శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భూపాలపల్లిపాఠ్యాంశాలతో పాటు సహా పాఠ్యాంశాల బోధన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయడం జరుగుతుంది. వారందరూ చిత్రలేఖనం చేయడానికి ఆసక్తికరంగా ముందుకు వచ్చారు. రకరకాల అందమైన బొమ్మలు పెయింటింగ్ చేయడం జరిగింది. చిత్రలేఖనం కళలలో ఒకటిగా భావించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వారికి పెయింటింగ్ చిత్రలేఖనం నేర్పించడం జరిగింది. విద్యార్థులు చాలా బాగా ఆసక్తికరంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుభాషిని దేవి విద్యార్థుల చిత్రలేఖనం బొమ్మలను చూసి ఎంతో సంతోషించి ,వారిని ప్రశంసించడం జరిగింది. ఉపాధ్యాయ బృందం కూడా ప్రశంసించారు.