ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీర శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూపాటి ఆనంద్‌, బొందయ్య, దుగ్గొండి మండల తెలుగు యువత అధ్యక్షుడు పెంచాల సతీష్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. దుగ్గొండిలో……