దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ

రెండోతరం నాయకులను తయారుచేస్తున్న సీనియర్‌ నాయకత్వం

నాయకత్వ కొరత లేకుండా వ్యూహాత్మక అడుగులు

ఛరిష్మా నాయకులున్నా పార్టీకే ప్రాధాన్యం

గట్టి సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ

రెండో తరం నాయకులను ఎదగనీయని కాంగ్రెస్‌

నాయకుల ఛరిష్మాపై ప్రాంతీయ పార్టీల మనుగడ

సంస్థాగత బలహీనతలతో కునారిల్లుతున్న విపక్షాలు

ప్రాంతీయ పార్టీల కోటలు కూల్చే వ్యూహాలతో బీజేపీ ముందడుగు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఢల్లీికి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్‌కు మోహన్‌యాదవ్‌, మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్య మంత్రులను చేయడం ద్వారా, ప్రస్తుత రాజకీయ ప్రయోజనాలను సుదీర్ఘకాలం కొనసాగించేం దుకు చక్కగా అడుగులు ముందుకేస్తున్నదన్న సత్యం బోధపడుతోంది. అంతేకాదు కేంద్రంలో సీనియర్‌ నాయకత్వం బలంగా వున్నప్పుడే ఈవిధంగా సెకండ్‌ లైన్‌ నాయకులకు కీలకస్థానాలు అప్పగించి, ఏవైనా సమస్యలు వస్తే తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఆయా నాయకత్వాలను బలోపేతం చేయడం ద్వారా పార్టీలో నాయకత్వ కొరత లేకుండా చేయడంలో భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మక ఆచరణశైలి అద్భుతమనే చెప్పాలి. ఇది దేశంలోని మిగిలిన రాజకీయ పార్టీల్లో కని పించడం లేదు. 

బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా నాయకులను ఎంపిక చేసిన తర్వాత వారికి పూర్తి అండగా నిలుస్తోంది. ఎవరైనా నాయకుల్లో అసంతృప్తి వున్నా, ముఖ్యమంత్రికి వ్య తిరేకత వ్యక్తమవుతున్న సందర్భాల్లో ఎప్పటికప్పుడు కేంద్రం కలుగజేసుకొని సర్దుబాటు చేయడ మే కాదు, పార్టీ దిగువస్థాయి నాయకత్వంతో పాటు, కార్యకర్తలు కూడా ఆయా ముఖ్యమంత్రులనాయకత్వంలో పనిచేసేవిధంగా చర్యలు తీసుకుంటోంది. ఆవిధంగా కేంద్రంలో, రాష్ట్రాల్లో బల మైన నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం వల్ల, దేశం మరియు రాష్ట్రాల్లో సామాజిక ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేయగలదు. 

అదే కాంగ్రెస్‌ విషయానికి వస్తే అసలు రెండోతరం నాయకులను ఎదగనిచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ అన్ని ప్రతికూలతలను తట్టుకొని ఎదగాలని యత్నించినా యధాశక్తి వాళ్లను బలహీనపరచేవరకు కేంద్ర నాయకత్వం నిద్రపోదు. రాహుల్‌ గాంధీ, ఆయన సలహాదార్లు కూడా గత పదేళ్లుగా ఇదే వ్యవహారశైలి అనుసరిస్తున్నారు. సచిన్‌ పైలెట్‌, మనీష్‌ తివారీ, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, అశోక్‌ గెహ్లాట్‌, భూపేంద్రసింగ్‌ హూడా వంటి నాయకుల వ్యవహారశైలివల్ల పార్టీ ఎప్పటికప్పుడు బల హీనపడటం తప్ప మరో ప్రయోజనం ఏమీ వుండటంలేదు. 

