పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్
ఖమ్మం, నేటి ధాత్రి:
ఆడపిల్లలకు ఆత్మ రక్షణ కోసం శారీరక మానసిక మనోధైర్యం కోసం కరాటే ప్రాక్టీస్ ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం ఈవిధంగా ఆడపిల్లలకు నిరంతరం ఉచిత కరాటే శిక్షణ ఇవ్వాలని ఆడవారిపై జరుగుతున్న దాడులు, హింసలు, అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నందు గత 40 రోజుల నుండి నిర్వహించబడుతున్న కరాటే శిక్షణ నిర్వాహకులను శిక్షణ పొందుతున్న చిన్నారులను సీనియర్ నడక సాదకులు డాక్టర్ సీతయ్య, వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు లు అభినందించారు. ఈ సందర్భంగా మంగళవారం రోజు పెవిలియన్ గ్రౌండ్ నందు కరాటే శిక్షణ పొందుతున్న చిన్నారులను పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసి యేషన్ ఆద్వర్యంలో చిన్నారులను ట్రైనింగ్ ఇచ్చిన వారికి ప్రోత్సాహకరంగా పండ్లు, గుడ్లు, బిస్కెట్స్, చాకోలెట్స్ ఇచ్చి వారిపై పూల వర్షం కురిపించి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. అనంతరం కరాటే మాస్టర్స్ యం.సాయిరేఖ, పాషా, షకీరాలను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం డాక్టర్ సీతయ్య, రాకం శ్యామ్ బాబు మాట్లాడుతూ. నేటి పిల్లలు కరాటే విద్యను అభ్యశించడం వలన చక్కని క్రమశిక్షణ కలిగి ఉత్తమ పౌరులు కాగలు
గుతారని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు పౌర సమాజం అన్ని విధాలా సహాయసహ
కారాలు అందించి ప్రోత్సహించాలని అప్పుడే ఆడపిల్లలకు రక్షణ ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారినుంచి రక్షణ కలుగుతుందని కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు శ్రీనివాస రెడ్డి, షఫీ లను అభినందించిన వారిలో వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి కొండమీద వెంకట్, కార్మిక నేత మంద వెంకటేశ్వర్లు, వెంకట్, సుదర్శన్, మూర్తి, నిరంజన్, శ్రీనివాస్,లింగయ్య, వీరయ్య, కృష్ణారెడ్డి సుదర్శన్ రెడ్డి, ప్రసాద్, దామోదర్ రెడ్డి ,తార, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.