ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్‌

సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ప్రజల గుండెల్లో జననాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనియాడారు. హన్మకొండ భవానీనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి ఏర్పాటుచేసిన కేక్‌ను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కట్‌ చేశారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ వెండితెర వేల్పుగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతికాలంలోనే అన్నివర్గాల ప్రజల మన్ననలు స్వర్గీయ ఎన్టీఆర్‌ పొందారని అన్నారు. 1982కంటే ముందు నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌ మహిళా రిజర్వేషన్‌తోపాటు నిమ్న వర్గాలకు స్వాతంత్య్రం, సామాజిక, రాజకీయపరమైన అవకాశాలను కల్పించారని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో వ్యక్తిగత కక్షతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మోడీ, కేసిఆర్‌, జగన్లు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడిని ఓడించడమే ధ్యేయంగా అక్రమ పద్ధతులతో పనిచేశారని, తెలుగుదేశం పార్టీ వ్యక్తుల పార్టీ కాదని ప్రజల పార్టీ అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రం ఎంతో అభివద్ధి చెందిందని తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రానికి రెండుసార్లు లేఖలిచ్చారని తెలుగుదేశం పార్టీ ద్వారానే అన్నివిధాలుగా ఎదిగిన వారే తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడిని దెబ్బతీయాలని కుట్ర చేయడం సిగ్గుచేటని అన్నారు. సిద్ధాంతపరంగా నిస్వార్థంగా సేవచేసే వారే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజలు, బడుగు, బలహీనవర్గాలు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం రాజకీయ విశ్వరూపం ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం దొరికే ఎన్టీఆర్‌ అని ప్రజల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశమని అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల సంక్షేమానికి కషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పుల్లూరు అశోక్‌కుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ జాటోతు సంతోష్‌నాయక్‌, మాజీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ బాబా ఖాదర్‌ అలీ, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు కంప వినోద్‌కుమార్‌, టిఎన్‌యుఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంజ వెంకట్రాజంగౌడ్‌, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ రహీం, ఉమ్మడి జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు హన్మకొండ సాంబయ్య, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కుసుమ శ్యాంసుందర్‌, జిల్లా నాయకులు బైరపాక ప్రభాకర్‌, గొల్లపల్లి ఈశ్వరాచారి, మాఢగాని మనోహర్‌, తోట రమేష్‌, అంబటి ప్రభాకర్‌, బర్ల యాకుబ్‌, సయ్యద్‌ బాబాభాషా, బైరి శేషాద్రి, రవీందర్‌ గుప్తా, చెంచు వేణు, శివరాత్రి వెంకన్న, నాయిని సత్యనారాయణరెడ్డి, కిన్నెర సుధాకర్‌, పిట్టల శ్రీనివాస్‌, కొంగర ప్రభాకర్‌, పోతరాజు అనిల్‌కుమార్‌, కాగితాల జయశంకర్‌, బోడా మోహన్‌బాబు, సాగంటి రాకేష్‌, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *