న్యాల్ కల్ రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు: ఎస్ఐ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గణేష్ పూర్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎస్ఐ సుజిత్ తెలిపారు. మద్యం, డబ్బు, ఇతర అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
