కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు..

కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు.. 

shine junior college

 

 

 

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు.

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఆర్య ఇలాంటి వివాదాల్లోనే ఇరుక్కుంటూ  ఉంటాడు. గతంలో ఒక  మహిళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ  పన్ను ఎగ్గొట్టినట్లు గుర్తించిన అధికారులు నేడు ఆయనకు సంబంధించిన  వ్యాపార సంస్థలతో పాటు నివాసంలో కూడా ఐటీ దాడులను నిర్వహించారు. చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులను నిర్వహిస్తున్నారు. 

 

 

 

చెన్నైలోని అన్నా నగర్, కొట్టివాకం వేలచెరి, కిల్పాక్ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి.  ఈ రెస్టారెంట్ చైన్ కు ఆర్యకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో ఈ రెస్టారెంట్స్ అన్నింటిని.. వ్యాపారవేత్త అయినా కున్హి మూసాకు విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  ఇక కున్హి మూసా పై ఐటీ అధికారులు నిఘా పెట్టడంతో అది ఆర్య వరకు తీసుకొచ్చిందని సమాచారం. అందుకే ఆయన ఆఫీస్, ఇంట్లో కూడా అధికారులు  దాడులను నిర్వహించారు. ఇంకోపక్క ఆర్య తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని, అంతేకాకుండా పన్ను కట్టకుండా  తిరుగుతున్నాడని కూడా అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడుల గురించి ఆర్య మాట్లాడుతూ.. ” ఆ రెస్టారెంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రెస్టారెంట్ యజమాని నేను కాదు.. అతను వేరే వ్యక్తి.” అంటూ చెప్పుకొచ్చాడు. 

 

ఇక ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాణి సినిమాతో ఆర్య తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్బింగ్  అవుతూ వస్తుంది.  ఇక ఆర్య ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఆయన చివరగా నిర్మించిన సినిమా ఎనిమీ. విశాల్, ఆర్య నటించిన ఈ సినిమా తమిళ్ లో విజయాన్ని అందుకుంది కానీ తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

 

ఇక ఆర్య.. హీరోయిన్ సయేషా సైగల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సయేషా తెలుగులో అక్కినేని అఖిల్ డెబ్యూ చిత్రంగా వచ్చిన అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక అఖిల్ తరువాత సయేషా తెలుగులో కనిపించలేదు.  ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం సయేషా రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

సీసీ కెమెరాల ఏర్పాట్లతో తలెత్తని సమస్యలు.

సీసీ కెమెరాల ఏర్పాట్లతో తలెత్తని సమస్యలు…

నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతి రెడ్డి

చంద్రయ్యపల్లి గ్రామంలో టౌన్ సీఐ బహిరంగ సమావేశం

నర్సంపేట నేటిధాత్రి:

shine junior college

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ఎలాంటి సమస్యలు తలెత్తవని నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతి రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో టౌన్ సిఐ రఘుపతిరెడ్డి ఆ గ్రామ పంచాయితీ పరిది ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించారు. సిఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నాటు సారాయి తయారీ, అమ్మకాల పట్ల అడిగి తెలుసుకోగా గ్రామపంచాయతీ పరిధిలో గుడుంబా తయారీ అమ్మకం ఏరులై పారుతున్నదని సిఐకి గ్రామస్తులు తెలుపగా అవాక్కయ్యారు. ఎక్సైజ్ శాఖ పోలీసులు మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తారని ప్రజల ఆరోపించారు. గుడుంబా అమ్మకాలు తయారీ పట్ల ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా ఫిర్యాదు చేస్తే వెంకటేష్ స్పందించి చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.యువత మత్తుపదార్థాలకులోనై బంగారు భవిష్యత్తును పడుచేసుకోవద్దన్నారు. పిల్లలు,విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు తో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు.గ్రామ ప్రజలందరి సహకారంతో మరో రెండువారాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఐ రఘుపతిరెడ్డి తెలియజేశారు.ముందుగా గ్రామస్తులు వనభోజనాలకు వెళ్తున్న తరుణంలో సీఐ గ్రామానికి చేరుకోగా మహిళలు బొట్టుపెట్టి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఖాజంఆలీ,గ్రామస్తులు పెద్ది తిరుపతి రెడ్డి, బాషబోయిన శ్రీను, వరంగంటి ప్రవీణ్ రెడ్డి,ఉప్పుల రాజు,మాటేటి రాంబాబు, వంగ పురుషోత్తం, కోమాల్ రెడ్డి, చేరాలు,మల్లయ్య,జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

 

shine junior college

 

 

 

 

 

నాలుగు పదుల వయసులోనూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది త్రిష. అయితే విజయాలు మాత్రం ఆమెను చూసి ముఖం చాటేస్తున్నాయి. ఆమె వరుసగా ఆరు పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది.

