repu narada jayanthi..,రేపు నారద జయంతి….

రేపు నారద జయంతి….

ఆదర్శ పాత్రికేయుడు నారదుడు…నారద మహర్షి..మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోకసంచారం చేస్తాడు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నారదుని జన్మతిథి వైశాఖ బహుళ విదియ. ఈ తిథినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుతారు. నారదుడు త్రిలోక సంచారి. ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటాడు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్రను పోషిస్తుంటాడు. ‘నార’ అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ‘ద’ అనగా ఇచ్చేవాడని అర్థం ఉంది. నారదుడి జన్మ వత్తాంతంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రళయం తర్వాత కాలంలో పునఃసష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుని నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ…మరీ చి, అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజాపతులను సష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు. మానవాళి శ్రేయస్సు కోసం నారదుడు ఎన్నో మంచి పనులు చేశాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పాత్రికేయలందరికీ మహర్షి నారదుడి జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం. అందుకే ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినంగా నిర్వహిస్తూ..ఆ రోజున పాత్రికేయ వత్తికి న్యాయం చేకూరుస్తున్న కొంతమంది పాత్రికేయులను ప్రతి సంవత్సరం సంచారభారతి సన్మానిస్తున్నది. పాత్రికేయులు అంతా మహర్షి నారదుని బాటలో నడిచి ప్రజల కష్టాలను దూరం చేసినప్పుడే ధర్మమార్గంలో నడిచే సమాజం వెల్లివిరుస్తుంది. ఈ సందర్భంగా 19వ తేదీ ఆదివారం ఉదయం పదిన్నరకు బాలసముద్రంలోని సామాజికం మోహన్‌రెడ్డి స్మారక భవనంలోని ఏసీ సెమినార్‌ హాల్లో నారద జయంతి సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులను సమాచార భారతి సన్మానిస్తున్నది. ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ అధిపతి మల్లేశ్వర్‌, భారతీయ ప్రజ్ఞ సంపాదకులు మామిడి గిరిధర్‌ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు దాసరి కష్ణారెడ్డి, పిన్న శివకుమార్‌లను సత్కరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *