ఉపాధ్యాయుల సంక్షేమమే పిఆర్టియు ధ్యేయం

ఉపాద్యాయ సంక్షేమ నిధి బాండ్లు పంపిణీ చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి -పలిత శ్రీహరి

నడి కూడ,నేటి ధాత్రి
ప్రోగ్రెసివ్ రికగ్నైటెడ్ టీచర్స్ యునియన్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి హనుమకొండ జిల్లా అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి ఉపాధ్యాయుల సంక్షేమ నిధి బాండ్లను నడి కూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్,ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల సతీష్ కు అందజేశారు. ఈ బాండ్ పేపర్లను పి ఆర్ టి యు నడికూడ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సంక్షేమ నిధి బాండ్ పేపర్లను హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మండలంలోని ఉపాధ్యాయులకు అందజేశారు.ఈ సందర్భంగా ఫలిత శ్రీహరి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టియు సంఘం ఎప్పుడు ముందుంటుందని ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కూడా ముఖ్యమని భావించిన పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి ఉపాధ్యాయుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఆ నిధికి సంబంధించిన బాండ్ పేపర్లను ఈరోజు ఉపాధ్యాయులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నందికొండ రఘోత్తమ్ రెడ్డి, నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల సతీష్, ఉపాధ్యాయులు భద్రయ్య, రామయ్య, కోటేశ్వర్, జగదీశ్వర్, రాజేందర్, ఝాన్సీ  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *