aruhulaku double bedroom illu nirminchali, అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి

అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్రీకాంత్‌ అన్నారు. మంగళవారం శాయంపేట మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా మిషన్‌ భగీరథ నల్లాలు పూర్తిగా నిర్మించాలని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ్‌, ప్రసాద్‌, ప్రభాస్‌, వికాస్‌, మోహన్‌, కపిల్‌ రామ్‌ పాల్గొన్నారు.