శ్రీ గాయత్రీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఘరానా మోసం!?

`యాత్రికుల సొమ్ము 15 కోట్లు మింగిన వైనం?

`బాధితులు చెబుతున్న మాటలే సాక్ష్యం!

`కొంత కాలం అర్చకుడుగా భరత్‌ కుమార్‌ అవతారం.

`భక్తులకు నమ్మకంగా కొంత కాలం వ్యవహారం.

`తర్వాత కొంత కాలానికి మొదలుపెట్టిన టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ వ్యాపారం.

`దశాబ్దన్నర కాలంగా సాగుతున్న యాత్రల ప్రయాణం.

`కరోనా కాలంలో కూడా భక్తులను నమ్మించి సాగించిన వసూళ్ళ పర్వం.

`భరత్‌ కుమార్‌ మోసాన్ని పసిగట్టి నిలదీస్తున్న భక్తజనం.

`జరిగిన మోసాన్ని కప్పి పుచ్చుకునేందుకు భరత్‌ కుమార్‌ మొదలుపెట్టిన కపట నాటకం.

`ఏ తప్పూ చేయలేదని బుకాయించే ప్రయత్నం!

`జరిగిన మోసాన్ని ఇతరుల మీద నెట్టేసే యత్నం!

`నమ్మి మోసపోయామంటున్న జనం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక సామాన్య అర్చకుడు భరత్‌ కుమార్‌ పౌరోహిత్యం మానేసి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అవతారమెత్తాడు. ఉప్పల్‌ లోని కళ్యాణ్‌ పురిలో నివాసం ఏర్పాటు చేసుకొని గుడికి వచ్చే భక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు. వారిని కైలాస యాత్రలు మొదలుపెట్టాడు. తొలుత అందరు వ్యాపారుల్లాగానే నమ్మకం ప్రదర్శించాడు. కరోనా సమయం కూడా కలిసి వచ్చేలా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఎత్తున యాత్ర పేరుతో దందా మొదలుపెట్టాడు. కరోనా క్లష్ట సమయంలో కూడా జనాన్ని నమ్మించి టూర్‌ ప్యాకేజీలు బుక్‌ చేయించాడనేది బాధితుల ప్రధాన ఆరోపణ. డబ్బులు తిరిగి ఇవ్వమంటే తాను ఏజెన్సీలకు చెల్లించి ఇరుక్కుపోయాయనని కాకమ్మ కబుర్లు చెబుతున్నాడనేది మోసపోయిన వారి ప్రధాన వాదన.

లక్షలు చెల్లించిన బాధితులు మేం మోసపోయాం మొర్రో అంటుంటే, నేనెవరినీ మోసం చేయలేదు.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకేం పాపం తెలియదు. నేను అమాయకుడిని అంటూ ఉప్పల్‌ లోని శ్రీ గాయత్రీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అధినేత భరత్‌ కుమార్‌ చెప్పే మాటలు విచిత్రంగా వున్నాయి. ఇంకా నయం డబ్బులు చెల్లించామని చెబుతున్న వాళ్లు ఎవరో నాకు తెలియదు. వారిని ఎప్పుడూ చూడలేదు. నేను వాళ్ల వద్ద నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. అసలు వాళ్లు మా కార్యాలయానికే రాలేదని భరత్‌ కుమార్‌ చెప్పడం లేదు. అంటే బాధితులు డబ్బులు చెల్లించిన మాట వాస్తవం. అవి భరత్‌ కుమార్‌ తిరిగి ఇవ్వలేదన్నది నిజం. అలాంటప్పుడు బాధితులు చెప్పేవి అబద్దాలు ఎలా అవుతాయి! భరత్‌ కుమార్‌ మాటలు నిజమెలా అవుతాయి! ఏ వ్యాపారస్థుడైనా ముందు పెట్టుబడి పెట్టి దుకాణం తెరుస్తారు. టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ లాంటి వ్యాపారంలో యాత్రికులే పెట్టుబడి దారులు. ఫలానా రోజు ఫలాన ప్రాంతాలను ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా, నష్టం లేకుండా, కాళ్లు కిందపెట్టకుండా, కాలు కందిపోకుండా అన్ని యాత్రలు తిప్పి చూపిస్తాము. ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు నుంచి తిరిగి ఇంటికి చేర్చే వరకు అన్ని బాధ్యతలు మావే! అంటారు. జనాన్ని ఆకర్షిస్తారు. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారు. అప్పుడు తాపీగా పనులు మొదలుపెడతారు. ఇంతవరకు బాగానే వుంటుంది. జనానికి ఇక్కడి నుంచి చూపిస్తారు చుక్కలు. మనం కార్యాలయానికి వెళ్లినప్పుడు మీ బుకింగే ఆఖరు…వున్నవి సీట్లు రెండే అంటారు. మంచి సమయంలో వచ్చారని అంటారు. ఒక్క రోజు లేటైనా ఈ ఏడాది టూర్లు మిస్సయ్యేవారని అంటారు. తీరా డబ్బులు చెల్లించిన తర్వాత ఇంకా పూర్తికాలేదు. ఇంకా సీట్లు నిండలేదు. మా ప్యాకేజీకి అవసరమైన వాళ్లు రాలేదు…ఇలా టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ కష్టాలు వుంటాయి. అయినా సరే జీవితంలో ఒక్కసారైనా మానససరోవరం, కైలాస యాత్ర చేయాలని ఎంతో మంది అనుకుంటారు. మధ్యతరగతి ప్రజలు జీవితకాలం కొంత కొంత దాచుకొని ఆఖరుకు ట్రావెల్స్‌ వాళ్ల చేతిలో పెట్టేస్తారు. అసలు కైలాసం కొన్ని ట్రావెల్స్‌ కంపెనీలు ఇక్కడే చూపిస్తారు. సరిగ్గా అలాంటిదే శ్రీ గాయత్రీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అని బాధితులు అంటున్నారు. తమను భరత్‌ కుమార్‌ నిండా ముంచాడని అంటున్నారు. కానీ భరత్‌ కుమార్‌ తానెవరినీ మోసం చేయలేదని భుకాయిస్తున్నాడు. భరత్‌ కుమార్‌ మోసం చేయకుండానే బాధితులు రోడ్డెక్కారా? పోలీసు స్టేషను లో పిర్యాదు చేశారా? ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసులు అరెస్టు చేశారా! కోర్టులో ప్రవేశపెట్టారా? తనకు వెంటనే బెయిల్‌ వచ్చిందని భరత్‌ చెప్పడం హాస్యాస్పదంగా వుంది. బెయిల్‌ వచ్చినంత మాత్రాన భరత్‌ నిర్థోషి కాదు. బెయిల్‌ మంజూరైనా నిందుతుడే అన్న సంగతి మర్చిపోతున్నాడు. పైగా తనపై అసత్య ప్రచారాలు సాగించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని మీడియా ముఖంగా చెబితే బాధితులు వెనక్కి తగ్గుతారని భరత్‌ ఆశించి వుంటాడు. ప్రజల జీవితాలతో ఆడుకున్న వారిని మోసం చేసిన వారి బాగోతాలు వెలుగులోకి తేవడమే మీడియా పని. ప్రజలే భరత్‌ మూలంగా డబ్బులు నష్టపోయామని చెబుతున్నారు. భరత్‌ మీద ఎవరూ బట్ట కాల్చి మీద వేయడం లేదు. బాధితులే స్వయంగా తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. తాము మోసపోయామని చెబుతున్నారు. తమను భరత్‌ నిండా ముంచాడని చెబుతున్నారు. మానస సరోవర, కైలాస యాత్రలకు చైనా పర్మిషన్‌ ఇవ్వడం లేదని చెప్పకుండా యాత్రల పేరుతో డబ్బులు వసూలు చేశారని బాధితులు అంటున్నారు. ఆ విషయం ముందు నాకు కూడా సమాచారం లేదని మీడియా సమావేశంలో భరత్‌ కూడా చెప్పేశాడు. కానీ బాధితులు మాత్రం చైనా అంగీకరిండం లేదని తెలిసే మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తమ వద్ద డబ్బులు తీసుకొని ఇంత వరకు భరత్‌ చెల్లించడం లేదని స్వయంగా బాధితులే అంటున్నారు. బాధితులు ఇచ్చిన డబ్బులు నేపాల్‌లో అకామిడేషన్‌ ఏర్పాటు చేసే సంస్థలకు చెల్లించడం జరిగింది. వాళ్లు తిరిగి ఇవ్వకపోవడం వల్లనే బాధితులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామని చెప్పి భరత్‌ అడ్డంగా దొరికిపోయాడు. ఎందుకంటే నేపాల్‌ లో ఏజెన్సీలకు భరత్‌ చెల్లించే డబ్బులకు , బాధితులకు సంబంధం లేదు. కైలాస యాత్ర కోసం ఇంత ఖర్చవుతుంది అని మాత్రమే భరత్‌ చెప్పాడు. నేపాల్‌ లో ఏదైనా సమస్య ఎదురైతే నాకు సంబంధం లేదని చెప్పగలడా? అలా చెప్పి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ నడపగలడా? తనను ఎక్కడో వున్న నేపాల్‌ ఏజెన్సీలు మోసం చేశాయని బాధితుల డబ్బులు తిరిగి చెల్లించకపోవడాన్ని ఎవరూ సమర్థించరు. అయినా 18. సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా వ్యాపారం చేస్తే, నేపాల్‌ ఏజెన్సీలు ఎలా మోసం చేస్తాయి! వ్యాపార లావాదేవీలు ఏజెన్సీలు వదులుకుంటాయా? తాను కోవిడ్‌ సమయంలో ఆసుపత్రిలో వున్నప్పుడు తనకు చెందిన వ్యక్తి చేసిన మోసం వల్ల ఇదంతా జరిగింది అని భరత్‌ స్వయంగా అంగీకరించారు. తనను ఎవరో మోసం చేస్తే బాధితులకు ఏం సంబంధం? నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని భరత్‌ చెప్పే విషయాలు చాలా సిల్లీగా వున్నాయి. వ్యాపారంలో అనేక సవాళ్లు, ప్రతి సవాళ్లు వుంటాయి. వాటిని ఎదుర్కొంటూ, చేధించుకుంటూ ముందుకు సాగాల్సిందే! అయినా భరత్‌ ఎలాంటి ఎత్తులు, పై ఎత్తులు చేయకుండానే ఇంత కాలం వ్యాపారం చేశాడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!