ప్రెస్‌క్లబ్ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించిన సీపీ
క్రీడలు మానసికోల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. శుక్రవారం వరంగల్ ప్రెస్‌క్లబ్ స్పోర్ట్స్ మీట్-2019 క్రీడలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ ప్రారంభించారు. అనంతరం సీపీ డాక్టర్ వి.రవీందర్ మాట్లాడుతూ రోజంతా వార్త సేకరణలో అలుపెరగకుండా తిరుగుతూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, వారికి ఈ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. క్రీడలతో శరీరం ధృడంగా తయారవుతుందని తెలిపారు.