‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు – ఖాతా తెరవని జనసేన

‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలయిపోయింది. రెండోసారి తప్పక అధికారంలోకి వస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు అంచనాలను వైఎస్సార్‌సీపీ పటాపంచలు చేసింది. అత్యధిక స్థానాలలో మెజార్టీని కనబరుస్తూ అధికారం దిశగా కదిలింది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీ తన అధిక్యాన్ని ప్రదర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ 152 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది….