల ఐదు వందల మంది ఒకే వేదికగా కలవడం అరుదైనదిగా గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలంగాణ డైరెక్టర్ మడుపు రాంప్రకాశ్ తమ రికార్డ్స్ లో చోటు కల్పించి

శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డికి అవార్డును అందజేశారు. ఈసందర్భంగా సేవా సమితి ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవే లక్ష్యంగా, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తామని, శ్రీనివాస్ అనే పేరున్న వారంతా ఒక సమూహంగా ఏర్పడాలనే లక్ష్యంతో శ్రీనివాసుల సేవాసమితి ఏర్పడిందని, నలబై ఆరు వాట్సాప్ గ్రూపులతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇరవై ఆరు వేల మంది సభ్యులు వాట్సాప్ గ్రూపుల్లో చేరారని, టీఎస్ఎస్ఎస్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, శ్రీనివాస్ పేరు ఉన్నవారు పేదరికంలో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా చేయూత అందిస్తున్నామని,రోజు వారి కూలీ నుండి మొదలుకొని ఏరంగంలో ఉన్న వారినైనా, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా శ్రీనివాస్ పేరు ఉన్న వారందరనీ టీఎస్ఎస్ఎస్ లో చేర్చించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు..

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గల గడికోట మైదానంలో జరుగుతున్న రామడుగు మండలం విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా రామడుగు గ్రామానికి చెందిన రామడుగు రాయల్స్ టీమ్ జట్టుకు యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ టిషర్ట్స్ అందజేయడం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడి దిలీప్ కుమార్, బసరవేణి అజయ్, పూరెల్ల రాహుల్ , ఎడవెల్లి సాగర్, రామడుగు గ్రామస్తులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు…

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

 

రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సిడ్ ఇన్ ఎవ్రి విలేజ్-క్యూఎస్ఈవి) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో వరి (జేజిఎల్ – 24423) పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి అనే రైతు తన అనుభవాన్ని, జేజిఎల్-24423 రకంలో విత్తనోత్పత్తి గురించి తను తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల, తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించిన అనంతరం శాస్త్రవేత్తలు డా.జి.ఉషారాణి, ఇ.ఉమారాణిలు మాట్లాడుతూ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేత గురించి తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు స్వయంగా ఉత్పత్తి చేసిన ఇదే విత్తనాన్ని రానున్న పంట కాలానికి వినియోగీస్తామని వారి సుముఖతను అధికారులకు తెలియజేశారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీ సెర్ప్ డిఆర్డిఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వీణవంక ,కనపర్తి, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. తహసీల్దార్ అనుపమ కనపర్తి లో,ఎంపీడీఓ వీణవంక లో,ఇప్పలపల్లి గ్రామంలో ఏపీఎం సుధాకర్,బ్రాహ్మణపల్లి లో ఎం ఎస్ సి సి పద్మ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మవద్దని ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ కూడా అందిస్తుందని తెలిపారు రైతులు గమనించి ధాన్యం కొనుగోళ్లను ఐకెపి సెంటర్ ద్వారా నిర్వహించాలని కోరారు. రైతులు ఐకెపి సెంటర్ కొనుగోలుదారులకు సహకరిస్తే ధాన్యం తరలింపు సులువుగా ఉంటుందన్నారు సెంటర్ నిర్వాహకులు ప్రస్తుత వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. రైతులకు అందుబాటులో తార్పాలిన్ కవర్లు ఉంచి రైతులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసు సునీల్, కామిడి శ్రీపతి రెడ్డి,ఎం డి. రషీద్ పాషా, సీసీలు ఎన్. ఆనంద్,ఎస్.తిరుపతి,వి.తిరుపతి,ఎస్.ఘన శ్యామ్ అన్ని గ్రామాల అధ్యక్షురాలు,కొనుగోలు కమిటీ మెంబర్ లు గ్రామాల వి ఓ ఏ. లు, రైతులు ,హమలీలు పాల్గొన్నారు.

హిమ్మత్ నగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం….

