మిర్చి రైతులను ప్రభుత్వం

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

కొత్తగూడ, నేటి ధాత్రి : ఈరోజు అఖిల భారత రైతుకూలీ సంఘం ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా కార్యవర్గం పిలుపులో భాగంగా ఏ ఐ కె ఎం ఎస్ కొత్తగూడ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో మండలంలోని గుంజేడు, మైలారం తండా, చింతగట్టు తండా, హనుమాన్ తండా, రౌతు గూడెం తండా, లడాయిగడ్డ ,రామన్నగూడెం, వేలుబెల్లి గ్రామాలలో ప్రతినిధి బృందం సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్ష కార్యదర్శులు గుగులోతు యాదగిరి మాట్లాడుతూ మండలంలోని మిర్చి పంటను సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మిర్చి తోట లో తామర పురుగు రోగం తెల్లదోమ రసం పీల్చే పురుగు పచ్చపురుగు ఎండు తెగులు తదితర చీడపీడల వైరస్ ల తో ఈ సంవత్సరం మిర్చి రైతులను ఇప్పటికే 90% మిర్చి తోటలు నిలువునా ఎండిపోయాను అని ఎన్ని మందులు కొట్టినా తెగుళ్లు అదుపు కావడం లేదని రైతులు దిగులు చెందుతూ మనోధైర్యం కోల్పోతున్నారని వారు అన్నారు.

ఈ యొక్క తెగుళ్లను ప్రకృతి విపత్తు గా ప్రభుత్వం భావించి నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి ఒక లక్ష రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మిర్చి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, కల్తీ లేని పురుగు మందులు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రైతులు బుర్క సూరయ్య, బెల్లి సుధాకర్, లావుడియ సుమన్ , అజ్మీర తిరుపతి, లింగంపల్లి సత్యం, గుంజ దుర్గయ్య ,బిజ్జ వెంకటలక్ష్మి ,రామదన్, సత్యనారాయణ, నర్సిరెడ్డి, కొమురం న ఉప్పలయ్య, ప్రభాకర్ ,రవీందర్, జాముల రాజు, గట్టి నాగేశ్వరరావు, లక్ష్మన్న ,కొమురయ్య, సంజీవ రావు ,భూక్య సారయ్య, గుగులొతుశ్రీను, చెన్నయ్య, సామల నాగరాజు, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.