భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం ఈనాడు మీడియా సంస్థల చైర్మన్ రామోజీ రావు లేని లోటు తీరనిది అని మహబూబాబాద్ పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి ఎస్కె అజీమ్ అన్నారు.
రామోజీరావు మృతికి టిడిపి ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా టిడిపి నేత ఎస్.కె అజీమ్ మాట్లాడుతూ… మీడియా రంగంలో రామోజీరావు సేవలు మరువలేనివి అన్నారు. నిబద్ధతతో కూడిన పత్రికా విలువలను ఆయన తీసుకొచ్చారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్రను పెంచేందుకు రామోజీరావు చూపిన చొరవ ఆదర్శం అన్నారు. జర్నలిజానికే ఆయన వన్నెతెచ్చారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొడాలి శ్రీనివాసన్, కంభంపాటి సురేష్ కుమార్, కుంచాల రాజా రామ్, తాళ్లూరి చిట్టిబాబు, అబ్బినేని శ్రీనివాసరావు, కోనేరు రాము తదితరులు పాల్గొన్నారు