ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లలోనే చిట్యాలను ఉత్తమ గ్రామ పంచాయతీ గా అవార్డు తీసుకోని మృతి చెందిన చిట్యాల గ్రామ దివంగత సర్పంచ్, మాజీ విలేకరి క్రీ శే డాక్టర్ మాసు రాజయ్య జన్మదిన వేడుకలను చిట్యాల మండల కేంద్రం లో ఘనముగా నిర్వహించారు*.ఈ సందర్బంగా డాక్టర్ మాసు రాజయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వహుకులు మాసు రమేష్ మాట్లాడుతూ చిట్యాల మండలం లో 25 సంవత్సరాల పాటు విలేకరిగా పనిచేసి అనంతరం చిట్యాల గ్రామ సర్పంచ్ గా గెలుపొంది అనతి కాలంలోనే చిట్యాల గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిద్దిన వారు చేసిన సేవలు ఎల్లపుడు చిట్యాల గ్రామ ప్రజల మదిలో ఎల్లపుడు ఉంటాయి అని అన్నారు. ఈ రోజు జన్మదిన ము సందర్బంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు బెడ్లు పండ్లు పంపిణి చేయడం జరిగింది అన్నారు*.మాసు రాజయ్య గారి ఆశయాలను తాను కోరుకున్న చిట్యాల గ్రామ అభివృద్ధి ని నెరవేర్చుటకు మేం ఎల్లపుడు కృషి చేస్తాం అని వారు పేర్కొన్నారు. *గతం లో చిట్యాల మండల సమస్యల పైన ఎల్లపుడు పోరాడి మృతి చెందిన మాజీ విలేకరులు క్రీ శే కొత్తూరి రాంరెడ్డి, మాసు రాజయ్య ల జ్ఞాపికర్థం చిట్యాల మండల కేంద్రం లో ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని ఈ సందర్బంగా చిట్యాల ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో రాజన్న కుమారుడు రాకేష్, ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ లు పృద్వి సార్,వివేక్ సార్ ,స్టాఫ్ నర్సులు, రాజన్న అభిమానులు పుల్ల సతీష్ కుమార్,గురుకుంట్ల కిరణ్, రాజేందర్, కోడెల. మహేష్, గుండా దినేష్, టేకు సతీష్, మాటూరి లవన్, కట్కూరి సునీల్, గుర్రపు రాజేందర్,అక్బర్ ఆసుపత్రి సిబ్బంది రాజేందర్, జెట్టి రాజన్న, బుచ్చన్న, అల్లకొండ సారయ్య, కుమార్, శశి కుమార్ త దితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!