ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…!

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…! ప్రభుత్వ కార్యాలయాల్లో రోజురోజుకు అవినీతి తాటిచెట్టులా పెరిగిపోతూనే ఉన్నది. అవినీతి నిరోధక శాఖ ఎంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపినా, అవినీతిపరుల్లో మాత్రం ఎలాంటి భయం ఉండటంలేదు. ఇంతకుముందు కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడేవారు. కాని ఈ మద్యకాలంలో అధికారితోపాటు కుటుంబసభ్యులు కూడా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేసేందుకు ఉవ్విళ్లూరుతూ దర్జాగా కార్యాలయాల్లో తిష్ఠవేసి అడ్డగోలుగా నొక్కేస్తున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయం ఇంటర్మీడియట్‌…