ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

#తెలంగాణ జాతిపిత.

నల్లబెల్లి, నేటి ధాత్రి: తెలంగాణ జాతిపిత స్వరాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు సాధించిన రాష్ట్రాన్ని 10 సంవత్సరంలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70 వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా జడ్పిటిసి పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను వైభవంగా జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ దావఖానలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పెద్ది స్వప్న మాట్లాడుతూ స్వరాష్ట్రాని సాధించుకునే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలోనే ఒక దీటు రాయిగా మారిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నుండి అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలపడం గర్వించదగ్గ విషయమని ఆయన చేసిన త్యాగాలకు సేవలకు ప్రతిమగా తెలంగాణలోని ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర జాతిపితగా అభివర్ణించడం చాలా అరుదు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోరకై ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించి మరొకసారి ఆయన సేవలు రాష్ట్రానికి అందించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా ,ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, క్లస్టర్ ఇన్చార్జిలు ఇంగ్లీశివాజీ, తక్కలపల్లి మోహన్ రావు, ఎంపీటీసీలు జన్ను జయరావు, అజ్మీర లక్ష్మీ సౌమ్య, ఏడాకుల రవీందర్, పాలెపు రవీందర్, బొల్ల శ్రీలత రమేష్, మాజీ సర్పంచులు మామిండ్ల మోహన్ రెడ్డి, లూనావత్ వెంకన్న, తిరుపతి, గన్నెబోయిన చేరాలు గౌడ్, రాము, రవీందర్ రెడ్డి, మండల నాయకులు నన్నేసాహెబ్, ఇట్టే కృష్ణారెడ్డి, ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, పోతులూరి సుభాష్, కస్తూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version