అమ్మింది 23 ఏకరాలు..కొన్నది 8 ఏకరాలు (katta umakanth)

అమ్మింది 23 ఏకరాలు..

*కొన్నది 8*

● స్థలం లేకుండానే దందా.?

●’కింగ్’ మేకర్ లక్ష్మీ నారాయణ

● కార్తికేయ హిల్స్, కార్తికేయ పనోరమా?

● బాధితుల్లో పోలీసులు,

బ్యూరో ‘క్రాక్స్’..?

(హైదరాబాద్)

కొన్నది 8ఎకరాల స్థలం. చెప్పేది 23 ఎకరాలు… అసలు ఏం చెప్పారు? ఏం . చేస్తున్నారు? సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే ‘అమీన్ పూర్ లో 238 ఎకరాల స్థలంలో 10 టవర్ల నిర్మాణం’

అంటూ నమ్మించి వందలాది మందితో రూ.వందల కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. సుమారు మూడేళ్లుగా సాహితీ శర్వానీ ఎలైట్ పేరుతో బుకింగ్

స్వీకరిస్తున్న సాహితీ సంస్థ పేరుతో ఉన్న భూములను పరిశీలిస్తే దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పరిశోధనలో షాకింగ్ విషయాలు. బయటపడ్డాయి. 23ఎకరాల స్థలంలో వెంచర్ వేసినట్లు నమ్మించిన సాహితీ సంస్థ పేరుతో మొత్తం ఉన్న భూమి కేవలం 8 ఎకరాలు మాత్రమే? అని తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అమావాస్య పేరిట డ్రామా ?: లాంచింగ్ దందాలో 23 ఎకరాల స్థలం ఉందంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసిన సాహితీ సంస్థకు.. అసలు అక్కడ అంత స్థలం లేదని తెలుస్తోంది. సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేసిన ఈసీలో స్పష్టంగా ఉఞది. దాంతో బాధితులు సంస్థ ఉద్యోగులను నిలదీశారు. తమకు స్థలం మొత్తం మీద అధికారం ఉందంటూ బుకాయించిన సాహితీ ప్రతినిధులకు తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించడంతో కొత్త పాట అందుకున్నారు. స్థలాలను కొనుగోలు చేసే డబ్బులు మొత్తం చెల్లించామని, రిజిస్ట్రేషన్ చేసేందుకు అమ్మకం దారులు సిద్ధంగా ఉన్నారని నమ్మించే ప్రయత్నం చేశారు. గతనెల 28న మిగిలిన స్థలం మొత్తం రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంది. అయితే అమావాస్య కావడంతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదని సాకులు చెప్పడంతో బాధితులంతా అవాక్కయ్యారు. ఏడాదిన్నర కాలంగా రోజుకో రకమైన కారణాలు చెబుతూ తమను మోసం చేస్తూనే ఉన్నారని, అసలు స్థలమే వారి పేరుమీద లేకున్నా ఇంకా బుకాయించడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర ప్రాజెక్టుల్లోనూ ఇదే బొంకుడు..!:

అమీన్ పూర్ లోని సాహితీ శర్వానీ ఎలైట్ వెంచర్ పేరుతో వందల కోట్ల రూపాయలను దిగమింగి బాధితులను అష్టకష్టాలకు గురిచేస్తున్న సాహితీ సంస్థ ఇతర ప్రాజెక్టుల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు తాజాగా బయటపడింది. మాదాపూర్ సమీపంలోని కార్తికేయ హిల్స్, కార్తీకెయ పనోరమా పేరుతో రెండున్నర ఎకరాల్లో 3 భారీ టవర్ నిర్మిస్తున్నామని చెప్పింది. సాహితీ సంస్థ 10 ఫ్లోర్లు మాత్రమే కట్టడంతో పాటు చాలా ఫ్లాట్లు అసంపూర్తిగా వదిలిపెట్టారు. అనుమతులు లేని 11, 12 అంతస్తులలో ఫ్లాట్ కొనుగోలు చేసిన వారు నిండా మునిగిపోయారు. దీంతో పాటు మూడో టవర్ పనులు కూడా ప్రారంభం కాకపోవడంతో తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తాజాగా బయటపడింది.

బాధితుల్లో పోలీసులు, బ్యూరోక్రాట్లు..:

గ్రేటర్లోని ప్రముఖ నిర్మాణసంస్థల్లో ఒకటిగా పేరు పొందిన సాహితీ సంస్థలో ఫ్లాట్ కొనుగోలు చేసి మోసపోయిన వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారులతో పాటు పలువురు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాకతీయ హిల్స్ లో కార్తీకేయ పనోరమా, బాచుపల్లిలోని ఆనంద్ ఫార్చూన్ ప్రాజెక్టులలో ఫ్లాట్ కొనుగోలు చేసి వారిలో పలువురు బ్యూరోక్రాట్స్ ఉన్నారని, తాజా పరిణామాలతో వారంగా తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు

ఆందోళనకు సిద్ధం:

సాహితీ సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో ఇక తమకు డబ్బులు వస్తాయన్న నమ్మకం కొల్పోయిన బాధితులు భారీ ఆందోళనకు సిద్ధమ వుతున్నారు. అమీనుపూర్ లోని సాహితీ శర్వానీ ప్రాజెక్టులోనే సుమారు 500మందికి పైగా బాధితులున్నారని. కాకతీయ హిల్స్, బాచుపల్లి.. కొంపల్లి తదితర ప్రాంతాల్లోని వెంచర్లలో బాదితులను కలిపితే సుమారు 1000 దాటొచ్చని తెలుస్తోంది. ఇప్పటికీ సాహితీ సంస్థ ఎండీ లక్ష్మినారాయణతో పాటు సంస్థ మీద బాచుపల్లి పోలీస్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సాహితీ సంస్థ మోసాలు రూ. వందలకోట్ల మేర ఉంటాయని భావిస్తున్న పోలీసులు ఫిర్యాదులన్నింటినీ.. సీసీఎస్ కు బదిలీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

అమావాస్య పేరిట కొత్త డ్రామా? 

సాహితీ మోసాలకు లెక్కేలేదా? నిర్మాణం పేరుతో ప్రచారం రూ.వందలకోట్లతో బురిడీ ఇతర ప్రాజెక్ట్ ల్లోనూ మోసాలు? ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు

బాక్స్:

సీసీఎస్ లో ‘సాహితీ ఇన్ఫ్రాటెక్’ సంస్థపై కేసు:

జూబ్లీహిల్స్ ని నిర్మాణ సంస్థ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ‘సాహితీ శ్రావణి ఇలిట్ (రెసిడెన్షియల్ బిల్డింగ్ ప్రాజెక్టు) ప్రీ లాంచింగ్ పేరిట మోసానికి పాల్పడిందంటూ బాధితులు సోమవారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఒక్కసారిగా పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు బాధితులు మాట్లాడుతూ.. ‘సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పర్లో సాహితీ ఇన్ఫ్రాటెక్ సంస్థ సాహితీ శర్వాణీ ఎలైట్ పేరుతో పది టవర్లు నిర్మాణం చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించింది. సంస్థపై నమ్మకంతో వందల మంది డబ్బులు చెల్లించారు. తాజాగా సాహితీ సంస్థ ప్రకటిం చిన 23 ఎకరాల భూమిలో కేవలం 8 ఎకరాలు మాత్రమే సంస్థ పేరిట ఉందని గుర్తించాం. ఇది మోసమని ఆందోళనకు దిగడంతో సంస్థ నిర్వాహకుడు, తితిదే బోర్డు చైర్మన్ లక్ష్మీనారాయణ తమతో సమావేశాన్ని నిర్వహించి సమస్యను పరిష్క రిస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ ప్రయత్నం చేయలేద’ని బాధితులు వాపో యారు. తమకు న్యాయం చేయాలని సీసీఎస్-డీడీ జాయింట్ కమిషనర్ గజరావు భూపాల్ ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈమేరకు కేసు నమోదైంది.

బాక్స్:

కట్టా మీద ఎప్పుడు కేసు.?:

కట్టా ఉమాకాంత్ మొత్తం చేసిన అన్ని భూ కుంభకోణాలపై విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఒకేరోజు ఐదు కంపెనీలు సృష్టించిన ఈ బడా దొంగలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సిసిఎస్ పోలీసులు కట్టా మిత్రద్వయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*