రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లా ప్రాంతంలో చిరుతపులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 5న ఉదయం ఉపాధి హామీ కూలీలు పనులకు వెళ్తుండగా దుప్పి కళేబరం ను గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని అటవీ అధికారులు పరిశీలించారు. దుప్పి కళేబరంపై ఉన్న గాయాల గుర్తుల ఆధారంగా చిరుత దాడి చేసి చంపినట్లు తేల్చారు. దాహార్తి తీర్చుకోవటానికి వచ్చిన చిరుతపులి బారిన పడినట్లు నిర్ధారించారు.కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.