హిమ్మత్ నగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం

సి సి కెమెరాలు ప్రారంభిస్తున్న హుజురాబాద్ ఏసిపి మాదేవి

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామంలో శుక్రవారం రోజున జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ , ఎస్సై ఆవుల తిరుపతి ప్రారంభించిన మార్నింగ్ వాక్ ఇన్ విలేజి కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల తో మాట్లాడి వారి సహకారంతో 3 సోలార్ కెమెరాలు మరియు 04 ఫిక్స్డ్ కెమెరాలు మొత్తం 07 కెమెరాలు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా హుజురాబాద్ ఏసీపీ మాధవి హాజరయ్యారు సీసీ కెమెరాలకు సహాయం చేసిన ముఖ్య దాతలు మ్యాక రమేష్, నల్ల తిరుపతి రెడ్డి, గెల్లు మల్లయ్య, శ్రీకాంత్, వీరయ్య, సమ్మయ్య లతో పాటు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది , ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

హ్యాండ్ బాల్ టోర్నమెంట్లో సత్తాచాటిన సరస్వతి స్టూడెంట్…

హ్యాండ్ బాల్ టోర్నమెంట్లో సత్తాచాటిన సరస్వతి స్టూడెంట్

రామడుగు, నేటిధాత్రి:

 

 

ఎస్జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థి గంధం విక్కీ సత్తాచాటినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో జరిగిన పోటీల్లో కరీంనగర్​ జట్టు తరపున ఆడి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, పీఈటీ సాయికృష్ణ విక్కీని అభినందించారు.

గన్నేరువరంకు అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం..

గన్నేరువరంకు అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానేరు బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షులు పుల్లెల జగన్ మోహన్, గన్నేరువరం మండల బిజెపి నాయకులు పుల్లెల రాము రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి గన్నేరువరం మండల కేంద్రానికి అదనపు బస్సులు వేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి గన్నేరువరం మండల కేంద్రానికి ప్రస్తుతం రెండు బస్సులు మాత్రమే నడుస్తున్నవని, అందులో ఒకటి పొత్తూరు మీదుగా గన్నేరువరంకు, మరొకటి గుండ్లపల్లి మీదుగా గన్నేరువరంకు నడస్తున్నవని, రెండు బస్సులు సరిపోక ప్రయాణీకులు అనేక అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. అరవై మంది ప్రయాణించే బస్సులో వంద మందికి పైగా ప్రయాణీకులు ప్రమాదకరంగా నిత్యం బస్సుల్లో ప్రయాణించవలసిన వస్తోందని, గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలోని మానసాదేవి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో బస్సులో ప్రయాణికులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని కరీంనగర్ నుండి పొత్తూరు మీదుగా ఒక బస్సు, కరీంనగర్ నుండి గుండ్లపల్లి మీదుగా ఒక బస్సు అదనంగా వేయించగలరని మంత్రికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి విద్యార్థుల, ప్రయాణికుల ఇబ్బందులను తీర్చడానికి, గన్నేరువరం, మాధాపూర్, ఖాసీంపేట, మైలారం, చొక్కారావుపల్లి గ్రామాల సౌకర్యం కోసం అదనపు బస్సులు వేయడానికి పరిశీలిస్తామని మంత్రి తెలియజేశారని పుల్లెల జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అకాల వర్షానికి తడిసిన వడ్లు..

అకాల వర్షానికి తడిసిన వడ్లు

ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కాక పోవడంతో రోడ్లపైనే ఆరబోత-బోయిని తిరుపతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రోడ్ల పైన ఆరబోసిన వడ్లు రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇంతవరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఐకెపి, డిసిఎంఎస్, పిఎస్సిఎస్, ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు మొదలు కాకపోవడంతో రైతులు వడ్లను రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఇదే అదునుగా భావించి దళారులు ప్రభుత్వ రేటు కన్నా క్వింటాలకు మూడువందల నుండి నాలుగు వందల తక్కువ రేటుకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షాల నుండి కాపాడుకోలేక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగం పైన దృష్టి సారించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేసి మిల్లర్ల మాయాజాలం నుండి రైతాంగాన్ని కాపాడవలసిందిగా సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి పక్షాన ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండలం కార్యదర్శి బోయిని తిరుపతి.

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి…

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

18న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ జిల్లా జిల్లాఅధ్యక్షులు బీసీ హక్కుల సాధన సమితి

కరీంనగర్, నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బుచ్చన్న అన్నారు. కమాన్ సెంటర్లో లోజరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్యతో కలిసి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బుధవారం కరీంనగర్ లోని కమాన్ సెంటర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించవలసిన బీసీ ప్రధాన మంత్రిని అంటున్న మోడీ బీసీల ఎడల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు జరగాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే మార్గమని, ఎందరో న్యాయకోవిదులు నిపుణులు చెప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ అని ఒకసారి జీవో అని ఒకసారి కాలయాపన చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో మీదా అగ్రకులాలు న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశాలు కల్పించేలా వ్యవహారించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ ద్వారా బలమైన ఉద్యమాన్ని నిర్మించి మోడీ ప్రభుత్వం బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు.
ఈమోకా తప్పితే బీసీలు ఆగమై పోతారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వెనుకాల ఉన్న బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని అన్నారు.
కోర్టులో గెలిచామనీ రెడ్లు టపాసులు కాల్చుకొంటున్నారనన్నారు.
ఇందుకు నిరసనగా హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి వేసిన కేసు ప్రతులను దగ్ధం చేస్తూ ఇదీ బీసీలంతా గమనించాలన్నారు.
బీసీలను రోడ్లు ఎక్కేలా చేస్తున్న అగ్రకులాలు జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని, ఈనెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కోశాధికారి పైడిపల్లి రాజుగౌడ్, నాయకులు బాకం ఆంజనేయులు, జంగం కొమురయ్య యాదవ్, దానవీని రమేష్,మల్లేశం, ఓరుసుబన్నీ, మేకల కుమార్, ఎన్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు…

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు

కరీంనగర్, నేటిధాత్రి:

డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. డిసిసి పిఆర్ఓలు దొంతి గోపి, న్యాత శ్రీనివాస్ కు దరఖాస్తు అందజేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. అదేవిధంగా రాజేందర్ రావ్ గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ చాంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ గా, నెడ్ క్యాప్ గా డైరెక్టర్ పనిచేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా రాజేందర్రావు పోటీ చేశారనీ, ఎన్నికల్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు సాధించారని తెలిపారు. అతికొద్ది సమయంలోనే భారీ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు రాజేందర్ రావు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనీ, నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అనీ, వారి తనయుడు జగపతిరావు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూనే, కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా రాజేంద్ర రావు తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా నిజాయితీగా సౌమ్యుడిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. రాజేందర్రావు డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడు అనీ, సమర్థుడని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈవిషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుడిగా రాజేందర్ రావును నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, ఆకుల నరసన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, ఉప్పరి రవి, శ్రావణ్ నాయక్, జువ్వాడి మారుతి రావు, బాషవేణి మల్లేశం పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయిపై దాడి నిందనిరసన…

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి- అనిల్ బెజ్జంకి

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, ఎమ్మార్పిస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు మాట్లాడుతూ అక్టోబర్7, 2025న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న విషయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడ్డారు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనాగరికమైంది ఈదాడి ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈదాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని, దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అందువల్ల దేశ ప్రజలందరూ ఈదాడిని ఖండించారని, దళితుడైన బిఆర్ గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అహం పూరితంగా ఈదాడికి తెగపడ్డారని, ఈదాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే దాడి వెనుకున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా ఈఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయస్థానంలో పునరావతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఈడిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో
తునికి వసంత్ మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, కనకం అంజిబాబు మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, చిలుముల రాజయ్య మాదిగ, ఎల్కపెల్లి పౌలు మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, బొద్దులవాని మాదిగ, దండు అంజయ్య మాదిగ, అంతడుపుల సంపత్ మాదిగ, అలువాల సంపత్ మాదిగ, రేపాక బాబు మాదిగ, అంబాలా మధునయ్య మాదిగ, కనకం నరేష్ మాదిగ, శనిగరపు కొమురయ్య మాదిగ, కనుకుంట్ల శ్రీనివాస్ మాదిగ, కళ్లెపెల్లి కొమురయ్య మాదిగ, అన్నీవేణి కౌసల్య, దేవసాని ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా దాసరి అనిల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T113146.809.wav?_=2

 

అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా దాసరి అనిల్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష పదవి ఎన్నికలకు దాసరి అనిల్, రేణుకుంట అశోక్ లు తలపడగా మొత్తం నూట తోంబై ఎనిమిది ఓట్లు పోలవ్వగా రేణుకుంట అశోక్ బ్యాట్ గుర్తుకు ఎనభై ఏడు ఓట్లు, దాసరి అనిల్ బాల్ గుర్తుకు నూట పదకొండు ఓట్లు వచ్చాయి. దాసరి అనిల్ ఇరవై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసందర్భంగా దాసరి అనిల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు

యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు

వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తప్పవని జమ్మికుంట రూరల్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు
శుక్రవారం మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాధవి గార్ల పర్యవేక్షణలో “మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం రూరల్ సీఐ మరియు ఎస్సై తిరుపతి,సిబ్బంది తో కలిసి మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామాన్ని సందర్శించారు. ఇట్టి సందర్శనలో, సిసి కెమెరాల మరియు సైబర్ నేరాల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత చెడు దారిలో ప్రయాణించి జీవితాలను అంధకారం చేసుకోవద్దని సూచించారు. అత్యాశకు పోయి వివిధ ఆప్ లలో పెట్టుబడి పెట్టి లక్షలు, కోట్లలో మోసపోయి కుటుంబాలను రోడ్డున పడేయడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడి కన్న తల్లిదండ్రులకు, కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ముఖ్యంగా యువత చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుందని గుర్తు చేశారు. యువత సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. హిమ్మత్ నగర్ గ్రామస్తులు స్పందించి 6 సిసి కెమెరాల కోసం దాదాపు రూ 110,00/- లు అందించారు.ఈ కార్యక్రమంలో
గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు .

మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై ఏసీబీ అధికారుల దాడి…

మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై ఏసీబీ అధికారుల దాడి

పదివేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కార్యదర్శి అనిల్

గంగాధర, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ అధికారుల బృందం వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మధురానగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు బిల్లు కోసం గ్రామ కార్యదర్శి నెల రోజుల నుంచి పదివేల రూ.లు డిమాండ్ చేయడంతో బాధితుడు కార్యదర్శి అనిల్ కు పదివేల రూపాయలు ఇవ్వగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కార్యదర్శి లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి అనిల్ ను లంచం తీసుకున్న మొత్తం, సంబంధిత పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, దీపావళి పండుగ సందర్భంగా టపాసుల దుకాణాల పర్మిషన్ విషయంలో గాని, ఇతర గవర్నమెంట్ అధికారులు లంచం అడిగినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేయాల్సిందిగా ఏసిబి డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు.

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు కుటుంబాన్ని…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T135918.056.wav?_=3

 

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు మాతృమూర్తి న్యాలపట్ల మల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ గ్రామంలో రాజు నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించిన అనంతరం మల్లవ్వ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గునుకులకొండాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో న్యాలపట్ల మల్లవ్వ పాత్ర ఉందని, గత నలభై సంవత్సరాలుగా వారి కుటుంబమంతా సిపిఐకి అండగా ఉంటున్నారని, తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, ఇందుర్తి శాసనసభ్యులుగా పని చేస్తున్న కాలంలో మల్లవ్వతో, వారి కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మల్లవ్వ చిన్న కుమారుడు రాజు విద్యార్థి యువజన దశ నుండే అనేక పోరాటాల్లో పాల్గొన్నాడని, ప్రస్తుతం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతున్నాడని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొని కేసుల పాలై జైలు జీవితం గడిపాడని, నాడు జనశక్తి వారితో ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ గానీ వారి కుటుంబం గానీ మొక్కవోని ధైర్యంతో ఉన్నారని, కుమారునికి ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ ఎంతో ధైర్యంగా ఉండేదని అలాంటి మల్లవ్వ మృతి చెందడం అత్యంత బాధాకరమని వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేయడంతో పాటు అండగా సిపిఐ ఉంటుందని వెంకటరెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల సిపిఐ కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, జాగీరు సత్యనారాయణ, నాగెళ్లి లక్ష్మారెడ్డి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, బూడిద సదాశివ, సీతారాంపూర్ మాజీ సర్పంచ్ గోలీ బాపు రెడ్డి, నవాబుపేట మాజీ ఉపసర్పంచ్ ఎలగందుల రాజయ్య, సిపిఐ మండల నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, అంజయ్య, తదితరులు ఉన్నారు.

