డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి – నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌ నగరంలోని 26వ డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌ నగర అభివద్ధిలో భాగంగా 26వ డివిజన్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేసి శానిటేషన్‌, డ్రైనేజీ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగర్‌ మేయర్‌తోపాటు బల్దియా కమీషనర్‌ ఎన్‌.రవికిరణ్‌, ఆరోగ్య అధికారి రాజారెడ్డి, బల్దియా వింగ్‌ అధికారులతో కలసి 26వ డివిజన్‌లోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుండి బట్టల బజార్‌, పాపయ్యపేట్‌ చమన్‌, కాకతీయ టాకీస్‌ వరకు పర్యటించారు….