ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ ను సోమవారం రోజున భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ సందర్శించడం జరిగింది, అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి బాయిలర్ ను ఉపయోగించుకోవాలని తేమశాతం 17 లోపు ఉండేటట్లు రైతులు చూసుకోవాలని అన్నారు అనంతరం బాయిలర్ పనితీరును పరిశీలించి రైతులు ఉపయోగించుకునేటట్లు
అధికారులు చెప్పాలని అన్నారు, రైతుల తమ ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దని గిట్టుబాటు ధర వస్తున్న దాన్యం కొనుగోలు సెంటర్ నే రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మార్కెటింగ్ అధికారులు, తాహసిల్దార్ ఇమామ్ బాబా ఐకెపి సిసి రమణాదేవి, అగ్రికల్చర్ ఏఈఓ సోనీ తదితరులు పాల్గొన్నారు.