 

 

 

 

 

త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఫినిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తూ వస్తోంది. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ను అందిపుచ్చుకుంటూ తన అభిమానులను అలరిస్తోంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ’96’ సినిమాలో కొత్త త్రిషను చూశారు సినీ జనం. ఆమె అభిమానులు సైతం త్రిషలోని ఆ క్యూట్ యాంగిల్ ను చూసి అవాక్కయ్యారు. మళ్ళీ మరోసారి ఆమెను ఆరాధ్యదేవతగా కొలవడం మొదలు పెట్టారు. అలా త్రిష తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత లాంగ్ రన్ కెరీర్ ను ఎంజాయ్ చేసిన హీరోయిన్లు పెద్దంతగా కనబడటం లేదు.

 

 

 

 

 

 

 

 

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలలోనూ త్రిష కీలక పాత్రలను పోషించింది. ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత దూళిపాళ్ల తదితరులు ఇందులో నటించినా… వీరందరి కంటే త్రిష పాత్రకే అత్యధిక ప్రాధాన్యం ఆ రెండు భాగాల్లోనూ ఉంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఘన విజయం సాధించకపోయినా… ఫర్వాలేదనిపించింది. అయితే… ఆ తర్వాత వరుసగా త్రిష పరాజయాలనే చవిచూస్తూ వచ్చింది. ‘పొన్నియన్ సెల్వన్ -2’ తర్వాత వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘ది రోడ్’ పరాజయం పాలైంది. ఉమెన్ సెంట్రిక్ గా తెరకెక్కిన ఈ సినిమా త్రిషకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన దళపతి విజయ్ ‘లియో’ సైతం త్రిషను నిరాశ పర్చింది. విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా మూవీకి ఓపెనింగ్స్ వచ్చినా… అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

 

 

 

 

 

 

 

 

విజయ్ మరో సినిమా ‘గోట్’లో త్రిష అతిథిపాత్రలో మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఫర్వాలేదనిపించింది కానీ ఆ విజయాన్ని త్రిష ఖాతాలో వేయలేదు. ఇక ఆ తర్వాత మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’లో త్రిష కీలక పాత్రను పోషించింది. ఇది కూడా ఎబౌ ఏవరేజ్ మూవీగానే ఉండిపోయింది. దీని తర్వాత అజిత్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో త్రిష నటించింది. అందులో మొదటిది ‘విడుముయార్చి’ కాగా రెండోది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దాంతో ఈ యేడాది వచ్చిన మూడు సినిమాలూ త్రిషకు బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ నే ఇచ్చాయని చెప్పాలి.

 

 

 

 

 

 

 

 

 

 

ఈ యేడాది త్రిష నటించిన నాలుగో చిత్రంగా ఇటీవలే ‘థగ్ లైఫ్’ వచ్చింది. కమల్ హాసన్ తోనూ, శింబుతోనూ గతంలో త్రిష సినిమాలు చేసింది. అలానే మణిరత్నం తోనూ ‘పొన్నియన్ సెల్వన్’ చేసింది. అయితే ఈ అందరూ మళ్లీ కలిసి చేసిన ‘థగ్ లైఫ్’ కూడా ఘోర పరాజయం పాలైంది. దాంతో త్రిష ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ పూర్తి చేసినట్టు అయ్యింది. ఈ యేడాది ఆమెకు ఇది వరుసగా నాలుగో పరాజయం.

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రస్తుతం త్రిష… మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ మూవీలో చేస్తోంది. గతంలో ‘స్టాలిన్’లో కలిసి నటించిన త్రిష చాలా కాలం తర్వాత ఈ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ ఆలస్యమైపోయింది. ఎప్పుడు విడుదల అయ్యేది ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు. మరి ‘విశ్వంభర’ తో త్రిష తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే.

*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే
ఆదేశాల మేరకు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు వెంకటేశం*

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం పట్టణ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ & ఝరాసంగం మండలానికి వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు గాను ₹2,79,000 విలువ గల చెక్కులను ,మాజి సర్పంచ్ శంకర్ ,మాజి ఎంపీటీసీ సంతు పటేల్ ,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది. లబ్ధిదారుల వివరాలు:
బాగారెడ్డి పల్లి కి చెందిన మొగుల్లయ గారికి ₹.15,000/-, కుప్పనగర్ కి చెందిన సంధ్య రాణి గారికి ₹.40,500/-,& సతీష్ గారికి ₹.15,000/-,
ఝరసంఘం కి చెందిన నాగరాణి గారికి ₹.25,500/- జోనగామ కి చెందిన సంగాన్న గారికి *₹.15,000/- తుమ్మన్ పల్లి కి చెందిన ఫకీర్ బాబు గారికి ₹.43,500/- బర్దిపూర్ కి చెందిన నర్సింలు గారికి ₹.600,000/-, సిద్దాపూర్ కి చెందిన స్వరూప గారికి ₹.45,000/- ఈదులపల్లి కి చెందిన మంజుల గారికి ₹.19,500/-..ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య.

వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య

వనపర్తి నెటిదాత్రి:

shine junior collegeవనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య నియామకం అయ్యారు .వనపర్తి వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతల ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు .ప్రధాన కార్యదర్శిగా డి బాలరాజ్ కోశాధికారిగా ఏర్పుల చిన్నయ్య కార్యదర్శిగా గంధం రాజు కోమరి పుల్లూరి విశ్వనాధం దస్తగిరి ఉపాధ్యక్షులుగా పోలేపల్లి బాలయ్య నియామకం అయ్యారు ఈ సందర్భంగా పార్లమెంట్ నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షున్ని కమిటీ సభ్యులను అభినందించారు వారికి దిశా నిర్దేశం చేస్తూ వనపర్తి పట్టణంలో అన్ని వార్డులు పర్యటించి వార్డులో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారులకు తెలపాలని ప్రజల సమస్యలు పరిష్కరించుటకు కృషి చేయాలని సూచించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని గైర్హాజరు కాకుండా కమిటీ నాయకులు పాల్గొన్నారు సూచించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల కొరకు పనిచేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమావేశాలకు మూడు నెలలు రాకుంటే వారి వారి పదవిని తొలగిస్తామని రాములు తెలిపారు తెలుగుదేశం పార్టీ ని దివంగత ఎన్టీ రామారావు స్థాపించారని బడుగు బలహీన వర్గాలకు పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు వనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని ఓటు బ్యాంకు కూడా ఉన్నదని స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థులను ఉంచుతామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో హోటల్ బలరాం ఫారుక్ ఎండి దస్తగిరి శంకర్ ఆవుల శ్రీను అప్పయపల్లి బాలయ్య చిట్యాల బాలరాజు ఉపేంద్ర బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

shine junior college

 

 

 

 

 

 

బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో క్షీణత కనిపిస్తోంది

 

 

 

బంగారం (gold), వెండి (silver) ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువలో ట్రేడ్ అవుతున్నాయి. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో క్షీణత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జూన్ 18న) ఉదయం 6.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1, 00, 360కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 91, 990కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు వెయ్యి రూపాయల మేర బంగారం ధర తగ్గింది.

 

 

 

 

 

 

 

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 00, 510కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 92, 140కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 00, 360కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 91, 990కి చేరింది. వెండి ధరలు కేజీకి రూ100 మేర పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

 

 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • విజయవాడలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • ఢిల్లీలో రూ. 1, 00, 510, రూ. 92, 140
  • ముంబైలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • వడోదరలో రూ. 1, 00, 410, రూ. 92, 040
  • కోల్‌కతాలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • చెన్నైలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • బెంగళూరులో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • కేరళలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • పుణెలో రూ. 1, 00, 360, రూ. 91, 990

 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 1, 20, 100
  • విజయవాడలో రూ. 1, 20, 100
  • ఢిల్లీలో రూ. 1, 10, 100
  • చెన్నైలో రూ. 1, 20, 100
  • కోల్‌కతాలో రూ. 1, 20, 100
  • కేరళలో రూ. 1, 20, 100
  • ముంబైలో 1, 10, 100
  • బెంగళూరులో రూ.1, 10, 100
  • వడోదరలో రూ. 1, 10, 100
  • అహ్మదాబాద్‌లో రూ. 1, 10, 100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

 

 

గూగుల్ సేఫ్టీ సెంటర్..ప్రారంభించిన సీఎం రేవంత్

ఆసియాలో తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్..ప్రారంభించిన సీఎం రేవంత్

shine junior college

 

 

 

 

 

 

చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతమని.. ఈ విధానాన్ని తాను ఇష్టపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గూగుల్‌లా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు.

