నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి ప్రైమరీ విద్యార్థుల ప్రభంజనం
నర్సంపేట,నేటిధాత్రి:
2025 జనవరి న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా ఈ ఫలితాల్లో నర్సంపేట
పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు పి. అభిరామ్, కే. అశ్విత మరియు వి. హిమబిందులు సీట్లు సాధించారని చైర్మన్ వేముల సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సీట్లు సాధించడం చాలా సంతోషకరమని చైర్మన్ పేర్కొన్నారు.కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దానంతట అదే వస్తుందనే దానికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు.అనంతరం కష్టపడ్డ ప్రతీవిద్యార్ధికి,ఉపాధ్యాయులకు,సహకరించిన పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య రావ్, వైస్ ప్రిన్సిపాల్ విమల,ఇంచార్జి జాగృతి, మాథ్స్ ఉపాధ్యాయులు రాజు, అశోక్, చిరంజీవిలు పాల్గొన్నారు.