“జే హబ్ హాకేథన్ లీగ్ ఈవెంట్ -2022”

సిద్దిపేట నేటి ధాత్రి

ఇందూరు కళాశాలలో టుడేస్ జే హబ్ హాకేథన్ లీగ్ ఈవెంట్ -2022 శనివారం రోజున

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీ పి రాజు,ఆధ్వర్యంలో

నిర్వహించారు.ఈ సందర్బంగా 

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, జె ఎన్ టి యు లోని జె హబ్ లీగ్ ఈవెంట్‌ల రూపంలో వాటాదారులకు పరిశ్రమ మరియు స్టార్టప్‌ల ద్వారా ఎదురయ్యే సవాళ్ల ఆధారంగా హ్యాకథాన్ ఈవెంట్‌లను రెగ్యులర్ ప్రాతిపదికన నిర్వహిస్తుందని ఒక విద్యా సంవత్సరంలో రెండు లీగ్ ఈవెంట్‌లు ప్లాన్ చేయబడ్డాయని తెలంగాణ మొత్తంలో 11 సెంటర్లు ఎన్నుకోబడినవి అందులో భాగంగా,ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఇందూర్ కాలేజ్ ఒక సెంటర్ గా ఎన్నుకున్నారని ఈ జే హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఉన్న సృజనాత్మకమైన ఇన్నోవేషన్ ఐడియాస్ ప్రాజెక్ట్ ఎన్నుకొని, తెలంగాణ మొత్తములో 11 సెంటర్ నుంచి ద బెస్ట్ ఇన్నోవేషన్ ఐడియాను సెలెక్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ కోసం గవర్నమెంట్ ఫండ్ ఇస్తుందని కావున ప్రతి విద్యార్థి ఈ జె హబ్ ఉపయోగించుకొని తమ యొక్క ఇన్నోవేషన్ ఐడియాలు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 

డాక్టర్ వి పి రాజు, ప్రిన్సిపాల్

డాక్టర్ జావిద్, జె హబ్ కోఆర్డినేటర్,మల్లేశం, హెచ్ ఓ డి, సివిల్ ఎల్ ఎన్ రావు, హెచ్ ఓ డి, ఎలక్ట్రికల్,పోచయ్య,

పి ఆర్ ఓ,మరియు విద్యార్థులు.పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *