రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్

 • కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించిన మంత్రి  • ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన • త్వరలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోన వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరిన మంత్రి కేటీఆర్ • పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి ఈ విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలి • ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు పూర్తిస్థాయి…

త్వరలోనే లబ్దిదారులకు అందిస్తాం , కేటీఆర్

పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్   హైదరాబాద్,నేటిదాత్రి: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి లబ్దీదారులకు అందిస్తామని రాష్ట్ర పురపాలక,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం బెడ్ రూమ్ ఇళ్ల కార్యక్రమం పైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం మంత్రులు కేటిఆర్,వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి నగర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,…

అవగాహనతోనే కట్టడి సాధ్యం

వరంగల్,నేటిధాత్రి:అవగాహనతోనే కరోనాను అంతం చేసేందుకు సాధ్యమౌతుందని పరికిపండ్ల అశోక్ అన్నారు.ఆదివారం కరోనా కట్టడికి డాక్టర్ పరికిపండ్ల అశోక్ చేపట్టిన ప్రజా చైతన్య బైక్ యాత్ర 25 వ రోజు, నాల్గవ జిల్లా వరంగల్ అర్బన్ లో భాగంగా వరంగల్ మహానగరం 11 వ డివిజన్ క్రిస్టియన్ కాలని గాంధీ నగర్ లో కరోనా పై అవగాహన సదస్సు మరియు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే ఉచిత హోమియోపతి మందుల పంపిణీ చేశారు. ప్రజలు, పారిశుధ్య కార్మికులు సుమారు 1200…

వరంగల్ అజాంజాహి మిల్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం

ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్   నేటిధాత్రి డేస్క్:అజాంజాహి మిల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతుతో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.. అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో మరియు ఎలక్ట్రిక్ సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడారు.. మంటలు ఎలా వ్యాపించాయని…

కర్ఫ్యూ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

పోలీస్ కమిషనర్ డా రవీందర్ కరోనా వ్యాప్తిని ఆడ్డుకోవడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ హెచ్చరించారు. గురువారం లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్య్ సమయంలో యంజియం పోలీస్ చేకింగ్ పాయింట్ వద్ద అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాదారులపై పోలీస్ కమిషనర్ అగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను తక్షణమే సీజ్ చేసి కేసులను నమోదు చేయాల్సిందిగా…

ఎర్రబెల్లి సొంత గ్రామంలో ధాన్యం తగులబెట్టిన రైతులు

కొనుగోలులో జాప్యం,కాంటాలో అక్రమాలే కారణం   వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు వరి ధాన్యాన్ని తగలబెట్టారు. తమ ఇబ్బందులను సంబంధిత ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుంచి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 500 మందికి టోకెన్ ఇప్పటికీ 120 మందికి మాత్రమే కాంటాలు నిర్వహించారని ఇక్కడ బస్తా కు నలభై రెండు…

కమర్షియల్ నిర్మాణాల్లో ‘గోల్ మాల్’

*నగరంలో 60 శాతం పైగా అక్రమ కట్టడాలే* *అనుమతుల్లో జిడబ్ల్యుఎంసి అధికారుల చేతివాటం* *ప్లానింగ్ కు సంబంధం లేకుండా నిర్మాణాలు* *అక్రమ కట్టడాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే అధికం* *తిమ్మిని బమ్మి చేసి ప్రభుత్వానికి పంగనామం పెడుతున్న అధికారులు* *కళ్యాణ లక్ష్మి ఘటనలో అదుపులోకి రాని పరిస్థితులు* *కొనసాగుతున్న అధికారుల ప్రయత్నాలు* నేటి ధాత్రి డెస్క్:నగరాన్ని అభివృద్ధి చేయడంలో నిధుల ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉంటుందో అధికారుల పనితీరు కూడా అంతకు మించి ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సార్యమౌతుండి….

కళ్యాణలక్ష్మిలో చెలరేగుతున్న మంటలు అదుపుచేసేందుకు రంగంలోకి స్కై లిఫ్ట్

వరంగల్ అర్బన్(హన్మకొండ),నేటిధాత్రి:జిల్లాలో ప్రముఖ వస్త్ర దుకాణం కళ్యాణలక్ష్మిలో ఆదివారం మొదలైన అగ్నిప్రమాదం వలన ఏర్పడిన పొగ,మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.ఆదివారమే ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి అగ్నిమాపక సిబ్బంది,గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ కు సంబంధించిన డిఆర్ ఏఫ్ రంగంలోకి దిగి తీవ్రంగా ప్రయత్నించినప్పటికి అగ్నిప్రమాదం చోటుచేసుకున్న నాలుగో ఫ్లోర్ కు వెళ్ళడానికి ఎలాంటి అత్యవసర దారులు గాని లేకపోవడం పొగలు దట్టంగా రావడంతో బిల్డింగ్ పై కప్పుకు రంద్రాలు చేసి అదుపు చేయడానికి ప్రయత్నం…

రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారేడ్డి వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం లో దేవాదుల కాలువమీదుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.రైతును రాజును చేయడమే లక్ష్యమని అని సీఎం కేసీఆర్ అన్నమాటను నిజం చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం మండలం బొల్లికుంట గ్రామం వద్ద దేవాదుల కాలువమీదుగా బొల్లికుంట,ఆశాలపల్లి,రామచంద్రాపురం, గవిచర్ల గ్రామాల మీదుగా కెనాల్ పై ద్విచక్రవానంపై ప్రయాణిస్తూ నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను పరిశీలించారు.త్వరలో పూర్తికానున్న కాలువ నిర్మాణంతో వచ్చే జూన్…

కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

హన్మకొండ,నేటిధాత్రి:ప్రముఖ షాపింగ్ మాల్ కళ్యాణలక్ష్మి హన్మకొండ బ్రాంచీలో అగ్నిప్రమాదం జరిగింది.ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా మూతబడిన షాపింగ్ మాల్ ప్రమాదవశాత్తూ ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది.ఫైర్ సిబ్బందికి విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నప్పటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పేట్ట లేకపోయారు.మాల్లో ఏర్పడిన ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి సరైన మార్గం లేకపోవడంతో చేసేదేమీ మిన్నకుండిపోయారు.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.