 

 

 

 

 

 

 

హైదరాబాద్, జూన్ 18: గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (బుధవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రపంచంలో ఐదవది మాత్రమే అని తెలిపారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని.. నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌గా మారాయన్నారు. గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ‘మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్‌గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాము’ అని చెప్పుకొచ్చారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. ఇది నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు.

 

 

 

 

 

 

ఉపాధిని సృష్టించడంతో పాటు దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతమని.. ఈ విధానాన్ని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపారు. గూగుల్‌లా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయని.. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడికి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందన్నారు. సెర్చ్‌లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుందని సీఎం అన్నారు. దీనిని తెలంగాణ రైజింగ్ అని పిలుస్తామని… 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

గూగుల్ ఆఫీస్ పక్కన రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని.. రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నామని తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు గూగుల్ మద్దతు కావాలని.. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నామన్నారు. గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులన్నారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ట్రాన్స్‌జెండర్లకు చేయూత

విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు. గూగుల్ ఒక వినూత్న సంస్థ, తమది ఒక వినూత్న ప్రభుత్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలు ట్రాన్సజెండర్స్ ని నిర్లక్ష్యం చేశాయన్నారు. జీహెచ్‌ఎంసీ కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించుకుంటోందన్నారు. నాణ్యమైన విద్య తమ లక్ష్యమని.. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అందరికీ ఆరోగ్యమే లక్ష్యం

తెలంగాణలో ప్రతీ సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్‌ల నుంచి వస్తున్నారని… చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ ఆరోగ్యం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవే తన ప్రధాన ఆవిష్కరణలన్నారు. ‘గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాను. మనం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దాం. హైదరాబాద్‌లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని విశ్వసిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు.

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు

⏩ అర్హులకు అందని సంక్షేమ పథకాలు.
⏩ పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు.

సుంకరి మనిషా శివకుమార్. 16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి:

shine junior college

గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ గరీబ్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరిగాయి అని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో స్థానిక పరకాల ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,తన అనుచరులకు మాత్రమే కేటాయించి అసలైన అర్హులను విస్మరించారు అని,గతంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరు అయి ప్రొసీడింగ్స్ అందుకునే లోపు ప్రభుత్వం మారడంతో ఇంటి నిర్మాణ పిల్లర్లు సైతం నిర్మించుకున్న వికలాంగురాలు నిరాశ్రయురాలు అయింది అని ఆవేతరం వ్యక్తం చేశారు. పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు అందిస్తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పాడని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల అమలు కోసం ప్రజలతో కలసి పోరాడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు పోగుల సంజీవ,గ్రామ పార్టీ నాయకులు బొజ్జం తిరుపతి,నరసింహ,SbK అంజాద్,బొంత.రవి,ఏడాకుల మోహన్ రెడ్డి,రాజారాం,కన్నేబోయిన.రాజు,మెండురామకృష్ణ,రాజేందర్,మురళి,యశోద,అశోక్,చిరు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

రోహిత్ శర్మ రికార్డ్ సమం..

రోహిత్ శర్మ రికార్డ్ సమం.. అద్భుత సెంచరీ సాధించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

 

shine junior college

 

 

 

 

 

 

చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి.

 

 

 

 

 

 

 

చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఆడుతున్న మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీతో అలరించాడు (Glenn Maxwell Century). ఈ క్రమంలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

 

 

 

 

 

 

 

 

 

మేజర్ లీగ్ క్రికెట్ లీగ్‌-2025లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు కెప్టెన్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాక్సీ తన ఇన్నింగ్స్‌లో 13 భారీ సిక్సర్లతో పాటు 2 ఫోర్లు కూడా కొట్టాడు. మొత్తానికి 49 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇది మ్యాక్స్‌వెల్ టీ20 కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్.. రోహిత్ శర్మ, జోస్ బట్లర్ సరసన చేరాడు.