గత లోక్‌సభ మరియు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే నరేంద్రమోదీ, అమిత్‌ షాల వ్యూహం ఎంతచక్కగా పనిచేస్తున్నదీ అర్థమవుతుంది. అటల్‌`అద్వానీ కాలంలో మాదిరిగా రెండోతరం నాయకులు పార్టీలో ఎదగడంలేదని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి యుగంలో అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, కళ్యాణ్‌ సింగ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌లకు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ల భించింది. అదేవిధంగా ప్రస్తుత నరేంద్రమోదీ హయాంలో అమిత్‌ షా, జె.పి.నడ్డా, యోగి ఆది త్యనాథ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌ లాల్‌ కట్టర్‌, రమణ్‌సింగ్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌, మో హన్‌ యాదవ్‌, భజన్‌లాల్‌ శర్మ, విష్ణుదేవ్‌ సాయి, నాయబ్‌ సింగ్‌ సైనీ వంటి నాయకులకు అ త్యంత ప్రాధాన్యతనిస్తూ పార్టీ బలోపేతానికి అవసరమైన భూమికను రూపొందిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌ పనితీరు ఆధారంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంలో స్థానం కల్పించడమే కాకుండా సంస్థాగతంగా కూడా సముచిత స్థాయిలో నిలిపారు. ఇప్పుడు మోహన్‌ యాదవ్‌ వంటి నాయకులు క్షేత్రస్థాయి నుంచి సమర్థవంతమైన నాయకులుగా రూపొందడమే కాదు, పరిపాలన పై గట్టి పట్టు సాధిస్తున్నారు. అంతేకాదు వీరు ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సంస్థాగత నాయకుడి స్థాయిని దాటి ఎదిగిపోయారు. ప్రస్తు తం ముఖ్యమంత్రిగా పాలన, శాంతిభద్రతలపై గట్టి నియంత్రణ సాధించారు. మతపరమైన అంశాలపై ఒక మహంత్‌గా తన స్పష్టమైన ముద్రను సమాజం పై వేయగలిగారు. అయోధ్య, కాశి, మధుర, వంటి అంశాలపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కుంభ్‌మేళాను సమర్థవం తంగా నిర్వహిస్తున్నారు. 

ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే గత రెండుదశాబ్దాలో దాని నాయకత్వ వైఖరిలో మార్పు లేశమాత్రం కూడా కనిపించడంలేదు. పార్టీ యావత్తు గాంధీ కుటుంబంపైనే ఆధారపడివుంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా పదేళ్లు పనిచేశారు. కానీ మాస్‌ లీడర్‌గా లేదా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నాయకుడిగా గుర్తింపు లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత రాజ్యసభ ద్వారా ఆయన్ను పార్టీ ప్రధానిని చేసింది. అసలాయనకు కాంగ్రెస్‌ సంస్థపైనే పెద్దగా ఆసక్తి లేదు.

గాంధీ కుటుంబం చేసిందేమంటే సొంతపార్టీలోనే ప్రత్యర్థి రాజకీయాలను ఎగదోయడం. అర్జున్‌సింగ్‌, దిగ్విజయ్‌సింగ్‌, కమల్‌నాథ్‌, మాథవరావు సింథియా, జ్యోతిరాదిత్య, అశోక్‌ గెహ్లాట్‌, రాజేష్‌ పైలెట్‌, భూపేంద్రసింగ్‌ హూడా, వీరేంద్రసింగ్‌, కుమారి షెల్జా మొదలైన నాయకుల పక్క లో అసంతృప్తులను ఎగదోసి వారిని సుస్థిరపాలన చేయనీయలేదు. ఫలితంగా ఇటువంటి నాయకులు క్షేత్రస్థాయిలో ఏనాడు బలోపేతం కాలేకపోయారు. పార్టీలో వృద్ధ నిజాయతీ నాయకుడు ఎ. కె. అంటోనీ పార్టీ వరుస ఓటమికి కారణాలపై ఇచ్చిన నివేదిక నాయకత్వాన్ని నైరాశ్యంలో ముంచింది.

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌లు ఎంత విరోధులుగా వుంటే పార్టీ అధిష్టానానికి అంత లాభం. మల్లికార్జున ఖర్గే పేరుకే పార్టీ అధ్యక్షులు. నిర్ణయాలన్నీరాహుల్‌ గాంధీ, వేణుగోపాల్‌, జయరామ్‌ రమేష్‌లవే. ఇప్పుడు ప్రియాంకా గాంధీ వాద్రా తన టీమ్‌కు ప్రాధాన్యతనిస్తారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శిబు హేమంత్‌ సొరేన్‌తో సఖ్యత ద్వారా ఈ టీమ్‌ కొంత ప్రయోజనం పొందవచ్చు. రాహుల్‌ గాంధీ సమకాలీన నాయకులైన మిళింద్‌ దియోరా, జ్యోతిరాదిత్య, ఆర్‌.పి.ఎన్‌. సింగ్‌ వంటివారు తమను పార్టీలో పక్కన పెట్టడంతో మన స్తాపం చెంది భాజపాలో చేరిపోయారు. శశి థరూర్‌, మనీష్‌ తివారి, సచిన్‌ పైలెట్‌లను ఒక పరిమితికి మించి అధిష్టానం ఎదగనివ్వడంలేదు. 

ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధినేతదే పూర్తి ఆధిపత్యం. ప శ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీపైనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పూర్తిగా ఆధారపడిరది. బిహార్‌లో రా ష్ట్రీయ జనతాదళ్‌పై ఏకఛత్రాధిపత్యం లాలూప్రసాద్‌ యాదవ్‌, తేజస్వినీ యాదవ్‌లదే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్‌ యాదవ్‌పై, లోక్‌దళ్‌ జయంత్‌ చౌదరి, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ మయావతి, తమిళనాడలో డీఎంకే స్టాలిన్‌పై, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చంద్ర బాబు నాయుడిపై, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కె.సి.ఆర్‌. కుటుంబంపై, కర్ణాటకలో జనతాదళ్‌ సెక్యులర్‌ హెచ్‌.డి. దేవగౌడ`కుమారస్వామి కుటుంబంపై, హర్యానాలో లోక్‌దళ్‌ చౌతా లా కుటుంబంపై, పంజాబ్‌లో అకాలీదళ్‌ బాదల్‌ కుటుంబంపై ఆధారపడి వున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా పార్టీల నాయకుల ఛరిష్మాపై నెట్టుకొస్తున్నాయి తప్ప సంస్థాగత నిర్మాణం, రెం డో స్థాయి నాయకత్వ వృద్ది అనేవి ఇక్కడ సాధ్యంకాదు. ఒకరకంగా చెప్పాలంటే కేంద్రంలో కాం గ్రెస్‌, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యం ముసుగులో ‘రాచరికాన్ని’ అనుసరిస్తున్నాయని చెప్పాలి. 

ఇక కమ్యూనిస్టు పార్టీల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. దేశవ్యాప్తంగా పూర్తిగా పట్టుకోల్పోయి అంపశయ్యపై కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంలో గట్టి ప్రతిపక్షం ఏర్పడే అవకాశాలు కనిపించడంలేదు. 

ప్రస్తుతం భారతీయ ఎన్డీఏ కూటమి దేశంలోని మొత్తం 28రాష్ట్రాలో పంధొమ్మిదింటిలో అధికా రంలో వుంది. ఇక బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. అదేవిధంగా మూడు కేంద్ర పాలితప్రాంతాల్లో రెండిరటిని ఎన్డీఏ కూటమే పాలి స్తోంది. ఒకప్పుడు బీజేపీ రaార్ఖండ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం రaార్ఖండ్‌ ముక్తిమో ర్చా రాష్ట్ర పగ్గాలను చేపట్టింది. ఇక జమ్ము`కశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో గతంలో భాజపా ఇతర పార్టీలతో కూటమి కట్టి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే బీజేపీ ఇప్పటివరకు అధికా రంలోకి రాని రాష్ట్రాలు మూడున్నాయి. అవి వరుసగా తమిళనాడు, తెలంగాణ, కేరళ. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో కలిసి అధికారంలో కొనసాగుతోంది. బీజేపీ కమలం గుర్తుపై పోటీచేసే పార్టీలు కూడా వున్నాయి. ఈ పార్టీలన్నీ తమిళనాడుకు చెందినవే కావడం విశేషం. అవి వరుసగా ఇండియా జననాయగ కచ్చి, పుతియా నీధి కచ్చి, తమిరaగ మక్కల్‌ మున్నేట్ర కజగం, ఇంధియా మక్కల్‌ కల్వి మున్నేట్ర కజగం. సంస్థాగతంగా, వ్యూహాత్మకంగా ముందుకు కదలడంలో భాజపా దరిదాపుల్లో ఏ పార్టీ లేదన్నది అక్షరసత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!