*ఆచూకీ తెలిపిన వారికి తగిన నగదు బహుమతి
మంగపేట నేటి ధాత్రి
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుల ఫోటోలో ఉన్న పోస్టర్ ని ఎస్ ఐ గోదారి రవికుమార్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రస్తుత కాలంలో వారి పాత సిద్ధాంతాలతో ప్రజల అభివృద్ధికి ఆటంకంగా మారి సామాన్య ప్రజల మరణాలకు సైతం మావోయిస్టులు కారకులవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఎవరు మావోయిస్టులకు సహకరించవద్దని ఎవరైనా మావోయిస్టులు కనబడిన మరియు వారికి సంబంధించిన సమాచారం తెలిసిన యెడల వెంటనే పోలీసువారికి తెలియజేయాలని కోరడమైనది.అని అన్నారు