Aid for Differently Abled
సిరిసిల్లలో దివ్యాంగులకు రూ.84 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ
భవిష్యత్తులో దివ్యాంగులందరికీ ఉపకరణాలు అందిస్తాం
దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని 466 మంది దివ్యాంగులకు రూ.84 లక్షల విలువైన 813 ఉపకరణాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అవయవ లోపం అనేది బలహీనత కాదని, జీవితాన్ని మరో కోణంలో గెలిచే శక్తిగా భావించాలని సూచించారు. కాళ్లు, చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వా
రు ఎంతోమంది ఉన్నారని, కంటి చూపు లేకపోయినా సమాజంలో వెలుగులు నింపిన మహానుభావులు ఉన్నారని తెలిపారు. దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యమని పేర్కొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.100 కోట్లకు పైగా నిధులు వెచ్చించి పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు.
ADIP (Assistance to Disabled Persons), ALIMCO పథకాల కింద ఈ ఉపకరణాలను అందజేసినట్లు తెలిపారు. గతంలో కరీంనగర్, వేములవాడ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత మంది దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఐఓసీఎల్ సీజీఎం వినీత్ కౌర్, జడ్పీ సీఈవో, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డీఆర్డీవో పద్మయ్య, అలిమ్కో ప్రతినిధి చందన్, దివ్యాంగుల యూనియన్ నాయకుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
