టాప్ గేర్ లో కారు.. హోరెత్తిన చేరికల జోరు..

#బీఆర్ఎస్ పార్టీలో చేరికల సునామీ

వెంకటాపూర్, నేటిధాత్రి:
ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో వెంకటాపూర్ మండల ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 20 ముదిరాజ్ కుటుంబాలు మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జినుక సుదర్శన్, మల్లెబోయిన కొమురయ్య, కట్ల శ్రీనివాస్, బండి సారయ్య, డి రాజు, మండల కనకయ్య, డి చేరాలు, కనుకుంట్ల కోమల, డి కేతమ్మ, బుజ్జం రాజేష్, పోలుదాసరి రాధిక, మండల సాంబయ్య, రఘు, ప్రవీణ్, నరేందర్, అనూష, జినుక సుధాకర్, రాజయ్య, కుమార్, బండి బిక్షపతి, డి కొమురయ్య, కొంతం వెంకట్ రామ్ నరసయ్య, డి వెంకటస్వామి, మండల రవీందర్, సదయ్య, శ్రీను, సాంబయ్య, మల్లెబోయిన రాజక్క, కొంతం రమ, కొంతం ధనంజయ, మండల శ్రీకాంత్, మల్లెబోయిన వెంకటక్క, పోలుదాసరి సారయ్య, సౌందర్య, జినుక కిష్ట సామి, ఒజ్జల అనసూర్య, జినుక కూరక్క, పెండ్యాల శ్రీలత, డి భాగ్యక్క, మండల ప్రసన్న, డి శ్రీనివాస్, నీరజ, మండల కోమలతో పాటు 60 మంది చేరగా వారిని సాదరంగా ఆహ్వానించారు. చేరిన కుటుంబాలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని బడే నాగజ్యోతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించండని, సీఎం కేసీఆర్ గారిని మరోసారి ఆచరించండని అన్నారు. ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని ఆదరించండి ఆహ్వానించండి మరింత అభివృద్ధి చేద్దాం ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి ఫలాలు ముదిరాజులకు మన కేసీఆర్ గారు అందిస్తున్నారని కొనియాడారు. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయలు వంటి పథకాలతో కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రతి గడపగడపకు తీసుకుపోయి ప్రజలను చైతన్య పరచాలని, కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లలో ఏమి చేయలేదని మళ్లీ గెలిస్తే చెయ్యబోయేది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో కరెంట్ కష్టాలు రైతులకు తెలుసని, నేడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ అమలు చేయబోతున్నారని అన్నారు. ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికలు ఇంచార్జ్ సమ్మరావు, ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య గౌడ్, జడ్పిటిసి గై రుద్రమదేవి అశోక్, ములుగు ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు కోళ్ల వెంకన్న, తిమ్మాపూర్ సర్పంచ్ శాతరాజు స్వప్న శ్రీధర్ రావు, ఉపసర్పంచ్ మహమ్మద్ రుక్య అస్లాం పాషా, గ్రామ కమిటీ అధ్యక్షులు బిక్షపతి, జిల్లా రైతుబంధు కమిటీ సభ్యులు, మాజీ మండల అధ్యక్షులు రామంజపూర్ క్లస్టర్ ఇంచార్జి కూరెళ్ళ రామాచారి, మండల సమన్వయ కమిటీ సభ్యులు సాదా యాదగిరి, అబ్బాపూర్ సర్పంచ్ గండి కుమార్, వెంకటాపూర్ పట్టణ అధ్యక్షులు నర్ర భద్రయ్య, నర్సాపూర్ ఉపసర్పంచ్ సాదు రాజు, మెట్టు సురేష్, కొంతం రాజయ్య, రామంజపూర్ వార్డ్ సభ్యులు బామిండ్లపల్లి అనిల్, సర్పంచ్ మోరే రాజన్న, మండలంలోని ముదిరాజ్ సోదర సోదరిమణులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!