 

 

 

 

 

 

 

రోహిత్, బట్లర్, ఫించ్, వార్నర్ కూడా ఎనిమిదేసి టీ-20 సెంచరీలు సాధించారు. అలాగే టీ-20ల్లో 10, 500 పరుగులు, 170 కంటే ఎక్కువ వికెట్లు, 5 కంటే ఎక్కువ సెంచరీల చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డును మ్యాక్స్‌వెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ-20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ తర్వాత పాకిస్తాన్ బాబర్ ఆజామ్ (11) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన రౌలీ రూసో, విరాట్ కోహ్లీ తొమ్మిదేసి సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం చేపట్టనైనది. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం మరియు ఎం.ఈ.ఓ అధ్యక్షత వహించగా దూస రఘుపతి ఎం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందించడం ఒక మంచి కార్యక్రమం అని తెలియజేశారు అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో విద్య ద్వారా అభివృద్ధి చెందాలని కోరడం జరిగినది. స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు కోమాకుల ఆంజనేయులు,కార్యదర్శి శ్రీపతి కాశీరాం సభ్యులు నవీన్ గోవర్ధన్, సతీష్, రమేష్ తదితరులు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించినారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ కార్యదర్శి మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో ఫౌండేషన్ స్థాపించామని 2011 నుండి వెంకంపేట పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నమని తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగించుటకు పాఠశాల అధ్యాపక బృందాన్ని కోరడమైనది. సంస్థ సభ్యులు ఇకముందు కూడా ఇదే విధిగా కొనసాగించడానికి అంగీకరించినారు ..కావున పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్ఫూర్తి ఫౌండేషన్ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇకముందు కొనసాగించాలని పాఠశాల అధ్యాపకులు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్.ఎం రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయినీలు పద్మ, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ అగ్రపీఠంపై మంధాన

మళ్లీ అగ్రపీఠంపై మంధాన

shine junior college

 

ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం…
దుబాయ్‌: ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో స్మృతి 727 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీ్‌సలో 52 సగటుతో 264 పరుగులు సాధించడంతో ఆమె ర్యాంక్‌ మెరుగుపడింది. బ్రంట్‌ (ఇంగ్లండ్‌), లారా వోల్వార్ట్‌ (దక్షిణాఫ్రికా) 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో ఎకెల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), గార్డ్‌నర్‌ (ఆస్ట్రేలియా), మేగాన్‌ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్‌) తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

పీఎం-కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్..

పీఎం-కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్..

 

shine junior college

 

 

 

దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది.

 

 

దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan). రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఏడాదికి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తోంది. విడతకు రూ.2 వేలు చొప్పున ఏడాదిలో మూడు సార్లు అందిస్తోంది (PM-KISAN 20th instalment).

 

 

ఇప్పటి వరకు 19 విడతల్లో రూ.2 వేల చొప్పున కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లోకి 20వ విడత పీఎం-కిసాన్ నిధులు జమ అవుతాయని సమాచారం.

 

 

 

 

 

మరి, ఈ 20వ విడత పీఎం-కిసాన్ నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా రెండు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండడం. రెండోది బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఉండడం. ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే పీఎం-కిసాన్ డబ్బులు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా ఈ రెండు పనులను పూర్తి చేసుకోవాలని రైతులకు అధికారులకు సూచిస్తున్నారు.

124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత..

124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత..

shine junior college

 

 

 

 

 

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతోన్నాయి. ఇప్పటి వరకు 124 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.

 

 

 

 

 

 

అహ్మదాబాద్, జూన్ 18: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షల నిర్వహణ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు 163 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 124 మృతదేహాలను అంత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరికొన్ని మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి.

 

 

 

 

 

 

అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మృతదేహానికి ఈ పరీక్ష నిర్వహించేందుకు దాదాపు 75 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియ చాలా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. డీఎన్‌ఏ గుర్తించే క్రమంలో ఫోరెన్సిక్ బృందాలు నిరంతరాయంగా తమ పనిని కొనసాగిస్తున్నాయి.

 

 

 

 

ఇక ఈ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాంతోపాటు ఈ విమానం కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతదేహాన్ని సైతం వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలను అంత్యక్రియలు సైతం పూర్తయ్యాయి.

 

 

 

 

 

 

 

మరోవైపు ఈ ప్రమాద ఘటన అనంతరం గాయపడిన 71 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి వెల్లడించారు. వారిలో ఇద్దరు మరణించారని.. మిగిలిన తొమ్మిది మందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వివరించారు.

