కనుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ..

అయ్యప్ప నామస్మరణతో మారుమడిన యన్మన్ గండ్ల అయ్యప్ప కొండ..

ఆటపాటలతో ఓరెత్తిన అయ్యప్ప స్వాములు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

నవాబుపేట మండలం యన్మన్ గండ్ల అయ్యప్ప కొండ పైన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కన్నుల పండువగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మ రణతో అయ్యప్ప కొండ ప్రాంత మంతా మారుమోగింది. చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజను బుధవారం వైభవంగా నిర్వహించారు.

మిరుమిట్లు గొలిపేల పువ్వుల అలంకరణతో విద్యుత్ కాంతులతో… శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో .. అయ్యప్ప స్వా మికి పంచామృతాభిషేకం చేసి కనుల పండుగగా అయ్యప్ప మహా పడిపూజను నిర్వహించారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామి 18 మెట్లను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్యప్ప, గణపతి, కుమార స్వామి విగ్రహలను ప్రతిష్టించి పూజలు చేశారు.
గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములు శరణు ఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో మహా పడిపూజ లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పెటేతులై ఆడారు.అనంతరం అన్న ప్రసాదం వితహరణ జరిగింది
ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావననేత్రపర్వంగా ఉండాలని గురుస్వామి అన్నారు. ఈ కార్యక్రమానికి నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి వెయ్యిల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు శివ దర్శనం కామునిపల్లి శేఖర్ రెడ్డి, మాచన మోని లక్ష్మయ్య, మరికంటి రామచంద్రయ్య, ఈడికి సుదర్శన్, మాజీ సర్పంచ్ ఆశన్న,మరికంటి రాములు, నరసింహ చారి, వేణునాదం, ధర్మపురం సుధాకర్, పుట్టి అంజనేయులు,జుర్కి నరసింహులు, వివిధ గ్రామాల పెద్దలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version