ఓటు ‘పడిపోయింది’ కౌంట్‌ ‘డౌన్‌’ – పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది

ఓటు ‘పడిపోయింది’ కౌంట్‌ ‘డౌన్‌’ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది. మండుతున్న ఎండలు ఇతర కారణాలతో ఓటు వేయడానికి ఓటర్లు ఎవరు అంతగా ఆసక్తి చూపలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికలతో పోల్చితే ఓటింగ్‌ శాతం బాగానే పడిపోయింది. ఉదయం 8గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు కనిపించలేదు. దీంతో పోలింగ్‌ కేంద్రాలన్ని దాదాపు బోసిపోయి కనిపించాయి. మధ్యాహ్నం తరువాత కొద్దిగా పుంజుకున్నట్లు కనిపించిన…