 

 

 

 

 

 

 

జూన్ 12వ తేదీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు టేకాఫ్ అయింది. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకు మేఘానీనగర్‌లో కుప్పకూలి దగ్ధమైంది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మినహా అందరూ మరణించారు. అలాగే ఈ విమానంలో 12 మంది సిబ్బంది సైతం మృతి చెందారు. ఈ విమానం బీజే హాస్టల్‌పై పడడంతో.. ఆ సమయంలో భోజనం చేస్తున్న 29 మంది మెడికోలు సైతం మరణించారు. పలువురు మెడికోలు సైతం ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గోల్కొండ బోనాలు వైభవంగా నిర్వహిస్తాం..

గోల్కొండ బోనాలు వైభవంగా నిర్వహిస్తాం..

shine junior college

 

 

 

 

ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

 

 

హైదరాబాద్: ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Hyderabad In-charge Minister Ponnam Prabhakar) తెలిపారు. మంగళవారం గోల్కొండ పోర్టులో జరిగిన కార్యక్రమంలో బోనాలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి తొలి బోనాల పండగ ప్రారంభమవుతుందని, ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

 

ఈ ఉత్సవాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) నిధులు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాల అమ్మవార్లకు ప్రభుత్వం తరుఫున పట్టు వస్ర్తాలను సమర్పిస్తామని మంత్రి తెలిపారు. నెలరోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాల్లో గోల్కొండ కోటకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.

 

 

 

వారికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ హరిచందన, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, గోల్కొండ బోనాల ఆలయ కమిటీ ఛైర్మన్‌ చంటిబాబు, ఫిష్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, సౌత్‌వె్‌స్టజోన్‌ డీసీపీ చంద్రమోహన్‌, తహసీల్దార్లు జ్యోతి, అహల్య, తదితరులు పాల్గొన్నారు.

ఆలయం అభివృద్ధికి కృషి చేసిన అశోక్.

ఆలయం అభివృద్ధికి కృషి చేసిన అశోక్

భూపాలపల్లి నేటిధాత్రి:

shine junior college

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఫ్లోరింగ్ చేయించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు దుర్గం అశోక్ ఆలయం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు మొలిసినాయి భక్తులకు దర్శనానికి ఇబ్బందిగా ఉంది ఈ విషయాన్ని గమనించిన దుర్గం అశోక్ భక్తుల కోరిక మేరకు ఆలయం చుట్టుపక్కల సిమెంట్ కంకరతో ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. గ్రామస్తులు అశోక్ కు అభినందనలు తెలియజేశారు రాబోయే రోజులలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు

ఏకగ్రీవంగా రెండు గ్రామాలకు నూతన కమిటీ లా ఏర్పాటు.

ఏకగ్రీవంగా రెండు గ్రామాలకు నూతన కమిటీ లా ఏర్పాటు

ఏడపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చేకూర్తీ శ్రీనివాస్

సూరారం గ్రామ శాఖ అద్యక్షులు అయిల్ల అశోక్

బెల్లంపల్లి సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండల ఇన్చార్జి అంబల చంద్రమౌళి ఆదేశాల మేరకు మహాదేవపూర్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ ఆధ్వర్యంలో మండలంలో రెండు గ్రామాలకు నూతన గ్రామ కమిటీ వేయడం జరిగింది ఎడపల్లీ
గ్రామ శాఖ అధ్యక్షులుగా చేకుర్తి. సూరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ఆయిల్ల అశోక్ ఎన్నికైనారు అనంతరం కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది
శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గా చేకుర్తి రాజ లింగయ్య కార్యదర్శి చేకూర్తి రాజబాబు ప్రధాన కార్యదర్శి చేకుర్తి రాజయ్య కోశాధికారి ఆయిల్ల మహేష్ సూరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ఆయిల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి మండపల్లి విష్ణు కార్యదర్శి మీసాల సాంబం కోశాధికారి జిల్లెల అజయ్ ప్రచార కార్యదర్శి జిల్లేల రాజు వీరిని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశాలతో జులై 7న ఊరు ఊరులో దండోరా జెండా ఎగురవేసి సంబరాలు చేసుకోవాలని సామాజిక న్యాయం సాధించిన మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని కూడా జరుపుకోవాలని ఏబిసిడి వర్గీకరణ సాధించి పద్మశ్రీ అవార్డు తీసుకున్న మందకృష్ణ మాదిగ అని బెల్లంపల్లి సురేష్ మాదిగ అన్నారు ఈ గ్రామాల ఎన్నిక కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆయిల సమ్మ య్య తోటచర్ల దుర్గయ్య జిల్లెల్ల నాగరాజు చింతకుంట్ల రాము చింతకుంట సదానందం చేకుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు .

బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

shine junior college

 

 

 

 

 

Bomb Threat: బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

 

హైదరాబాద్, జూన్ 18: బేగంపేట ఎయిర్‌పోర్టుకు (Begumpet Airport) బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat) తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఉదయం (బుధవారం) 10:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌‌కు సమాచారం ఇవ్వగా.. వెంటనే వారు అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. విమానాశ్రయంలోని ఉద్యోగులందరినీ బయటకు పంపించి బాంబు స్క్వాడ్, ఎస్పీఎఫ్ పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు.

 

 

అయితే విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని.. అదంతా ఫేక్ కాల్‌గా బాంబు స్క్వాడ్ గుర్తించింది. కాల్ చేసిన నెంబర్ ఆధారంగా ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డి తన వ్యక్తిగత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త కె. ప్రసాద్ రెడ్డి ఈరోజు తన వ్యక్తిగత ఖర్చుతో, కోహిర్ మండలంలోని సజాపూర్ గ్రామంలోని అమీరి పాఠశాలకు అనుబంధంగా ఉన్న 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రి, ముఖ్యంగా నోట్‌బుక్‌లు మరియు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, విద్యార్థులు విద్య ద్వారా మాత్రమే పురోగతి సాధించగలరని మరియు సమాజంలో మంచి పౌరులుగా నిరూపించుకోగలరని ఆయన అన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటే వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలనే తన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశానని ఆయన అన్నారు. ఈ చొరవకు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కె. ప్రసాద్ రెడ్డిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

shine junior college

 

 

 

రామేశ్వరం ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

 

 

 

 

చెన్నై: రామేశ్వరం(Rameshwaram) ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి(Rameshwaram Ramanathaswamy Temple) రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు ఆ ఆలయంలో సులువుగా దైవదర్శనం చేయలేకపోతున్నారు. ఈ కారణంగా కొన్ని దశాబ్దాలకు పూర్వమే రామేశ్వరం ఆలయంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించే వారి కోసం ప్రత్యేకంగా క్యూలైన్‌ ఉండేది.

 

 

 

 

ఆ క్యూలైన్‌లో వెళ్ళి స్థానికులు సులువుగా దర్శనం చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి డిప్యూటీ కమిషనర్‌ చెల్లదురై బాధ్యతలు చేపట్టినప్పటి నుండి స్థానికుల క్యూలైన్‌ తొలగించారు. స్థానికులు ధర్మదర్శనం (సర్వదర్శనం) క్యూలైన్‌లోనే రావాలని ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆలయ నిర్వాహకులపై స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటీవల రాజీ చర్చలు కూడా జరిగాయి. కానీ ఆలయ అధికారులు గతంలా ప్రత్యేక క్యూలైన్‌లో స్థానికులను అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు.

 

 

 

 

 

 

 

 

ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ మంగళవారం ఉదయం రామేశ్వరం నగరంలోని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వేల సంఖ్యలో స్థానికులు ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వైపు దూసుకొచ్చారు. ఆ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన కారణంగా ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

రేపు టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ విజయవంతం.

రేపు టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ
విజయవంతం చేయాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి

మంచిర్యాల జూన్ 18 నేటిదాత్రి:

shine junior college

 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఈనెల 20వ తేదీన నస్పూర్ లోని ప్రెస్ క్లబ్ లో జరుగుతుందని ఫెడరేషన్ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో-కన్వీనర్లు కె.వెంకటస్వామి, గడ్డం సత్యగౌడ్ తదితరులు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఫెడరేషన్ రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్లొంటారని వారు పేర్కొన్నారు. జిల్లాలో సంఘం నిర్మాణం, సభ్యత్వం, జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై ఈ సందర్భంగా మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిచనున్నట్టు తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో విరివిగా సభ్యత నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న విలేకరులు స్వచ్ఛందంగా సంఘంలో సభ్యత్వం తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ మహాసభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తో పాటు రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాత్రికేయ మిత్రులను మహాసభకు సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లాలోని ఫెడరేషన్ సభ్యులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు భాస్కర్, చంద్రమౌళి  పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version