Municipal Raids Expose Violations
షాపుల తనిఖీల్లో గుట్టు రట్టు: నిబంధనలు పాటించని వ్యాపారులకు మున్సిపల్ అధికారులు ఫైన్.
కోదాడ, నేటి ధాత్రి :
పట్టణంలో పరిశుభ్రత, ఆహార భద్రత నిబంధనల అమలుపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్డు పై చెత్త వేస్తున్న హాట్ చిప్స్ షాపు యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకుని రూ.2 వేల జరిమానా విధించారు. షాపు పరిసరాల్లో చెత్తను రోడ్డు పై వేయడం గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి పెనాల్టీ విధించారు.అలాగే పట్టణంలోని ఎంఎస్ఆర్ మిల్క్ సెంటర్లో నిర్వహించిన తనిఖీల్లో గడువు ముగిసిన బిస్కెట్లు ప్యాకెట్లు గుర్తించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షాపు యాజమాన్యానికి రూ.1000 జరిమానా విధించారు.గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయం, రోడ్లపై చెత్త వేయడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.ఈ తనిఖీల్లో మున్సిపల్ అధికారులు సానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, రాజయ్య ,జవాన్ గురుస్వామి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.a