పొన్నం ప్రభాకర్ దళిత మంత్రికి క్షమాపణ చెప్పాలి

దళిత మంత్రి అడ్లూరు లక్ష్మన్ కుమార్ ని దూషించిన పొన్నం ప్రభాకర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి -బెజ్జంకి అనిల్ మాదిగ

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ ని అసభ్యపదజాలంతో దుషించిన పొన్నం ప్రభాకర్ ఇరవైనాలుగు గంటల్లోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశంలో ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని వివేక్ తో పొన్నం ప్రభాకర్ దున్నపోతుగానికి టైం తెలియదు ఏమి తెలియదు అని అహంకారంగ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ వైఖరి నిరసిస్తూ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షేమాపణ చెప్పాలి లేదా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతాం పొన్నం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈనెల 8న జిల్లావ్యాప్తంగా పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం, ఈనెల 9నాడు పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడి చేస్తాం అన్నారు.

 

ఈఇరవై నాలుగు గంటలు పోన్నం ప్రభాకర్ కి ఇస్తున్నాం. ఒక దళిత మంత్రిని అవమాన పరుస్తూ వివేక్ తో మాట్లాడినప్పుడు ఒక దళిత మంత్రిగా ఉండి కనీసం స్పందించలేదంటే దళిత పదం నీబతుకు తెరువు కోసమే తప్ప దళిత జాతి భవిష్యత్తు కోసం మీరు ఏమి ఉపయోగపడరు అన్నది స్పష్టంగా మాకు అర్థమవుతుంది తక్షణమే పొన్నం ప్రభాకర్ మాటలను ఒక మంత్రిగా మీరు స్పందించాల్సిన బాధ్యత మీమీద కూడా ఉంది అని మేము వివేక్ కూడా గుర్తు చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బోయిని కొమురయ్య మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, దండు అంజయ్య మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, రేపాక బాబు మాదిగ, అలువాల సంపత్ మాదిగ, కనకం నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

“కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో కొత్త గిరిజన వసతి గృహాల శంకుస్థాపన…

నూతన గిరిజన బాలుర, బాలికల వసతి గృహాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన గిరిజన బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణ పనులకు గురువారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, గత బిఆర్ఎస్ పాలకుల హాయంలో శాతవాహన యూనివర్సిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకో లేదని, ఇప్పుడు ప్రజా పాలన ప్రభుత్వంలో హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల, కరీంనగర్ కి లా కళాశాల మంజూరు అయిందని రాజేందర్రావు పేర్కొన్నారు.
విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, నేతలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

చొప్పదండి–మల్యాల రోడ్డుకు 50 కోట్ల మంజూరు…

చొప్పదండి నుండి మల్యాల వరకు రోడ్డు మంజూరు పట్ల కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రము నుండి రాగంపేట్, గోపాలరావుపేట, బురుగుపల్లి, తక్కలపల్లి గ్రామాలను కలుపుతూ జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు కోసం యాభై కోట్ల సిఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడం పట్ల కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి, స్వీట్లు పంపిణీ చేసి, బాణసంచా కాల్చడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ చొప్పదండి నుండి మల్యాల వరకు రోడ్డు సరిగా లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించి వెంటనే వారు స్పందించి మంజూరు చెపిచినందుకు కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకి నూట ఎనభై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, చొప్పదండి నియోజవర్గంలో రోడ్ల అభివృద్ధికి యాభై కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయం అని అన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అను నిత్యం పాటు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంతోనే రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయని వారు అన్నారు. రోడ్డు మంజూరు పట్ల గ్రామస్థులు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు జాతరగొండ ఐలయ్య, కళ్లెం శివ, మండల కార్యదర్శి గుంట అశోక్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మునిగంటి శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ ఉమ్మెంతల అభిషేక్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు పల్లపు చిరంజీవి, రేండ్ల తిరుపతి, మందపెళ్లి అరుణ్, వేముల దామోదర్, బండి శేఖర్, ఉత్తేం కనుకరాజు, మంద రాజశేఖర్, పొన్నం అభిషేక్, బుర్ర శ్రీధర్, దైవాల తిరుపతి గౌడ్, ఎగుర్ల ఎల్లయ్య, లింగంపెళ్లి శ్రీనివాస్, మేకల నాగరాజు, సత్తు రాకేష్, గ్రామస్తులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

సేవా పక్షం మండల కార్యశాల నిర్వహించిన భాజపా నాయకులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T141418.895.wav?_=4

 

సేవా పక్షం మండల కార్యశాల నిర్వహించిన భాజపా నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సేవా పక్షం మండల కన్వీనర్ పోచంపెల్లి నరేష్ ఆధ్వర్యంలో సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఇంచార్జి జాడి బాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా పక్షం రోజులు పార్టీ తెలిపిన సేవ కార్యక్రమలు గాంధీ జయంతి వరకు నిర్వహించాలని, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్ లో జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు. మండల కేంద్రంలో బ్లడ్ డోనేషన్ క్యాంప్, శక్తి కేంద్రం ఇంచార్జి పరిధిలో స్వచ్ భారత్ కార్యక్రమాలు, జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీన్ దయల్ జయంతి రోజున ప్రతి బూత్ లో ఐదు మొక్కలు నాటాలని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు ప్రతి బూత్ లో నిర్వహించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కళ్లెం శివ, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శిలు గుంట అశోక్, కడారి స్వామి, దళిత మోర్చా మండల అధ్యక్షుడు సంటి జితేందర్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, షేవెళ్ల అక్షయ్, బూత్ కమిటీ అధ్యక్షులు దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి గౌడ్, ఉత్తేం కనుకరాజు, బుర్ర శ్రీధర్, ఎగుర్ల ఎల్లయ్య, మడికంటి శేఖర్, మంద రాజశేఖర్, వెంకట్ రెడ్డి, పురంశెట్టి మల్లేశం, వడ్లూరి రాజేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.

యూరియా కోసం రైతులు అరిగోసలు పడుతున్న…

యూరియా కోసం రైతులు అరిగోసలు పడుతున్న పాటించుకొని ప్రభుత్వం

పంటలకు సరిపడా యూరియ అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతుని రాజుల చేసిన కేసిఆర్- సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులను చూసి ఆగిన చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఈసందర్భంగా రైతులు రవిశంకర్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పాస్ బుక్ మీద ఒక్క యూరియా బస్తానే ఇస్తాం అంటున్నారు మాకు ఐదు ఎకరాలు వ్యవసాయానికి ఒక్క బస్తా ఏం సరిపోతుంది అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్య విన్న రవిశంకర్ వెంటనే సంబంధింత అధికారికి ఫోన్ చేసి యూరియా కోసం తల్లడిల్లుతున్న రైతాంగం గురించి వివరించారు. వెంటనే వారికి యూరియా తెప్పించి రైతులకు అందించాలని కోరారు. అనంతరం రైతులతో ముచ్చటిస్తూ పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు చెప్పులను లైన్‌లో పెట్టి గంటల తరబడి నిరీక్షించారని, ప్రస్తుతం అదే పరిస్థితి ప్రతి చోటా కనిపిస్తుందన్నారు. అన్నదాతలు గత పదిరోజులుగా యూరియా కోసం ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసు పుస్తకం, ఆధార్‌కార్డుపై ఒక్క యూరియా బస్తానే ఇస్తుండడంతో ఐదెకరాలు, పదెకరాల భూమి ఉన్న రైతులకు అది ఏమూలకు సరిపోదని పేర్కొన్నారు. ఎకరాకు సుమారు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ఎరువు వేసే సమయంలో యూరియా లభించకుండా పంట దిగుబడిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏఒక్కరోజు కూడా ఎరువుల కోసం ఇబ్బందిలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఈఅవస్థ అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎకరాకు కనీసం రెండు బస్తాల యూరియాను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే, మరోసారి రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version