gananga hanuman jayanthi vedukalu, ఘనంగా హనూమాన్‌ జయంతి వేడుకలు

ఘనంగా హనూమాన్‌ జయంతి వేడుకలు వర్థన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ జయంతి, దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు బుధ, గురువారాలు రెండురోజులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ కౌడగాని కవితరాంబాబు, శివాని విద్యాసంస్థల చైర్మన్‌ తాళ్లపల్లి స్వామి, శుభనందిని సంస్థల చైర్మన్‌ కౌడగాని రాంబాబు, గ్రామ పాలకవర్గం, ఆలయ కమిటి సభ్యులు, గ్రామస్తులు పాల్గోన్నారు.