వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ?

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ? నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా మారడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చోటా..మోటా లీడర్లు రియాల్టర్లుగా అవతారమెత్తుతున్నారు. నర్సంపేట పట్టణంలో చుట్టు శివారు గ్రామాలలో వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా మార్చి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్ని మూడుపూలు ఆరుకాయలుగా సాగిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి లేఅవుట్‌ పర్మిషన్‌ ఉన్న 18వెంచర్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయని…