· ¹కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు
· విభజన వెనుక కాంగ్రెస్ కుట్ర: బీజేపీ, బీఆరఎస్‌ల ఆరోపణ
· అధిక రెవెన్యూ వుండే ప్రాంతాలపై ప్రభుత్వ పట్టు కోసం యత్నం: విపక్షాలు
· బీఆరఎస్, బీజేపీ మూలాలను దెబ్బకొట్టే వ్యూహం
· ఎంఐఎంకు రేవంత్ ఇస్తున్న గిఫ్ట్ ఇది: బీజేపీ
· విభజన పుణ్యమాని ఇళ్లకు అనుమతులు రాక సామాన్యులు లబోదిబో
· విభజన పేరుతో ఆగస్టు వరకు ఎన్నికలు వాయిదా వేసే వ్యూహం
· స్పెషల్ ఆఫీసర్ల నియామకం వెనుక ఆలోచన ఇదే
· బీఆరఎస్ నేత కేటీఆర్ ఆరోపణ
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 11న అధికారికంగా జీహెచఎంసీని మూడు కార్పొరేషన్లుగా విడ గొట్టిన సంగతి తెలిసిదే. ప్రభుత్వం ఈ చర్య తీసుకున్న వెంటనే దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ఈవిధంగా విభజించడానికి ఎంచుకున్న స మయం, వివిధ జోన్లకు నిర్ణయించిన సరిహద్దుల అంశాలను సవాలు చేస్తూ ఈ లిటిగేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం జీహెచఎంసీని వరుసగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొ రేషన్లుగా విడగొట్టింది. హైదరాబాద్ కింద శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోý£్కండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లుండగా, సైబరాబాద్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖు త్బుల్లాపూర్ జోన్లు అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లను ప్రభుత్వం చేర్చింది. స్పెషల్ సెక్రటరీ జయేష్‌రంజన్‌కు ఈ మూడు కార్పొరేషన్ల బాధ్యతను ప్రభుత్వం అప్పగిస్తూ ఈనెల 10న ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి వీలుగా 55వ నెంబరు జీవోను జారీచేసింది. ప్రస్తుతం ఈ జీవోను వ్యతిరే కిస్తూ పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరుపుతున్న జస్టిస్ అపరేష్‌కుమార్, జస్టిస్ జి.ఎం. మొయునిద్దీన్లతో కూడిన దర్మాసనం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. ఈనెల 19`20 తేదీల్లో అదనపు సొలిసిటర్ జనరల్ (కేంద్రం), అడ్వకేట్ జనరల్ (రాష్ట్రం)లకు దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే విభజన ప్రక్రియను నిలుపుచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తూ కేసు విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ వ్యాపారవేత్త డి.గురవారెడ్డితో పాటు మరికొందరు పిటిషన్ దారులు 55వ నెంబరు జీఓను వ్యతిరేకించడానికి కొన్ని కారణాలను స్పష్టంగా పేర్కొన్నారు.
2025 ఆగస్టు నెలలో రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియాలు 2027లో జనగణన పూర్తయ్యే వరకు న్యాయపరిధిలో మార్పులు చేయకుండా ఇచ్చిన “ఫ్రీజింగ” ఆదేశాలను ఈ జీఓ ఉల్లంఘిస్తున్నది. వీటి ప్రకారం 2027 జనగణన పూర్తయ్యే వరకు మున్సిపల్ సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేదు. దీన్నిబట్టి ఈ జీఓ సెన్సెస్ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
ఈ ఫ్రీజ్ ఆదేశాలు 2025 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రాగా, జనగణన పూర్తయ్యే వరకు అమల్లో వుంటాయి. అందువల్ల 2026 ఫిబ్రవరి నెలలో జీహెచఎంసీని విభజిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం.
రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణాలను ఉల్లంఘించేదిగా వున్నందున్న తెలంగాణ మున్సిపాలిటీస్ సవరణ చట్టం`2026 రాజ్యాంగ విరుద్ధం.
మున్సిపల్ పరిధుల్లో మార్పులు చేసేటప్పుడు జనాభా, ఆదాయం వంటి అంశాలను పరిగణలోకితీసుకోవాలని, అంతేకాకుండా విభజన గురించి గవర్నర్ నోటిఫికేషన్ జారీచేయాలని అటువంటిదేమీ ఇక్కడ జరగలేదని పిటిషనర్లు వాదించారు. ఇది రాజ్యాంగంలోని 243క్యు అధికరణాన్ని ఉల్లంఘించడమేనని వారు తమ వాదనలో వివరించారు.
ఈ విభజన ప్రక్రియ రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని ఉల్లంఘించడంలేదని, ఇది జనగణకు ఏవిధంగాను అడ్డంకి కాజాలదని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే ఈ విభజనను హైకోర్టులో సవాలు చేసినప్పటికీ, సైబరాబాద్ కమిషనర్‌గా జి.శ్రీజన, మల్కాజ్గిరి కమిషనర్‌గా టి.వినయ్కష్ణారెడ్డిలు బాధ్యతలు స్వీకరించి కార్యాలయాల ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో బిజీగా వుండటం విశేషం. ఫిబ్రవరి 11న పరిపాలనా పరంగా జీహెచఎంసీని విభజిస్తూ రూపొందించిన మ్యాప్ ప్రకారం కమిషనర్లు తన పాలనా విధులను నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం జీహెచఎంసీలో వున్న 300 వార్డులను మూడు కార్పొరేషన్ల పరిధిలోకి విడగొట్టారు. వీటిని ఒక్కో కార్పొరేషన్ పరిధిలోని జోన్లకిందికి చేర్చారు. ఉదాహరణకు హైదరాబాద్ కార్పొరేషన్లో చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోý£్కండ, రాజేంద్రనగర్, షంషాబాద్ జోన్లుండగా వీటిల్లో ముఖ్యమైన ప్రాంతాలు జూబిలీహిల్స్, ముషీరాబాద్, అమీర్‌పేట్, ఫలక్నామా, బందన్పేట్లు. ఈ కార్పొరేషన్‌ను మొత్తం 150 వార్డులు, 30 సర్కిల్స్‌గా విడగొట్టారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఖుత్బుల్లాపూర్ జోన్లుండ గా మాదాపూర్, మియాపూర్, నిజాంపేట్, కొంపల్లి, మేడ్చెల్లు కీలక ప్రాంతాలు. ఈ కార్పొరేషన్ పరిధిలో 76 వార్డులు, 16 సర్కిళ్లు వున్నాయి.
మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లుండగా, అల్వాల్, కాప్రా,సరూర్‌నగర్, బోడుప్పల్లు కీలక ప్రాంతాలు. ఇందులో మొత్తం 74 వార్డులు, 14 సర్కిల్స్ వు న్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆరఎస్, బీజేపీ, ఎంఐఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం, అశాస్త్రీయంగా చేస్తున్న విభజనగా ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా 2023 మున్సిపల్ ఎన్నికల్లో తాను దెబ్బతిన్న అర్బన్ ప్రాంతాలను దష్టిలో పెట్టుకొని,ఈసారి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వీలుగా రేవంత్ ప్రభుత్వం ఈ విభజన చేపట్టిందనిబీఆరఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఇది కేవలం కుట్రపూరితంగా ఎంఐఎంకు ఇస్తున్న బహు మానంగా బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆరఎస్ ఎమ్మెల్యే కె.పి. విy ûకానందగౌడ్ మాట్లాడుతూ మేయర్‌ను, ఎన్నికైన కార్పొరేటర్లను సంప్రదించకుండా ఏకపక్షంగా రహస్యంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమని ఆరోపించారు. ఈ ప్రక్రియవల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం వుంది. ప్రస్తుతం ఈ మూడుకార్పొరేషన్లు స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధీనంలో వున్నాయి. అయితే ఈ విభజన ప్రక్రి య పుణ్యమాని తమ ఇళ్లకు అనుమతులు రావడంలేదని ఉప్పల్, ఖుత్బుల్లాపూర్ ప్రాంత వాసు లు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా జోన్ల పరిధులు మారిపోవడంతో ఫైళ్లను తరలించే ప్రక్రి య కొనసాగడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.
జీహెచఎంసీలో బీఆరఎస్, బీజేపీలకు మంచి బలం వుంది. 2020 జీహెచఎంసీ ఎన్నికల్లో బీఆరఎస్ 56, బీజేపీ 48 సీట్లు గెలుచుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈవిధంగా జీహెచఎంసీని విడగొట్టడం ద్వారా ఇప్పటివరకు సువిశాలంగా వున్న ప్రాంతాలను చిన్నవిగా విడగొట్టడం వల్ల తనకు అనుకూలంగా వుంటుందని, ముఖ్యంగా సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం అమలు చేయవచ్చునన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. జంటనగరాల్లో బీఆరఎస్బలంగా వుంది. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని 24 అసెంబ్లీ స్థానాల్లో కాం గ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ప్రస్తుతం ఈవిధంగా విభజించడం ద్వారా, బీఆరఎస్ కోటలోకి చెట్టు వేళ్ల మాదిరిగా చొచ్చుకు పోవాలన్నది రేవంత్ వ్యూహం.
ఎంఐఎంకు ఈ విభజన ద్వారా కాంగ్రెస్ ఒక గిఫ్ట్‌ను ఇస్తున్నదని బీజేపీ ఆరోపిస్తోంది. ఉమ్మడి జీహెచఎంసీలో ఎంఐఎం బలం 23%కు మాత్రమే విస్తరించివుంది. ఇప్పుడు హైదరాబాద్‌కు 150 వార్డులు కేటాయించడమంటే, ఎంఐఎంను కింగ్‌మేకర్‌గా చేయడం తప్ప మరోటికాదని బీజేపీ నేతల వాదన. అంతేకాదు ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ఎంఐఎంకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే కాకుండా, కాంగ్రెస్, ఎంఐఎంలు కలిసి మేయర్ స్థానాన్ని కైవలం చేసుకోవడానికి నెంబర్‌గేమ్ ఆడ{ం చాలా సులువుగా మారనుందని వారు పేర్కొంటున్నారు. కాగా రెవె న్యూపరంగా అత్యంత విలువైన సైబరాబాద్‌పై ప్రభుత్వం తన నియంత్రణను కొనసాగించాలను కుంటోందని బీఆరఎస్ నేత కేటీఆర్ ఆరోపిస్తున్నారు. చిన్న విస్తీర్ణంలో స్వతంత్రంగా వుండే ప్రాంతాలను చూపి కొత్త రుణాలు పొందవచ్చు. లేదా కొత్త గ్రోత్ కారిడార్లను అభివద్ధి చేయనూ వచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన “ఫ్యూచర్‌సిటీ”కి తగిన ఊపు లభింపజేసేందుకోస మే ఈ విభజన అని, కొన్ని పోలీసు విభాగాలు, అభివద్ధి పరిధి కలిగిన కొన్ని మున్సిపల్ ప్రాంతాలను ఇందులో కలిపేస్తే అభివద్ధి మరింత వేగవంతమవుతుందన్న వ్యూహం కూడా వున్నదన్నఅభిప్రాయాలున్నాయి. అంతేకాదు, ప్రభుత్వం ఇప్పుడు విభజన ప్రక్రియను మొదలుపెడితే ఇది పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుంది. స్పెషల్ ఆఫీసర్‌ను నియమించడంలో ప్రధాన ఉద్దేశం ఇదే. పునర్మిర్మాణ ప్రక్రియ వల్ల పాలనాపరంగా ప్రభుత్వం ప్రతి ప్రాంతంలో తన ఉనికిని ప్రదర్శించగలదు. ఈ ప్రభావం ఓటర్లపై పడితీరుతుంది కనుక, ఈ ఏడాది ఆగస్టు వరకు ఎన్ని లు వాయిదా వేసే ఆలోచనతో ప్రభుత్వం వున్నదని బీఆరఎస్ ఆరోపిస్తోంది.
